యూఏఈతో జరుగుతున్న తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో గుర్బాజ్ కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తయ్యాక గుర్బాజ్ మరో రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. గుర్బాజ్‌కు టీ20ల్లో ఇది తొలి శతకం. ఆఫ్ఘనిస్తాన్ తరఫున 44 మ్యాచ్‌లు ఆడిన గుర్బాజ్.. సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 1143 పరుగులు చేశాడు. గుర్బాజ్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. గుర్బాజ్ ఐపీఎల్‌లో గుజరాత్, కేకేఆర్‌ల తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 133.53 స్ట్రయిక్‌రేట్‌తో 227 పరుగులు చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో గుర్బాజ్‌తో పాటు కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జద్రాన్ 37 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. వీరిద్దరూ చెలరేగి ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 18 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 173/2గా ఉంది. జద్రాన్‌తో పాటు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ, అయాన్ అఫ్జల్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్.. యూఏఈలో పర్యటిస్తుండగా, షార్జాలో ఇవాళ (డిసెంబర్ 29) తొలి టీ20 జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment