T20 WC 2022 Final Pak Vs Eng: England Bowlers Shine Again At Death This T20WC - Sakshi
Sakshi News home page

Pak Vs Eng: పాక్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. టోర్నీ ఆసాంతం

Published Sun, Nov 13 2022 3:43 PM | Last Updated on Sun, Nov 13 2022 4:50 PM

WC 2022 Final Pak Vs Eng: England Bowlers Shine Again At Death This WC - Sakshi

ICC Mens T20 World Cup 2022 - Pakistan vs England, Final: టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. మెల్‌బోర్న్‌ మ్యాచ్‌లో ఆది నుంచే తమ ప్రణాళికను అమలు చేసిన ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. పాక్‌ బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. 

ఐదో ఓవర్‌ రెండో బంతికి పాక్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(14 బంతుల్లో 15 పరుగులు)ను అవుట్‌ చేసి సామ్‌ కరన్‌ శుభారంభం అందించాడు. తర్వాత ఆదిల్‌ రషీద్‌ మహ్మద్‌ హారీస్‌(8), బాబర్‌ ఆజం(32)ను పెవిలియన్‌కు పంపగా.. స్టోక్స్‌ ఇఫ్తీకర్‌ అహ్మద్‌(0) పని పట్టాడు. 

ఇక జోరు కనబరిచిన షాన్‌ మసూద్‌(28 బంతుల్లో 38 పరుగులు)ను అవుట్‌ చేసి సామ్‌ కరన్‌ రెండో వికెట్‌ తన ఖాతాలో వేసుకోగా..క్రిస్‌ జోర్డాన్‌ షాదాబ్‌ ఖాన్‌(20)ను ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత సామ్‌ మరోసారి తన మ్యాజిక్‌తో మహ్మద్‌ నవాజ్‌(5) వికెట్‌ తీయగా.. ఆఖరి ఓవరల్లో మహ్మద్‌ వసీం జూనియర్‌(4)ను అవుట్‌ చేసి జోర్డాన్‌ పాక్‌ ఇన్నింగ్స్‌లో చివరి వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇలా ఇంగ్లండ్‌ బౌలర్లు చుక్కలు చూపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్‌ 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు ఇంగ్లీష్‌ బౌలర్లు. 16- 20 ఓవర్ల మధ్యలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు కూల్చారు. తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకున్నారు.

పాక్‌తో ఫైనల్లో 16-20 ఓవర్లలో
16.2: సామ్‌ కరన్‌- షాన్‌ మసూద్‌ వికెట్‌
17.2: క్రిస్‌ జోర్డాన్‌- షాదాబ్‌ ఖాన్‌ వికెట్‌
18.3: సామ్‌ కరన్‌- మహ్మద్‌ నవాజ్‌ వికెట్‌
19.3: క్రిస్‌ జోర్డాన్‌- మహ్మద్‌ వసీం జూనియర్‌ వికెట్‌

ఈ ప్రపంచకప్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ సాగిందిలా..
23/6 అఫ్గనిస్తాన్‌, పెర్త్‌
30/7 ఐర్లాండ్‌, మెల్‌బోర్న్‌
36/3 న్యూజిలాండ్‌ , బ్రిస్బేన్‌
25/5 శ్రీలంక, సిడ్నీ
రెండో సెమీ ఫైనల్‌- 68/3 ఇండియా, అడిలైడ్‌
ఫైనల్‌- 31/4 పాకిస్తాన్‌, మెల్‌బోర్న్‌
చదవండి: T20 WC 2022: సామ్‌ కరన్‌ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్‌ తొలి బౌలర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement