ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కేవలం గంటల వ్యవధిలో భారీ మార్పు వచ్చింది. మొన్న (ఆగస్ట్ 24) హంబన్‌తోటలో పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తై, చెత్త రికార్డులు మూటగట్టుకున్న ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఆగస్ట్ 24) అదే పాకిస్తాన్‌తో అదే హంబన్‌తోటలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ పలు అరుదైన రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (135), ఇబ్రహీమ్ జద్రాన్ (80) తొలి వికెట్‌కు ఏకంగా 227 పరుగులు జోడించి పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. పాక్‌పై 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ జోడీగా.. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా.. 2010 తర్వాత పాక్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (227) నమోదు చేసిన రెండో జోడీగా పలు రికార్డులు మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రహ్మానుల్లా గుర్భాజ్.. పాకిస్తాన్‌పై వన్డే సెంచరీ చేసిన తొలి ఆప్ఘన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
తొలి వికెట్‌కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన అనంతరం ఉసామా మిర్ బౌలింగ్‌లో ఇఫ్తికార్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి జద్రాన్ (80) ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 43 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 247 పరుగులు చేసింది. గుర్భాజ్ (147), మహ్మద్ నబీ (7) క్రీజ్‌లో ఉన్నారు.
తేలిపోయిన పాక్ పేసర్లు..
తొలి వన్డేలో ఆఫ్ఘన్ ప్లేయర్ పాలిట సింహస్వప్నల్లా ఉండిన పాక్ పేసర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్ ఈ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. షాహీన్ అఫ్రిది, నసీం షా సైతం అతన్ని ఫాలో అయ్యారు. ఈ మ్యాచ్‌లో ఈ పేస్ త్రయం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment