చెలరేగిన అఫ్గాన్‌ ఓపెనర్లు.. ఉగండా ముందు భారీ టార్గెట్‌ | Rahmanullah Gurbaz and Ibrahim Zadran take Afghanistan to 183-5 | Sakshi
Sakshi News home page

T20 WC: చెలరేగిన అఫ్గాన్‌ ఓపెనర్లు.. ఉగండా ముందు భారీ టార్గెట్‌

Published Tue, Jun 4 2024 8:13 AM | Last Updated on Tue, Jun 4 2024 8:13 AM

Rahmanullah Gurbaz and Ibrahim Zadran take Afghanistan to 183-5

టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ బ్యాటర్లు దంచికొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ రెహ్మతుల్లా గుర్భాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 

వికెట్‌కు వీరిద్దరూ 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్భాజ్‌(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు), ఇబ్రహీం జద్రాన్‌(46 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70) అదరగొట్టారు. ఉగండా బౌలర్లలో కాస్మాస్ క్యూవటా, మసబా తలా రెండు వికెట్లు సాధించగా.. రామ్‌జనీ ఒక్క వికెట్‌ సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement