బంగ్లాదేశ్‌కు వారి సొంతగడ్డపైనే అఫ్గానిస్తాన్ షాకిచ్చింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆఫ్గన్ బౌలర్ల ధాటికి 43.2 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. ముష్ఫికర్ రహీమ్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెహదీ హసన్ మిరాజ్ 25 పరుగులు చేశాడు.
ఆఫ్గన్ బౌలర్లలో ఫజల్లా ఫరుకీ, ముజీబ్ ఉర్ రెహమాన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, మహ్మద్ నబీ ఒక వికెట్ పడగొట్టాడు. వన్డే చరిత్రలో పరుగుల పరంగా అఫ్గానిస్తాన్‌కు ఇది మూడో అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇక మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో అఫ్గానిస్తాన్ కైవసం చేసుకుంది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్(125 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 8 సిక్సర్లు), ఇబ్రహీం జర్దన్(119 బంతుల్లో 100 పరుగులు, 9 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగారు.వీరి తర్వాత మహ్మద్ నబీ చివర్లో 15 బంతుల్లో 25 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్, హసన్ ముహ్మద్, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. ఎబాదత్ హొసెన్ ఒక వికెట్ తీశాడు.
What a Win! 🙌#AfghanAtalan have opened a new chapter in 🇦🇫 Cricket History by securing their first-ever ODI series with successive wins over Bangladesh. 💪
— Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023
Congratulations to AfghanAtalan and the whole Afghan Nation for an incredible achievement. 👏🤩#BANvAFG | #XBull pic.twitter.com/8LOGortG2I
🚨 RESULT | AFGHANISTAN WON BY 142 RUNS#AfghanAtalan backed up their brilliant batting effort with a much better bowling performance to beat the @BCBtigers by 142 runs and secure their first-ever series victory over Bangladesh in the format. 🤩#BANvAFG2023 | #XBull pic.twitter.com/U3BSfIAtMI
— Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023
చదవండి: #BANVsAFG: సెంచరీలతో చెలరేగిన ఆఫ్గన్ ఓపెనర్లు.. ప్రపంచ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment