బంగ్లా బౌలర్ల ధాటికి అఫ్గనిస్తాన్ కుదేలు(PC: Cricketworldcup.com)
ICC Cricket World Cup 2023 - Bangladesh vs Afghanistan: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ 156 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి తాళలేక బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 37.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ధర్మశాల వేదికగా శనివారం టాస్ ఓడిన అఫ్గాన్.. బంగ్లా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
ఓపెనర్ల శుభారంభం.. ఆ తర్వాత
ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ 47, ఇబ్రహీం జద్రాన్ 22 పరుగులతో శుభారంభం అందించారు. వీరిద్దరు అవుటైన తర్వాత ఆఫ్గన్ ఇన్నింగ్స్ పతనం ఆరంభమైంది. బంగ్లాదేశ్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
పెవిలియన్‌కు క్యూ కట్టారు
ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన రహ్మత్ షా 18, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది 18, నజీబుల్లా జద్రాన్ 5, మహ్మద్ నబీ 6, అజ్మతుల్లా ఒమర్జాయ్ 22, రషీద్ ఖాన్ 9, ముజీబ్ ఉర్ రహమాన్ 1 పరుగు తీయగా.. నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫారుకీ డకౌట్లుగా వెనుదిరిగారు.
షోరిఫుల్ ఇస్లాం.. నవీన్‌ను బౌల్డ్ చేయడంతో ఆఫ్గన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 156 పరుగులకే హష్మతుల్లా బృందం చాపచుట్టేసింది. కాగా ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు బౌల్డ్ కావడం గమనార్హం. ఇక బంగ్లా బౌలర్లలో స్పిన్నర్లు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు 3, మెహిదీ హసన్ మిరాజ్‌కు 3 వికెట్లు దక్కగా.. పేసర్లు ముస్తాఫిజుర్ రహ్మాన్ ఒకటి, షోరిఫుల్ ఇస్లాం 2, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.
వరల్డ్‌కప్ టోర్నీలో అఫ్గన్‌తో మ్యాచ్ అంటే షకీబ్ తగ్గేదేలే!
ధర్మశాలలో అఫ్గనిస్తాన్‌తో తాజా మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. గతంలో 2015, 2019 ప్రపంచకప్ ఈవెంట్లలో కాన్‌బెర్రా, సౌతాంప్టన్ మ్యాచ్‌లలో అఫ్గన్‌పై వరుసగా 2/43, 5/29 బౌలింగ్ ఫిగర్స్ సాధించాడు. ఈ క్రమంలో అఫ్గన్‌పై ఐసీసీ ఈవెంట్లో రెండోసారి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
చదవండి: WC 2023: ఆసీస్‌తో మ్యాచ్‌కు గిల్ దూరం.. రోహిత్‌కు జోడీగా ఇషాన్ ఫిక్స్!
Comments
Please login to add a commentAdd a comment