
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ సామ్ కర్రాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 3.4 ఓవర్లు బౌలింగ్ చేసిన కర్రాన్.. 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను కర్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా సామ్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ పేరిట ఉండేది. 2021లో రషీద్ వెస్టిండీస్‌పై కేవలం 2 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఇవే అత్యుత్తమం.
కాగా.. తాజా మ్యాచ్‌తో రషీద్ రికార్డును కర్రాన్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఫ్గానిస్తాన్ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో కర్రాన్‌తో పాటుగా స్టోక్స్, వుడ్ తలా రెండు వికెట్లు, వోక్స్ ఒక్క వికెట్ సాధించాడు. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే'