Afghanistan v England
-
వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలు.. స్టార్ట్ చేసింది ఎవరంటే..?
వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై పసికూన ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో ఇలాంటి సంచలనాలు ఎప్పుడెప్పుడు నమోదయ్యాయని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. వన్డే వరల్డ్‌కప్‌లో ఇలాంటి సంచలనాలు ఎప్పుడెప్పుడు నమోదయ్యాయని పరిశీలిస్తే.. సంచలనాలకు నాంది పలికింది భారతే అని తెలుస్తుంది. 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ నేతృత్వంలోని టీమిండియా నాటి మేటి జట్టైన వెస్టిండీస్‌ను మట్టికరిపించి, తొలిసారి జగజ్జేతగా ఆవతరించింది. అదే వరల్డ్‌కప్‌లో మరో సంచలనం కూడా నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న జింబాబ్వే.. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించింది. అనంతరం 1992 ఎడిషన్‌లో కూడా జింబాబ్వే జట్టు సంచలన విజయం సాధించింది. ఆ టోర్నీలో వారు ఇంగ్లండ్‌కు షాకిచ్చారు. 1996 వరల్డ్‌కప్‌లో ఏకంగా పెను సంచలనమే నమోదైంది. అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్‌ను అంతర్జాతీయ క్రికెట్లోకి అప్పుడే అడుగుపెట్టిన కెన్యా మట్టికరిపించింది. 1999 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే రెండు సంచలన విజయాలు సాధించింది. ఆ ఎడిషన్‌లో జింబాబ్వే.. సౌతాఫ్రికా, టీమిండియాలను ఓడించింది. అదే ఏడిషన్‌లో బంగ్లాదేశ్.. హేమాహేమీలతో కూడిన పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. 2003 వరల్డ్‌కప్‌లో పటిష్టమైన శ్రీలంకపై కెన్యా ఘన విజయం సాధించి, సంచలనం సృష్టించింది. అదే టోర్నీలో కెన్యా.. బంగ్లాదేశ్, జింబాబ్వేలను కూడా ఓడించింది. 2007 వరల్డ్‌కప్ విషయానికొస్తే..ఈ ఎడిషన్‌లో బంగ్లాదేశ్ టీమిండియాకు షాకివ్వగా.. ఐర్లాండ్.. పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. అనంతరం అదే టోర్నీలో బంగ్లాదేశ్.. సౌతాఫ్రికాను, బంగ్లాదేశ్‌ను ఐర్లాండ్ ఓడించాయి. భారత్ వేదికగా జరిగిన 2011 ఎడిషన్‌లో భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్‌ను పసికూన ఐర్లాండ్ మట్టికరిపించింది. ఆ ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ను బంగ్లాదేశ్ కూడా ఓడించింది. 2015 ఎడిషన్‌లో బంగ్లాదేశ్.. ఇంగ్లండ్‌ను మరోసారి ఓడించి సంచలనం సృష్టించింది. ఆ ఎడిషన్‌లో ఐర్లాండ్.. వెస్టిండీస్, జింబాబ్వేలపై సంచలన విజయాలు సాధించింది. -
CWC 2023: టీ20 వరల్డ్‌కప్ 2022 సీన్‌ను ఇంగ్లండ్ మళ్లీ రిపీట్ చేస్తుందా..?
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పటిష్టమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించారు. ప్రపంచకప్ టోర్నీల్లో తమకంటే చిన్న జట్ల చేతుల్లో ఓడటం ఇంగ్లండ్‌కు ఇది తొలిసారేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఈ జట్టు పసికూనల చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది. 1992లో జింబాబ్వే చేతిలో, 2011లో ఐర్లాండ్ చేతిలో, 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో, తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ టీమ్ ఊహించని ఎదురుదెబ్బలు తినింది. వన్డే ప్రపంచకప్‌ల్లో పరిస్థితి ఇదైతే.. టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇంగ్లండ్‌కు ఇలాంటి అనుభవమే ఓసారి ఎదురైంది. 2022 ఎడిషన్‌లో హేమాహేమీలతో నిండిన ఇంగ్లండ్ టీమ్.. ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్ ప్రత్యక్షంగా ఇంగ్లండ్‌ను ఓడించనప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. నాడు తమకంటే చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్.. ఆతర్వాత ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఇంగ్లండ్ మరోసారి 2022 టీ20 వరల్డ్‌కప్ సీన్‌ను రిపీట్ చేస్తుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, నిన్నటి (అక్టోబర్ 15) మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. -
CWC 2023: ఆఫ్ఘనిస్తాన్ చారిత్రక విజయం వెనుక ఇంగ్లండ్ మాజీ ఆటగాడి హస్తం
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ చారిత్రక విజయం వెనుక ఇంగ్లండ్ మాజీ ఆటగాడి హస్తం ఉందన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్.. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తూ, ఇంగ్లండ్‌పై ఆఫ్ఘన్ల గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌పై పూర్తి అవగాహన కలిగిన ట్రాట్.. నిన్నటి మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బౌలర్లకు దిశానిర్ధేశం చేయడంతో పాటు అన్నీ తానై వ్యవహరించి, ఆఫ్ఘన్ల గెలుపుకు దోహదపడ్డాడు. ప్రస్తుత ఇంగ్లండ్ టీమ్‌తో పాటు భారత పిచ్ పరిస్థితులపై కూడా సంపూర్ణ అవగాహన (2011లో భారత్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో ట్రాట్ ఇంగ్లండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు) కలిగిన ట్రాట్.. ఆఫ్ఘన్లకు కీలకమైన సలహాలు, సూచనలు ఇచ్చి వారి గెలుపుకు తోడ్పడ్డాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఎంతో టెన్షన్‌గా కనిపించిన ట్రాట్.. ఆఫ్ఘన్ల గెలుపు అనంతరం ఎంతో సంతోషంగా కనిపించాడు. స్వదేశంపై తన వ్యూహాలు విజయవంతంగా అమలు కావడంతో ట్రాట్ ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. మ్యాచ్ అనంతరం పట్టరాని అనందంతో స్టేడియం మొత్తం కలిగతిరిగాడు. ఇంగ్లండ్‌పై గెలుపు అనంతరం అతను మాట్లాడుతూ.. ఈ గెలుపు ఆఫ్ఘనిస్తాన్ యువతలో ఎంతో సూర్తిని నింపుతుందని అన్నాడు. ఇటీవల సంభవించిన భూకంపంతో అతలాకుతలమైన ఆఫ్ఘన్లకు ఈ విజయం ఎంతో ఊరట కలిగిస్తుందని తెలిపాడు. ఈ గెలుపు ఆఫ్ఘన్ల ముఖాల్లో చిరునవ్వులు చిగురింపజేస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ గెలుపు ఇచ్చే స్పూర్తితో ఆఫ్ఘన్ యువత బ్యాట్ పడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఇంగ్లండ్‌పై గెలుపులో కీలకపాత్ర పోషించిన ముజీబ్, రషీద్‌లు తమ చారిత్రక గెలుపును భూకంప బాధితులకు అంకితం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల సంభవించిన భూకంపంలో 1000 మందికిపైగా మరణించారు. కాగా, న్యూఢిల్లీ వేదికగా నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. జగజ్జేత ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. -
CWC 2023 ENG VS AFG: నాడు విలన్.. నేడు హీరో
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి, జగజ్జేతను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రషీద్ ఖాన్ (22 బంతుల్లో 23; 3 ఫోర్లు), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, సిక్స్).. ఆ తర్వాత బౌలింగ్‌లో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-51-3), మొహమ్మద్ నబీ (6-0-16-2), రషీద్ ఖాన్ (9.3-1-37-3), నవీన్ ఉల్ హాక్ (6-1-44-1), ఫజల్ హక్ ఫారూఖీ (7-0-50-1) చెలరేగి విశ్వ విజేతకు ఊహించని షాకిచ్చారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నాడు చితకబాదించుకున్నాడు.. ఇప్పుడు హీరో అయ్యాడు..! ఇంగ్లండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంలో స్పిన్ ఆల్‌రౌండర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ కీలకపాత్ర పోషించారు. వీరిద్దరు తొలుత బ్యాట్‌తో అతి మూల్యమైన పరుగులు చేసి, ఆ తర్వాత బంతితో మాయ చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ పాత్ర అత్యంత ప్రశంసనీయం. గత వరల్డ్‌కప్‌లో ఇదే ఇంగ్లండ్ చేతిలో చితకబాదించుకున్న రషీద్.. ఈ మ్యాచ్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. 2019 వరల్డ్‌కప్‌లో నాటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) విధ్వంసం ధాటికి బలైన రషీద్.. ఆ మ్యాచ్‌లో 9 ఓవర్లలో ఏకంగా 110 పరుగులిచ్చి కెరీర్లో చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. అతి ధారాళంగా పరుగులు సమర్పించుకుని నాడు తన జట్టు పాలిట విలన్ అయిన రషీద్.. నేడు అదే జట్టు పతనాన్ని శాసించి, హీరో అయ్యాడు. -
ప్రపంచకప్ చరిత్రలో ఎవరి వల్ల కాలేదు.. ఇంగ్లండ్‌కు మాత్రమే సాధ్యమైంది
ప్రపంచకప్-2023లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం జగజ్జేత ఇంగ్లండ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచకప్ చరిత్రలో అన్ని టెస్ట్ ప్లేయింగ్ జట్ల (11) చేతుల్లో ఓడిన తొలి జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 1975 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన ఇంగ్లండ్.. ఆతర్వాత 1979 వరల్డ్‌కప్ ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. అనంతరం 1983, 1987 ప్రపంచకప్‌ల్లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ చేతుల్లో ఓడిన ఇంగ్లండ్.. 1992 వరల్డ్‌కప్‌లో పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 1996 ప్రపంచకప్‌లో శ్రీలంక, సౌతాఫ్రికా చేతుల్లో పరాజయాలు ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్‌కు 2011 ప్రపంచకప్‌లో ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2015లో ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. ఆ ఎడిషన్‌లో ఇంగ్లీష్ టీమ్.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. తాజా వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో, అన్ని టెస్ట్ ప్లేయింగ్ దేశాల చేతుల్లో ఓటములు ఎదుర్కొన్న తొలి జట్టుగా ఎవరికీ సాధ్యంకాని చెత్త రికార్డును ఇంగ్లండ్ మూటగట్టుకుంది. కాగా, న్యూఢిల్లీ వేదికగా నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్.. జగజ్జేత ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. -
CWC 2023: డిఫెండింగ్ ఛాంపియన్, ఫైవ్ టైమ్ ఛాంపియన్స్‌కు ఏంటీ దుస్థితి..?
ప్రస్తుత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో జగజ్జేత ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకివ్వగా.. ఆస్ట్రేలియా టోర్నీలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో (భారత్, సౌతాఫ్రికా) ఘోర పరాజయాలను మూటగుట్టకుని, ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆఫ్ఘన్ చేతిలో ఓటమితో పాటు ఈ టోర్నీలో ఇంగ్లండ్ మరో పరాజయాన్ని కూడా మూటగుట్టకుంది. టోర్నీ ఓపెనర్‌లో గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్.. బట్లర్ సేనను మట్టికరిపించి, గత వరల్డ్‌కప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్.. ఒక్క బంగ్లాదేశ్‌పై మాత్రమే విజయం సాధించి,పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఏంటీ దుస్థితి.. ఛాంపియన్ జట్లైన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఏంటీ దుస్థితి అని విశ్లేషిస్తే.. ఒక్క కారణంగా తేటతెల్లమైంది. ఈ రెండు జట్లు అన్ని విభాగాల్లో ఇతర జట్లతో పోలిస్తే పటిష్టంగా ఉన్నప్పటికీ.. ప్రత్యర్దులను తక్కువ అంచనా వేయడం కారణంగా తగిన మూల్యం చెల్లించుకున్నాయి. ఇంగ్లండ్.. ఆఫ్ఘనిస్తాన్‌తో, ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాతో ఏమరపాటుగా వ్యవహరించడం వల్ల ఘెరపరాజయాలు మూటగట్టుకున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆయా జట్ల బౌలర్లు ప్రత్యర్ధి బ్యాటర్లను తేలిగ్గా తీసుకుని ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యర్ధులు భారీ స్కోర్లు చేయడంతో ఛేదనలో ఒత్తిడికిలోనై చేతులెత్తేశారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కామన్ విషయం ఏంటంటే.. రెండు సందర్భాల్లో బ్యాటర్ల దెబ్బకు పేస్ బౌలర్లే బలయ్యారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆసీస్ పేసర్లు స్టార్క్ (9 ఓవర్లలో 53), హాజిల్‌వుడ్ (9 ఓవర్లలో 60), కమిన్స్ (9 ఓవర్లలో 70)లను బ్యాటర్లు చితకబాదగా.. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బ్యాటర్లు ఇంగ్లండ్ పేసర్లు క్రిస్ వోక్స్ (4 ఓవర్లలో 41), రీస్ టాప్లే (8.5 ఓవర్లలో 52), సామ్ కర్రన్ (4 ఓవర్లలో 46), మార్క్ వుడ్ (9 ఓవర్లలో 50)ను ఉతికి ఆరేశారు. మొత్తంగా చూస్తే నిర్లక్ష్యం, పేసర్ల వైఫల్యం ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్, ఆసీస్ కొంపలు ముంచాయి. వరుస ఓటములు రెండు జట్ల సెమీస్ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తాయి. ఇంగ్లండ్‌కు అలవాటే.. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఊహించని పరాజయాలు కొత్తేమీ కాదు. పలు సందర్భాల్లో ఈ జట్టు తమకంటే చిన్న జట్ల చేతుల్లో పరాభవాలను ఎదుర్కొంది. 1992 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే.. 2011 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్, 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్.. తాజాగా ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లు ఇచ్చాయి. ఇదిలా ఉంటే, వన్డే ప్రపంచకప్‌లో నిన్న (అక్టోబర్ 15) పెను సంచలనం నమోదైన విషయం తెలిసిందే. జగజ్జేత ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకిచ్చింది. న్యూఢిల్లీ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. -
ప్రపంచకప్‌లో పెను సంచలనం.. జగజ్జేత ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్
2023 వన్డే ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. జగజ్జేత ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ భారీ షాకిచ్చింది. న్యూఢిల్లీ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఛేదనలో ఆది నుంచి తడబడుతూ వచ్చిన ఇంగ్లండ్.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఆఫ్ఘన్ బౌలర్లకు దాసోహమైంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ (10-1-51-3) ఇంగ్లండ్ లైనప్‌ను దారుణంగా దెబ్బకొట్టగా.. మొహమ్మద్ నబీ (6-0-16-2), రషీద్ ఖాన్ (9.3-1-37-3), నవీన్ ఉల్ హాక్ (6-1-44-1), ఫజల్ హక్ ఫారూఖీ (7-0-50-1) తలో చేయి వేసి ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (66) మినహాయించి మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. బెయిర్‌స్టో 2, మలాన్ 32, రూట్ 11, బట్లర్ 9, లివింగ్‌స్టోన్ 10, సామ్ కర్రన్ 10, వోక్స్ 9, ఆదిల్ రషీద్ 20, మార్క్ వుడ్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) రాణించడంతో 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్‌స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. వరల్డ్‌కప్‌లో రెండో విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్.. 2015 ఎడిషన్‌తో వన్డే ప్రపంచకప్‌లోకి అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఆ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడి ఒక్క స్కాట్లాండ్పై మాత్రమే విజయం సాధించింది. ప్రపంచకప్‌లో ఇదే ఆఫ్ఘనిస్తాన్ మొదటి, ఆఖరి విజయం. ఆతర్వాత ఈ జట్టు 2019 ఎడిషన్‌లో 9 మ్యాచ్‌లు ఆడినా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలువలేదు. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఆఫ్ఘన్లు.. ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం సాధించి, ప్రపంచకప్‌లో తమ రెండో విజయాన్ని నమోదు చేశారు. -
ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన ఓ వ్యక్తి..!
న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం స్టాండ్స్‌లో కూర్చున్న ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్శించాడు. అచ్చం విండీస్ క్రికెటర్ సునీల్ నరైన్‌ను పోలిన ఈ వ్యక్తిని చూసి జనాలు ఆశ్చర్యపోయారు. వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటారని తెలుసు కానీ, మరీ ఇంతటి దగ్గరి పోలికలా అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఒక్క సైజ్ తప్పించి స్టాండ్స్‌లో తారసపడ్డ వ్యక్తి అన్ని కోణాల్లో సునీల్ నరైన్ కార్బన్ కాపీలా ఉన్నాడు. అతని హెయిర్ స్టైల్, మీసకట్టు, గడ్డం, చెవికి పోగు, మెడపై టాటూ.. ఇలా ఏ యాంగిల్లో చూసినా సదరు వ్యక్తి సునీల్ నరైన్‌కు డిట్టో టు డిట్టోలా ఉన్నాడు. ఆ వ్యక్తి సునీల్ నరైన్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్టు కేకేఆర్ జెర్సీ ధరించి ఉండటం మరో విశేషం. అచ్చుగుద్దినట్లు సునీల్ నరైన్‌లా ఉన్న ఈ వ్యక్తి ఎవరో, ఏ ప్రాంతానికి చెందిన వాడో తెలియలేదు. మొత్తానికి సునీల్ నరైన్ డూప్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్‌స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్‌స్టోను (2) ఫజల్ హక్ ఫారూఖీ.. రూట్‌ను (11) ముజీబ్.. మలాన్‌ను నబీ ఔట్ చేశారు. 12.4 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 68/3గా ఉంది. హ్యారీ బ్రూక్ (12), జోస్ బట్లర్ క్రీజ్‌లో ఉన్నారు. -
CWC 2023 ENG VS AFG: వరల్డ్‌కప్ రికార్డును సమం చేసిన రూట్
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 15) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఓ వరల్డ్‌కప్ రికార్డును సమం చేశాడు. బ్యాటర్, బౌలర్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన రూట్.. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు క్యాచ్‌లు పట్టి, వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు ఆందుకున్న నాన్ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో మొహమ్మద్ కైఫ్ (2003లో శ్రీలంకపై), సౌమ్య సర్కార్ (2015లో స్కాట్లాండ్పై), ఉమర్ అక్మల్ (2015లో ఐర్లాండ్‌పై), క్రిస్ వోక్స్ (2019లో పాకిస్తాన్‌పై)లు వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో నాలుగు క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్కీపర్లుగా ఉన్నారు. తాజా ప్రదర్శనతో రూట్ వీరి సరసన చేరాడు. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో రూట్ నాలుగు క్యాచ్‌లు పట్టడంతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహీదిని రూట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రూట్ పట్టిన రషీద్ ఖాన్ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. లాంగ్ ఆన్‌లో పరిగెత్తుకుంటూ వచ్చి తన కుడిపక్కకు డైవ్ చేస్తూ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు రూట్. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) రాణించడంతో ఆ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్‌స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. అనంతరం 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్‌స్టోను (2) ఫజల్ హక్ ఫారూఖీ.. రూట్‌ను (11) ముజీబ్ ఔట్ చేశారు. 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/2గా ఉంది. డేవిడ్ మలాన్ (19), హ్యారీ బ్రూక్ క్రీజ్‌లో ఉన్నారు. -
CWC 2023: ఆఫ్ఘన్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. ఇంగ్లండ్ పేసర్లకు చుక్కలు
న్యూఢిల్లీ వేదికగా ఇవాళ (అక్టోబర్ 15) జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఇంగ్లండ్ పేస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రపంచంలోనే మేటి పేసర్లుగా పరిగణించబడే క్రిస్ వోక్స్ (4-0-41-0), మార్క్ వుడ్ (9-0-50-2), సామ్ కర్రన్ (4-0-46), రీస్ టాప్లే (8.5-1-52-1)లను ఆఫ్ఘన్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. ఆరంభంలో రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్ అలీఖిల్ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 284 పరుగులకు (49.5 ఓవర్లలో) ఆలౌటైంది. స్పిన్నర్లు ఆదిల్ రషీద్ (10-1-42-3), లియామ్ లివింగ్‌స్టోన్ (10-0-33-1), జో