శ్రీలంకలోని హంబన్‌తోట వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్ 24) జరుగుతున్న రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్భాజ్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో (151 బంతుల్లో 151; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించిన గుర్బాజ్.. పాకిస్తాన్‌పై వన్డేల్లో 150 పరుగుల మార్కు తాకిన తొలి వికెట్‌కీపర్/బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గుర్భాజ్‌కు ముందు పురుషుల వన్డే క్రికెట్‌లో ఏ వికెట్‌కీపర్ కూడా పాక్‌పై ఈ ఘనత సాధించ లేదు.
2005లో టీమిండియా మాజీ వికెట్‌కీపర్, మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వైజాగ్ వన్డేలో పాక్‌పై 148 పరుగులు (123 బంతుల్లో) చేశాడు. గుర్భాజ్‌కు ముందు పాక్‌పై వన్డేల్లో ఓ వికెట్‌కీపర్ సాధించిన అత్యధిక స్కోర్ ఇదే. ఈ రికార్డుతో పాటు గుర్భాజ్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్‌పై వన్డేల్లో సెంచరీ చేసిన తొలి ఆప్ఘన్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
కాగా, గుర్భాజ్ భారీ శతకంతో వీరవిహారం చేయడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుర్భాజ్‌కు మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (101 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించడంతో ఆఫ్ఘనిస్తాన్..పాక్‌పై అత్యధిక వన్డే స్కోర్ సాధించింది.
ఈ మ్యాచ్‌లో గుర్భాజ్, ఇబ్రహీమ్ జద్రాన్ (80) జోడీ తొలి వికెట్‌కు ఏకంగా 227 పరుగులు జోడించి పలు రికార్డులు సొంతం చేసుకుంది. పాక్‌పై 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ జోడీగా.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా.. 2010 తర్వాత పాక్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (227) నమోదు చేసిన రెండో జోడీగా పలు రికార్డులు మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment