sixer records
-
T20 World Cup 2024: ఉతికి 'ఆరే'సిన బట్లర్.. దెబ్బకు ప్యానెల్ బద్దలు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా నిన్న (జూన్ 23) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో యూఎస్ఏపై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వీర విహారం చేశాడు. కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ కొట్టిన సిక్సర్లలో ఓ భారీ సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో సౌరభ్ నేత్రావల్కర్ బౌలింగ్ బట్లర్ బాదిన ఈ సిక్సర్.. 104 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్‌ను బద్దలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట షికార్లు కొడుతుంది. బట్లర్ ఉతుకుడును చూసిన వారంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.The Solar Panel damaging 104M six of Jos Buttler. 🌟pic.twitter.com/us41FZnZCF— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024ఇదిలా ఉంటే, గ్రూప్-2 నుంచి ఇవాళ మరో సెమీస్ బెర్త్ ఖరారైంది. విండీస్‌ను ఓడించి సౌతాఫ్రికా సెమీస్‌కు చేరింది. ఇవాళ ఉదయం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా గ్రూప్-2లో తొలి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ రెండో ప్లేస్‌కు పరిమితం కాగా.. విండీస్, యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.ఇంగ్లండ్-యూఎస్ఏ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ.. క్రిస్ జోర్డన్ (2.5-0-10-4) హ్యాట్రిక్ వికెట్లతో, ఆదిల్ రషీద్ (4-0-13-2) అద్బుత బౌలింగ్ ప్రదర్శనతో చెలరేగడంతో 18.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. యూఎస్ ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. బట్లర్ సహచర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. -
Viral Video: కళ్లు చెదిరే సిక్సర్ బాదిన రషీద్ ఖాన్
ఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో టీ20 ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో ఇరగదీసిన రషీద్.. ఆతర్వాత బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రషీద్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీఖుల్లా అటల్ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్‌తో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పై ముగ్గురు మినహా ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ రాణించలేకపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 3, జాషువ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ తలో 2 వికెట్లు, బెంజమిన్ వైట్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. రషీద్ ఖాన్ (4-0-14-4), ఖరోటే (4-0-23-2), నబీ (3-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమై 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో బల్బిర్నీ (45), గ్యారెత్ డెలానీ (39) మాత్రమే రాణించారు. We have seen that before! 😄 Just @RashidKhan_19 being Rashid Khan! 🤩👏🙌#AfghanAtalan | #AFGvIRE2024 pic.twitter.com/yxRqBibMQf — Afghanistan Cricket Board (@ACBofficials) March 17, 2024 బంతిని చూడకుండానే సిక్సర్ బాదిన రషీద్.. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన రషీద్ ఖాన్ అడపాదడపా బ్యాట్‌తోనూ ప్రతాపం చూపించడం తెలిసిందే. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో రషీద్ మరోసారి బ్యాట్‌తో తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్ ఆఖరి బంతికి రషీద్ బాదిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. బ్యారీ మెక్‌కార్తీ బౌలింగ్‌లో రషీద్ బంతిని చూడకుండానే సిక్సర్‌గా మలిచాడు. లెగ్‌సైడ్ దిశగా మెక్‌కార్తీ సంధించిన ఫుల్ టాస్ బంతిని రషీద్ కళ్లు మూసుకుని సిక్సర్ కొట్టాడు. రషీద్‌కు ఇలాంటి షాట్లు ఆడటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి షాట్లు చాలాసార్లు ఆడాడు. రషీద్ బాదిన ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఐర్లాండ్ తొలి మ్యాచ్‌లో గెలవగా.. ఆఫ్ఘనిస్తాన్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (మార్చి 18) జరుగనుంది. -
IND VS ENG 2nd Test: అరుదైన క్లబ్లో చేరిన జైస్వాల్
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారీ సెంచరీ (179) చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న టీమిండియా భవిష్యత్ తార, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్న 16వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. Reaching a Test Hundred with a SIX for India Umrigar Kapil Dev Tendulkar (6 times) Azharuddin Dravid Sehwag Irfan Pathan Gambhir (2 times) MS Dhoni Harbhajan KL Rahul (twice) Rohit (3 times) Ashwin Pujara Pant (2 times) JAISWAL pic.twitter.com/ExOjCFhUQR — Cricketopia (@CricketopiaCom) February 2, 2024 సిక్సర్‌తో సెంచరీ మార్కును తొలుత పాలీ ఉమ్రిగర్ అందుకోగా.. అత్యధిక సార్లు ఈ ఫీట్‌ను సాధించిన రికార్డు సచిన్ టెండూల్కర్ ఖాతాలో ఉంది. సచిన్ ఏకంగా ఆరు సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్నాడు. సచిన్ తర్వాత ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా మూడు సార్లు ఇలా సెంచరీ మార్కును తాకాడు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తలో రెండు సార్లు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశారు. విశేషమేమిటంటే హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఫుల్‌టైమ్ బౌలర్లు కూడా సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశారు. వీరిద్దరూ తలో సారి ఇలా సెంచరీ మార్కును అందుకున్నారు. ఈ జాబితాలో పైపేర్కొన్న వారు కాకుండా కపిల్ దేవ్, మొహమ్మద్ అజారుద్దీన్, రాహల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఎంఎస్ ధోని, పుజారా ఉన్నారు. సిక్సర్‌తో సెంచరీ మార్కును ఓసారి తాకిన సెహ్వాగ్.. డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ మార్కును కూడా సిక్సర్‌తో చేరుకుని చరిత్రపుటల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27), రజత్ పాటిదార్ (32), అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17) తక్కువ స్కోర్లకే ఔటైనా యశస్వి కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేశాడు. యశస్వితో పాటు అశ్విన్ (5) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం బౌలర్ షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, టామ్ హార్ట్లీ తలో వికెట్ దక్కించకున్నారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
రాకాసి సిక్సర్.. కొడితే ఏకంగా..!
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ రాకాసి సిక్సర్ బాదాడు. లియామ్ డాసన్ బౌలింగ్‌లో క్లాసెన్ బాదిన ఈ సిక్సర్ ఏకంగా 105 మీటర్ల దూరం వెళ్లి, లీగ్ చరిత్రలోనే భారీ సిక్సర్‌గా రికార్డైంది. కళ్లు చెదిరే ఈ షాట్ చూసి అభిమానులు ముగ్దులవుతున్నారు. ఆధునిక క్రికెట్లో అతి భారీ సిక్సర్ అంటూ కొనియాడుతున్నారు. భారీ కాయుడైన క్లాసెన్ బలంగా బాదడంతో బంతి ఏకంగా స్టేడియం రూఫ్ ఎక్కింది. క్రికెట్ చరిత్రలో లాంగెస్ట్ సిక్సర్‌కు సంబంధించిన పూర్తి డేటా లేకపోవడంతో ఈ సిక్సర్‌కు ఎలాంటి అధికారిక గుర్తింపు దక్కలేదు. సౌతాఫ్రికా టీ20 లీగ్ వరకైతే ఇదే అతి భారీ సిక్సర్ అని లీగ్ నిర్వహకులు ప్రకటించారు. మొత్తానికి ఈ రాకాసి సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరవలవుతుంది. Just the longest six of the #Betway #SA20 so far… no big deal. 🫨🙌#WelcomeToIncredible #DSGvSEC pic.twitter.com/7F4xjI9Rxi — Betway SA20 (@SA20_League) January 20, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో వియాన్ ముల్దర్ (29 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయాడు. బ్రీట్జ్కీ (35), క్లాసెన్ (31), ప్రిటోరియస్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో హార్మర్ 4 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ వారెల్, బార్ట్‌మన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ (66 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జన్సెన్ (24 నాటౌట్), మార్క్రమ్ (38), హెర్మన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో స్టోయినిస్ 2, రీస్ టాప్లే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. సన్‌రైజర్స్ మూడో స్థానానికి ఎగబాకింది. -