రూట్ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేయకుండి ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ సాధించి ఉండేది. స్పిన్‌కు అనుకూలిస్తున్న ఈ వికెట్‌పై ఈ స్కోర్ కూడా మంచి స్కోరనే చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ అమ్ములపొదిలో రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ నబీ లాంటి ప్రపంచ మేటి స్పిన్నర్లు ఉండటంతో ఇంగ్లండ్‌కు ఛేదనలో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేసిన స్కోర్ వారికి ప్రపంచకప్ టోర్నీల్లో రెండో అత్యధిక స్కోర్ (2019 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌పై 288 పరుగులు) కావడం విశేషం. గత మ్యాచ్‌లో భారత్‌పై 272 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇవాళ మరో 12 పరుగులు అదనంగా చేసి ఇంగ్లండ్ ముందు డీసెంట్ టార్గెట్‌ను ఉంచింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్, ఇక్రమ్ అర్దసెంచరీలతో రాణించగా.. ఇబ్రహీం జద్రాన్ (28), రషీద్ ఖాన్ (23), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో ఇక్రమ్, రషీద్, ముజీబ్‌ల పోరాటం కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. -
CWC 2023 ENG VS AFG: సెంచరీకి ముందు రనౌట్.. కోపంతో ఊగిపోయిన గుర్బాజ్
న్యూఢిల్లీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (48 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి తమ జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిలో గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. గుర్బాజ్-జద్రాన్ జోడీ తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించిన అనంతరం జద్రాన్ ఔటయ్యాడు. అనంతరం 18.4వ ఓవర్లో (122 పరుగుల వద్ద) జోస్ బట్లర్ అద్బుతమైన స్టంపింగ్ చేయడంతో వన్‌డౌన్‌లో వచ్చిన రహ్మాత్ షా కూడా పెవిలియన్‌కు చేరాడు. షా ఔటైన మరుసటి బంతికే సెంచరీ చేస్తాడనుకున్న గుర్బాజ్ కూడా అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. #ENGvsAFG #stumpout #runout pic.twitter.com/OpNQSwkWPX — nadeem 05 (@hotvideos097) October 15, 2023 దీంతో మ్యాచ్ ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్వైపు నుంచి ఇంగ్లండ్‌వైపు మలుపు తిరిగింది. 8 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూడా క్రమం తప్పకుండా మరో 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్ (23) జోడీ ఆదుకుంది. వీరిద్దరు ఏడో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. అనంతరం ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జో రూట్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టడంతో రషీద్ ఖాన్ కూడా ఔటయ్యాడు. 44.1 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 233/7గా ఉంది. అలీఖిల్ (44), ముజీబ్ క్రీజ్‌లో ఉన్నారు. Rahmanullah Gurbaz is so much angry with himself after run out #ENGvsAFG #Sorry_Pakistan #IndiavsPak #Rizwan #BabarAzam #RohitSharma𓃵 Shaheen Skipper KL Rahul BCCI Namaz Chennai Rizwan Indians, Godavari Wasim Akram Ahmedabad Gujarat, Sri Lankan Shami pic.twitter.com/meZDHuy6kp — cricketbuzz⁴⁵ (@Mohdyasir6911) October 15, 2023 కోపంతో ఊగిపోయిన గుర్బాజ్.. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన గుర్బాజ్.. అనవసరంగా రనౌట్ కావడంతో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. గ్రౌండ్లో కోపాన్ని ఆపుకున్న గుర్బాజ్.. పెవిలియన్‌కు చేరే క్రమంలో బౌండరీ రోప్‌పై, ఆతర్వాత డగౌట్లో కుర్చీపై తన ప్రతాపాన్ని చూపాడు. పట్టలేని కోపంతో ఊగిపోయిన గుర్బాజ్ బౌండరీ రోప్‌ను, కుర్చీని బ్యాట్‌తో గట్టిగా కొడుతూ, కేకలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. Run Out On 80 💔 Rahmanullah Gurbaz Missed Out On A Well-deserved World Cup Hundred!#ENGvAFG #WorldCup #CWC23 #Gurbaz pic.twitter.com/xiHPoUWSPO — Jega8 (@imBK08) October 15, 2023 -
సామ్ కర్రాన్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ సామ్ కర్రాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 3.4 ఓవర్లు బౌలింగ్ చేసిన కర్రాన్.. 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను కర్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా సామ్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ పేరిట ఉండేది. 2021లో రషీద్ వెస్టిండీస్‌పై కేవలం 2 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఇవే అత్యుత్తమం. కాగా.. తాజా మ్యాచ్‌తో రషీద్ రికార్డును కర్రాన్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఫ్గానిస్తాన్ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో కర్రాన్‌తో పాటుగా స్టోక్స్, వుడ్ తలా రెండు వికెట్లు, వోక్స్ ఒక్క వికెట్ సాధించాడు. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే' -
అద్భుత రనౌట్... శ్రీలంకపై అఫ్గన్ సంచలన విజయం
ICC U19 World Cup 2022: 25 బంతులు... చేయాల్సినవి 5 పరుగులు.. చేతిలో ఒక వికెట్. ఓ క్రికెట్ జట్టు మ్యాచ్ గెలవడానికి ఈ సమీకరణ చాలు. కానీ... శ్రీలంకను దురదృష్టం వెక్కిరించింది. అఫ్గనిస్తాన్ అద్భుత రనౌట్ చేయడంతో విజయం ఆ జట్టు చేజారింది. అంతేకాదు మెగా టోర్నీలో సెమీస్ చేరాలన్న ఆశలు గల్లంతయ్యాయి. కాగా వెస్టిండీస్ వేదికగా ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... శ్రీలంక, అఫ్గనిస్తాన్ మధ్య గురువారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు బిలాల్ సయేదీ 6, ఖరోటే 13 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో వచ్చిన అల్లా నూర్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అబ్దుల్ హైదీ 37, నూర్ అహ్మద్ 30 పరుగులతో రాణించారు. దీంతో అఫ్గన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఖరి రనౌట్‌తో ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ చమిందు విక్రమ సింఘే ఒక్కడే డబుల్ డిజిట్(16) స్కోరు చేయగలిగాడు. మరో ఓపెనర్ సదిశ రాజపక్స డకౌట్ కాగామిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. వరుసగా 2,2,1,3,2 స్కోర్లకే పెవిలియన్ చేరారు. చివర్లో దునిత్ 34, రవీన్ డి సిల్వా 21 మెరుపులు మెరిపించారు. వినుజ రణ్పల్ 11 పరుగులతో క్రీజులో ఉండగా... అఫ్గన్ బౌలర్ నవీద్ సంధించిన బంతిని ఆడే క్రమంలో రనౌట్‌కు ఆస్కారం ఏర్పడింది. దీంతో శ్రీలంక కథ ముగిసింది. ఇన్నింగ్స్‌లో ఇది నాలుగో రనౌట్ కావడం గమనార్హం. ఇక నాలుగు పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ చేరిన అఫ్గన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. స్కోర్లు: అఫ్గనిస్తాన్ అండర్ 19 జట్టు: 134 (47.1 ఓవర్లు) శ్రీలంక అండర్ 19 జట్టు- 130 (46 ఓవర్లు) చదవండి: IPL: వాళ్లిద్దరు నా ఫేవరెట్ ప్లేయర్లు... ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది: దక్షిణాఫ్రికా యువ సంచలనం ఏబీడీ 2.0! IND vs WI: టీమిండియాతో సిరీస్.. వెస్టిండీస్ జట్టులో గొడవలు.. పొలార్డ్‌పై సంచలన ఆరోపణలు! Congratulations Afghanistan 🔥🔥🇦🇫🇦🇫🔥🔥 Afg u19 vs sl u19 pic.twitter.com/qBYzNkjiXm — THE NDS soldier (@Muhamma40574471) January 27, 2022 Celebrate the win boys!! The Future stars have all the rights in the world to celebrate thier quarter final win over SL U19s. #FutureStars | #AFGvSL | #U19CWC2022 pic.twitter.com/SNmr2jtTIx — Afghanistan Cricket Board (@ACBofficials) January 27, 2022 -
అఫ్గనిస్తాన్‌పై 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
-
పసికూనే అయినా వణికించింది!
న్యూఢిల్లీ: అండర్ డాగ్ గా టీ20 వరల్డ్ కప్ లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆఫ్గనిస్థాన్ జట్టు తన పవర్ చాటింది. పసికూనే అయినప్పటికీ బలమైన ఇంగ్లండ్ జట్టుపై పోరాటపటిమ చూపింది. మొదట బౌలింగ్ చేసి ఇంగ్లండ్ ను 142 పరుగులకు కట్టడి చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత లక్ష్యఛేదనలోనూ పర్వాలేదనిపించింది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఆఫ్గన్ టాప్ ఆర్డర్ విఫలమైనా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన షఫిఖుల్లా దడదడలాడించాడు. 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అతను 35 పరుగులు చేయడంతో ఆఫ్గన్ జట్టు దాదాపు లక్ష్యఛేధనకు చేరువగా వచ్చింది. మొదట బ్యాటింగ్ లో విఫలమై.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ అంతంతమాత్రం రాణించిన ఇంగ్లండ్ జట్టు చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో కేవలం 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 142 పరుగులు చేయగా.. ఆ తర్వాత లక్ష ఛేదనకు దిగిన ఆఫ్గన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఆఫ్గన్ జట్టులో లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన షఫిఖుల్లా 35, సమివుల్లా షెన్వారీ 22, నజీబుల్లా జార్డన్ 14 పరుగులతో రాణించారు. అంతకుముందు ఆఫ్గన్ టాప్ ఆర్డర్ ఇంగ్లండ్ బౌలింగ్ ముందు బెంబేలెత్తిపోయింది. ఇంగ్లిష్ బౌలర్లు వేసే పదునైన బంతులు ఎదుర్కొలేక చతికిలపడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో ఇద్దరు మాత్రం రెండంకెల స్కోరు చేశారు. నూర్ అలీ జార్డన్ 17, రషీద్ ఖాన్ 15 పరుగులతో కాస్తాకూస్తో క్రీజ్ లో నిలబడటానికి ప్రయత్నించారు. మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో మహమ్మద్ షాజాద్ 4, కెప్టెన్ అస్ఘర్ స్తానిక్ జాయ్ ఒక పరుగుకు ఔటవ్వగా, గుల్బదిన్ నయబ్ డకౌటయ్యాడు. దీంతో 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి.. 45 పరుగులు చేసింది. పసికూన ఆఫ్గన్ జట్టును ఇంగ్లండ్ బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. డీజే విల్లీ మూడు ఓవర్లలో 17 పరుగులకు రెండు వికెట్లు తీయగా, సీజే జోర్డన్, ఎంఎం అలీ, ఏయూ రషీద్ తలో వికెట్ తీశారు. టీ20 వరల్డ్ కప్ సూపర్ టెన్ లో భాగంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అలీ దూకుడుగా ఆడి 41 పరుగులు చేయగా, జేమ్స్ విన్సె 22, డేవిడ్ విల్లె 20 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ ఆఫ్గన్ బౌలర్ల ధాటికి అలవోకగా వికెట్లు సమర్పించుకున్నారు. అఫ్ఘాన్ బౌలర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు.. ఆమిర్ హంజా, షెన్వారి తలా వికెట్ తీశారు. -
టాప్ ఆర్డర్ టపటపా రాలిపోయింది
న్యూఢిల్లీ: పసికూన ఆఫ్గనిస్థాన్ బౌలర్లు రాణించి దూకుడు మీదున్న ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేసినప్పటికీ, ఆ జట్టు బ్యాట్స్ మెన్ మాత్రం చేతులెత్తేశారు. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు ఇంగ్లండ్ బౌలింగ్ ముందు బెంబేలెత్తిపోయింది. ఇంగ్లిష్ బౌలర్లు వేసే పదునైన బంతులు ఎదుర్కొలేక చతికిలపడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో ఇద్దరు మాత్రం రెండంకెల స్కోరు చేశారు. నూర్ అలీ జార్డన్ 17, రషీద్ ఖాన్ 15 పరుగులతో కాస్తాకూస్తో క్రీజ్ లో నిలబడటానికి ప్రయత్నించారు. మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో మహమ్మద్ షాజాద్ 4, కెప్టెన్ అస్ఘర్ స్తానిక్ జాయ్ 1 ఔటవ్వగా, గుల్బదిన్ నయబ్ డకౌటయ్యాడు. దీంతో 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి.. 45 పరుగులు చేసింది. పసికూన ఆఫ్గన్ జట్టును ఇంగ్లండ్ బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. డీజే విల్లీ మూడు ఓవర్లలో 17 పరుగులకు రెండు వికెట్లు తీయగా, సీజే జోర్డన్, ఎంఎం అలీ, ఏయూ రషీద్ తలో వికెట్ తీశారు. టీ20 వరల్డ్ కప్ సూపర్ టెన్ లో భాగంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అలీ దూకుడుగా ఆడి 41 పరుగులు చేయగా, జేమ్స్ విన్సె 22, డేవిడ్ విల్లె 20 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ ఆఫ్గన్ బౌలర్ల ధాటికి అలవోకగా వికెట్లు సమర్పించుకున్నారు. అఫ్ఘాన్ బౌలర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు.. ఆమిర్ హంజా, షెన్వారి తలా వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అఫ్ఘాన్ బౌలర్ ఆమిర్ హంజా.. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (5)ను బౌల్డ్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నబీ.. వరుస బంతుల్లో జేమ్స్ విన్సె, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్లో జో రూట్ (12) రనౌటయ్యాడు. స్టోక్స్ (7), బట్లర్ (6) కూడా ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాత జోర్డాన్ 15 పరుగులు చేశాడు. చివర్లో అలీ, విల్లె బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ సముచిత స్కోరు చేయగలిగింది.