కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. 101 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో మాథ్యూ ఫోర్డ్ వేసిన మూడో ఓవర్‌లో గుర్బాజ్ శివాలెత్తిపోయాడు.
హ్యాట్రిక్ సిక్సర్లు సహా మొత్తం నాలుగు సిక్సర్లు బాదాడు. గుర్బాజ్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ లేదు. అన్నీ సిక్సర్లే. గుర్బాజ్ ఊచకోత ధాటికి వారియర్స్ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో ఛేదించింది. గుర్బాజ్‌కు జతగా టిమ్ రాబిన్సన్ (20 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
— Cricket Cricket (@cricket543210) September 8, 2024
వారియర్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్ 11, ఆజమ్ ఖాన్ 0, హెట్‌మైర్ 8, కీమో పాల్ 1 పరుగు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. గుడకేశ్ మోటీ (3.3-0-16-3), ఇమ్రాన్ తాహిర్ (4-0-29-3), కీమో పాల్ (2-0-19-2), ప్రిటోరియస్ (2-0-10-1) ధాటికి 14.3 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ ఫోర్డ్ (31), జాన్సన్ ఛార్లెస్ (19), టిమ్ సీఫర్ట్ (12), అకీమ్ అగస్ట్ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో వారియర్స్ సీజన్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. లూసియా కింగ్స్ సీజన్ తొలి ఓటమిని ఎదుర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment