నజీబుల్లా వీరవిహారం.. నాలుగో టీ20లో అఫ్ఘనిస్థాన్‌ సూపర్‌ విక్టరీ | IRE VS AFG 4th T20I: Afghanistan Beat Ireland, Take Series To Decider | Sakshi
Sakshi News home page

IRE VS AFG 4th T20I: నజీబుల్లా వీరవిహారం.. ఐర్లాండ్‌పై అఫ్ఘనిస్థాన్‌ సూపర్‌ విక్టరీ

Published Tue, Aug 16 2022 11:37 AM | Last Updated on Tue, Aug 16 2022 11:40 AM

IRE VS AFG 4th T20I: Afghanistan Beat Ireland, Take Series To Decider - Sakshi

ఐర్లాండ్‌ పర్యటనలో వరుస ఓటములు చవిచూసిన అఫ్ఘనిస్థాన్‌ తిరిగి గాడిలో పడింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన నబీ సేన.. వరుసగా 3, 4 మ్యాచ్‌ల్లో గెలుపొంది సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న (ఆగస్ట్‌ 15) జరిగిన నాలుగో టీ20లో అఫ్ఘనిస్థాన్‌ 27 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను మట్టికరిపించింది. 

వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘనిస్థాన్‌.. నజీబుల్లా జద్రాన్‌ (24 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం, రషీద్‌ ఖాన్‌ (10 బంతుల్లో 31 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌ సాయంతో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌.. అఫ్ఘాన్‌ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో 11 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. 

జార్జ్‌ డాక్రెల్‌ (27 బంతుల్లో 41 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐర్లాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేయగా.. మిగతా ఆటగాళ్లందరూ విఫలయ్యారు. ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌ (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, సిక్స్‌), ఆండ్రూ బల్బిర్నీ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ ఐర్లాండ్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆఫ్ఘాన్‌ బౌలర్లలో ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌ 3, రషీద్‌ ఖాన్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌ తలో 2 వికెట్లు, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక ఐదో టీ20 ఆగస్ట్‌ 17న జరుగనుం‍ది. 
చదవండి: చెలరేగిన మొయిన్ అలీ.. రెచ్చిపోయిన లివింగ్‌స్టోన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement