న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (48 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి తమ జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిలో గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు.
గుర్బాజ్-జద్రాన్ జోడీ తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించిన అనంతరం జద్రాన్ ఔటయ్యాడు. అనంతరం 18.4వ ఓవర్‌లో (122 పరుగుల వద్ద) జోస్ బట్లర్ అద్బుతమైన స్టంపింగ్ చేయడంతో వన్‌డౌన్‌లో వచ్చిన రహ్మాత్ షా కూడా పెవిలియన్‌కు చేరాడు. షా ఔటైన మరుసటి బంతికే సెంచరీ చేస్తాడనుకున్న గుర్బాజ్ కూడా అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు.
#ENGvsAFG #stumpout #runout pic.twitter.com/OpNQSwkWPX
— nadeem 05 (@hotvideos097) October 15, 2023
దీంతో మ్యాచ్ ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్‌వైపు నుంచి ఇంగ్లండ్‌వైపు మలుపు తిరిగింది. 8 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూడా క్రమం తప్పకుండా మరో 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్ (23) జోడీ ఆదుకుంది. వీరిద్దరు ఏడో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. అనంతరం ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జో రూట్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టడంతో రషీద్ ఖాన్ కూడా ఔటయ్యాడు. 44.1 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 233/7గా ఉంది. అలీఖిల్ (44), ముజీబ్ క్రీజ్‌లో ఉన్నారు.
Rahmanullah Gurbaz is so much angry with himself after run out #ENGvsAFG #Sorry_Pakistan #IndiavsPak #Rizwan #BabarAzam #RohitSharma𓃵 Shaheen Skipper KL Rahul BCCI Namaz Chennai Rizwan Indians, Godavari Wasim Akram Ahmedabad Gujarat, Sri Lankan Shami pic.twitter.com/meZDHuy6kp
— cricketbuzz⁴⁵ (@Mohdyasir6911) October 15, 2023
కోపంతో ఊగిపోయిన గుర్బాజ్..
ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన గుర్బాజ్.. అనవసరంగా రనౌట్ కావడంతో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. గ్రౌండ్‌లో కోపాన్ని ఆపుకున్న గుర్బాజ్.. పెవిలియన్‌కు చేరే క్రమంలో బౌండరీ రోప్‌పై, ఆతర్వాత డగౌట్‌లో కుర్చీపై తన ప్రతాపాన్ని చూపాడు. పట్టలేని కోపంతో ఊగిపోయిన గుర్బాజ్ బౌండరీ రోప్‌ను, కుర్చీని బ్యాట్‌తో గట్టిగా కొడుతూ, కేకలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Run Out On 80 💔
— Jega8 (@imBK08) October 15, 2023
Rahmanullah Gurbaz Missed Out On A Well-deserved World Cup Hundred!#ENGvAFG #WorldCup #CWC23 #Gurbaz pic.twitter.com/xiHPoUWSPO
Comments
Please login to add a commentAdd a comment