షార్జా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. అఫ్గాన్ విజయంలో స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 245 పరుగుల లక్ష్య చేధనలో గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఎదుర్కొన్న గుర్భాజ్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. కాగా రహ్మానుల్లాకు ఇది ఎనిమిదో వన్డే అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. తద్వారా గుర్భాజ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
సచిన్, కోహ్లి రికార్డు బద్దలు..
అంతర్జాతీయ వన్డేల్లో అతి పిన్న వయస్సులోనే ఎనిమిది సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా గుర్భాజ్ రికార్డులెక్కాడు. గుర్భాజ్ కేవలం 22 సంవత్సరాల, 349 రోజుల వయస్సులో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రన్ మిషన్ విరాట్ కోహ్లిని గుర్భాజ్ ఆధిగమించాడు. సచిన్ 22 ఏళ్ల 357 రోజుల వయస్సులో ఈ రికార్డు సాధించగా.. కోహ్లి 23 ఏళ్ల 27 రోజుల వయస్సులో అందుకున్నాడు.
ఇక ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్ అగ్రస్ధానంలో ఉన్నాడు. డికాక్ 22 ఏళ్ల 312 రోజుల్లో ఈ రికార్డును నమోదు చేశాడు. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు వన్డేల్లో సాధించిన మొత్తం సెంచరీల(30)లో గుర్భాజ్ సాధించినివే 25 శాతం కావడం గమనార్హం.
చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment