ఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20 ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో ఇరగదీసిన రషీద్.. ఆతర్వాత బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
రషీద్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీఖుల్లా అటల్ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్‌తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
పై ముగ్గురు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ రాణించలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 3, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ తలో 2 వికెట్లు, బెంజమిన్ వైట్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. రషీద్ ఖాన్ (4-0-14-4), ఖరోటే (4-0-23-2), నబీ (3-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో బల్బిర్నీ (45), గ్యారెత్ డెలానీ (39) మాత్రమే రాణించారు.
We have seen that before! 😄
— Afghanistan Cricket Board (@ACBofficials) March 17, 2024
Just @RashidKhan_19 being Rashid Khan! 🤩👏🙌#AfghanAtalan | #AFGvIRE2024 pic.twitter.com/yxRqBibMQf
బంతిని చూడకుండానే సిక్సర్ బాదిన రషీద్..
ప్రపంచ స్థాయి బౌలర్ అయిన రషీద్ ఖాన్ అడపాదడపా బ్యాట్‌తోనూ ప్రతాపం చూపించడం తెలిసిందే. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో రషీద్ మరోసారి బ్యాట్‌తో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్ ఆఖరి బంతికి రషీద్ బాదిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బ్యారీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో రషీద్ బంతిని చూడకుండానే సిక్సర్‌గా మలిచాడు. లెగ్‌సైడ్ దిశగా మెక్‌కార్తీ సంధించిన ఫుల్ టాస్ బంతిని రషీద్ కళ్లు మూసుకుని సిక్సర్ కొట్టాడు.
రషీద్‌కు ఇలాంటి షాట్లు ఆడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి షాట్లు చాలాసార్లు ఆడాడు. రషీద్ బాదిన ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్ తొలి మ్యాచ్‌లో గెలవగా.. ఆఫ్ఘనిస్తాన్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (మార్చి 18) జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment