
అఫ్గానిస్తాన్ జట్టుకు పసికూన ఐర్లాండ్ ఊహించని షాకిచ్చింది. షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో 38 పరుగుల తేడాతో ఐర్లాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు బల్బర్నీ(22), స్టిర్లింగ్(25) పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. నంగేయాలియా ఖరోటే 2వికెట్లు, ఓమర్జాయ్ చెరో వికెట్ సాధించారు.
చెలరేగిన బెంజిమిన్ వైట్..
అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో 38 పరుగుల తేడాతో అఫ్గాన్ ఓటమి పాలైంది. ఐర్లాండ్ స్పిన్నర్ బెంజిమిన్ వైట్ 4 వికెట్లతో అఫ్గాన్‌ను దెబ్బతీశాడు.
అతడితో పాటు లిటిల్ 3 వికెట్లు, మెక్‌గ్రాతీ రెండు, అడైర్ వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ ఇషాఖ్(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 17న జరగనుంది.
చదవండి: CSK: సీఎస్‌కేకు బిగ్ షాక్! డెత్ ఓవర్ల స్పెషలిస్టు అవుట్!
Comments
Please login to add a commentAdd a comment