CWC 2023 AUS VS NZ: అతి భారీ సిక్సర్ నమోదు
2023 వన్డే ప్రపంచకప్లోకెళ్లా అత్యంత భారీ సిక్సర్ ఇవాళ (అక్టోబర్ 28) జరుగుతున్న ఆసీస్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో నమోదైంది. ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్‌ను సాధించాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్సర్ బాదాడు. మ్యాక్స్‌వెల్ కొట్టిన బంతి స్టేడియం రూఫ్‌పై పడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అతి భారీ సిక్సర్. మ్యాక్స్‌వెల్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా ఆటగాడు శ్రేయస్ పేరిట ఉండేది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 101 మీటర్ల సిక్సర్ బాదాడు. అయ్యర్‌కు ముందు డేవిడ్ వార్నర్ 98 మీటర్ల సిక్సర్, డారిల్ మిచెల్ 98 మీట్లర సిక్సర్, డేవిడ్ మిల్లర్ 95 మీటర్ల సిక్సర్లు బాదారు. Glenn Maxwell smashes the biggest six of the 2023 World Cup. 104M at the Dharamshala Stadium. pic.twitter.com/soR1PNxPNm — Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2023 కాగా, కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగి 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇతనికి ముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు జోష్ ఇంగ్లిస్ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), పాట్ కమిన్స్ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, బౌల్ట్ చెరి 3 వికెట్లు, సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, నీషమ్ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. ఓపెనర్లు కాన్వే (28), విల్ యంగ్ (32) ఔట్ కాగా.. రచిన్ రవీంద్ర (18), డారిల్ మిచెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ కోల్పోయిన 2 వికెట్లు హాజిల్‌వుడ్‌కు దక్కాయి. -
Pak Vs SA: టీ20 వరల్డ్‌కప్‌లోనే అత్యంత భారీ సిక్సర్..!
టీ20 వరల్డ్‌కప్-2022లో అత్యంత భారీ సిక్సర్ నమోదైంది. సూపర్-12 గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 3) జరిగిన మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ 106 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డ్ అయ్యింది. ఎంగిడి వేసిన 16వ ఓవర్ నాలుగో బంతిని ఇఫ్తికార్ అహ్మద్.. డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి సాగనంపాడు. ఇఫ్తికార్ ఈ షాట్ ఆడిన విధానాన్ని చూసి బౌలర్ ఎంగిడి అవాక్కయ్యాడు. ఈ షాట్ తర్వాత సిడ్నీ స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతుంది. #PAKvSA #T20WorldCup Iftikhar Ahmed hits the BIGGEST 6️⃣ of T20 World Cup 2022 💥 pic.twitter.com/MRWhl43TkG — MK CHAUDHARY 03 (@LovelyKhateeb) November 3, 2022 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఇఫ్తికార్ అహ్మద్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. ఆరంభంలోనే వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. టెంబా బవుమా (19 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్సర్), ఎయిడెన్ మార్క్రమ్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు) ధాటిగానే ఆడినా ఒకే ఒవర్లో వీరిద్దరూ ఔట్ కావడంతో సఫారీల కష్టాలు అధికమయ్యాయి. ఈ దశలో ఒక్కసారిగా భారీ వర్షం కూడా మొదలుకావడంతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. వర్షం మొదలయ్యే సమయానికి ఆ జట్టు స్కోర్ 9 ఓవర్ల తర్వాత 69/4గా ఉంది. సఫారీలు గెలవాలంటే 66 బంతుల్లో 117 పరుగులు చేయాల్సి ఉంది. హెన్రిచ్ క్లాసెన్ (2), ట్రిస్టన్ స్టబ్స్ (2) క్రీజ్‌లో ఉన్నారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారమయితే దక్షిణాఫ్రికా ఇంకా 15 పరుగులు వెనకపడి ఉంది. ఒకవేళ మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం పాక్‌నే విజేతగా ప్రకటిస్తారు. వర్షం ఎడతెరిపినివ్వడంతో మళ్లీ మొదలైన మ్యాచ్.. సౌతాఫ్రికా టర్గెట్ ఎంతంటే..? వర్షం ఎడతెరిపినివ్వడంతో పాక్-సౌతాఫ్రికా మ్యాచ్ మళ్లీ మొదలైంది. అయితే మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించి 142 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించారు. ఇప్పటికే ఆ జట్టు 9 ఓవర్లు ఆడేయడంతో మరో 5 ఓవర్లలో 73 పరుగులు సాధించాల్సి ఉంది. -
వరల్డ్‌కప్‌లో భారీ సిక్సర్.. కండలు చూపించిన బ్యాటర్
టీ20 వరల్డ్‌కప్-2022లో భారీ సిక్సర్ నమోదైంది. శ్రీలంకతో జరిగిన గ్రూప్-ఏ క్వాలిఫయర్ మ్యాచ్‌లో యూఏఈ ఆటగాడు జునైద్ సిద్ధిఖి ఈ ఘనత సాధించాడు. 10వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన అతను.. దుష్మంత చమీరా వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతికి 109 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు. స్టంప్స్‌పైకి వచ్చిన బంతిని జునైద్ డీప్ మిడ్ వికెట్ మీదుగా స్టేడియం దాటించాడు. ఈ మాన్స్టర్ సిక్సర్ బాదిన అనంతరం జునైద్ సెలబ్రేట్ చేసుకున్న తీరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. జునైద్.. సిక్సర్ కొట్టగానే తన బలం ఇదంటూ కండలు చూపించాడు. pic.twitter.com/teQxUZMWi6 — Sanju Here 🤞👻 (@me_sanjureddy) October 18, 2022 pic.twitter.com/VHnnS9nAO6 — Sanju Here 🤞👻 (@me_sanjureddy) October 18, 2022 ఇదిలా ఉంటే, జునైద్ సిక్సర్ బాదినప్పటికే యూఏఈ ఓటమి దాదాపుగా ఖరారైంది. శ్రీలంక నిర్ధేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లు హసరంగ (3/8), దుష్మంత చమీరా (315), మహీశ్ తీక్షణ (2/15), ప్రమోద్ మధుషన్ (1/14), దసున్ షనక (1/7).. యూఏఈ బ్యాటింగ్ లైనప్‌కు కకావికలం చేశారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. ఇన్నింగ్స్ మొత్తంలో ఒకే ఒక సిక్సర్ నమోదైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక (60 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వ (33) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్‌లో అందరూ విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో కార్తీక్ మెయప్పన్ (3/19) హ్యాట్రిక్‌తో సత్తా చాటగా.. జహూర్ ఖాన్ 2, అఫ్జల్ ఖాన్, ఆర్యన్ లక్రా తలో వికెట్ పడగొట్టారు. -
సచిన్ రికార్డుపై కన్నేసిన ధోనీ!
ఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. దాంతో పాటు మరిన్ని రికార్డులు ధోనీని ఊరిస్తున్నాయి. నేటి మ్యాచ్ లో ధోనీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ నమోదైతే ఆ రికార్డులు సులువగా సాధిస్తాడు. ఆ రికార్డులు ఏంటంటే.. వన్డేల్లో ధోనీ మరో మూడు సిక్స్ లు కొడితే సచిన్(195 సిక్సర్లు) రికార్డును అధిగమిస్తాడు. అదే విధంగా 7 సిక్స్ లు కొడితే వన్డేలలో 200 సిక్సర్ల రికార్డును నమోదు చేసిన భారత తొలి ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఎంఎస్ ధోనీ మరో 61 పరుగులు సాధిస్తే వన్డేల్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. కెరీర్ లో 279 వన్డేలు ఆడిన ధోనీ 8,939 పరుగులు చేశాడు. మరికొంత కాలం వన్డేల్లో కొనసాగే అవకాశం ఉన్నందున పదివేల క్లబ్ లో చేరే అవకాశం ధోనీకి ఉంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భారత సారథి ధోనీ రికార్డులపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కివీస్ పై విరాట్ కోహ్లీ నేతృత్వంలో టెస్ట్ సిరీస్ ను 3-0తో క్లీన్ స్విప్ చేసిన టీమిండియా, ప్రస్తుతం ధోనీ నాయకత్వంలో తొలి వన్డేలో కివీస్ పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.