AFG Vs PAK: Afghanistan Stun Pakistan To Script Landmark T20I Series Triumph - Sakshi
Sakshi News home page

PAK vs AFG: పాకిస్తాన్‌కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్‌! ఇదే తొలిసారి

Published Mon, Mar 27 2023 10:49 AM | Last Updated on Mon, Mar 27 2023 11:51 AM

Afghanistan stun Pakistan to script landmark T20I series triumph - Sakshi

Afghanistan vs Pakistan, 2nd T20I: షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టీ20ల్లో 7 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ సంచలన విజయం సాధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆఫ్గాన్‌ సొంతం చేసుకుంది. కాగా పాకిస్తాన్‌పై టీ20 సిరీస్‌ను గెలుచుకోవడం ఆఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి సారి.

రాణించిన గుర్భాజ్‌, ఇబ్రహీం
134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్‌ 3 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. ఆఫ్గాన్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్(49 బంతుల్లో 44) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్(38) కూడా అద్భుతంగా రాణించాడు. పాకిస్తాన్‌ బౌలర్లలో జమాన్‌ ఖాన్‌, ఇహ్సానుల్లా తలా వికెట్‌ సాధించారు.

మరో వికెట్‌ రనౌట్‌ రూపంలో పాకిస్తాన్‌కు లభించింది. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులకే పరిమితమైంది. పాక్‌ బ్యటర్లలో ఇమాద్‌ వసీం(64 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌(32) పర్వాలేదనిపించాడు.

ఆఫ్గాన్‌ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ రెండు కీలక వికెట్లు సాధించగా.. జనత్‌, రసీద్‌ ఖాన్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌ తలా వికెట్‌ పడగొట్టారు. ఇక నామమాత్రపు మూడో టీ20 షార్జా వేదికగా సోమవారం జరగనుంది.
చదవండి: PAK vs AFG: టీ20ల్లో పాక్‌ బ్యాటర్‌ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement