టాప్ ఆర్డర్ టపటపా రాలిపోయింది | Afghanistan top order failed score against england bowlers | Sakshi
Sakshi News home page

టాప్ ఆర్డర్ టపాటపా రాలిపోయింది

Mar 23 2016 5:48 PM | Updated on Sep 3 2017 8:24 PM

టాప్ ఆర్డర్ టపటపా రాలిపోయింది

టాప్ ఆర్డర్ టపటపా రాలిపోయింది

పసికూన ఆఫ్గనిస్థాన్ బౌలర్లు రాణించి దూకుడు మీదున్న ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేసినప్పటికీ, ఆ జట్టు బ్యాట్స్ మెన్ మాత్రం చేతులెత్తేశారు.

న్యూఢిల్లీ: పసికూన ఆఫ్గనిస్థాన్ బౌలర్లు రాణించి దూకుడు మీదున్న ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేసినప్పటికీ, ఆ జట్టు బ్యాట్స్ మెన్ మాత్రం చేతులెత్తేశారు. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు ఇంగ్లండ్ బౌలింగ్ ముందు బెంబేలెత్తిపోయింది. ఇంగ్లిష్ బౌలర్లు వేసే పదునైన బంతులు ఎదుర్కొలేక చతికిలపడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో ఇద్దరు మాత్రం రెండంకెల స్కోరు చేశారు. నూర్ అలీ జార్డన్ 17, రషీద్ ఖాన్ 15 పరుగులతో కాస్తాకూస్తో క్రీజ్ లో నిలబడటానికి ప్రయత్నించారు. మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో మహమ్మద్ షాజాద్ 4, కెప్టెన్ అస్ఘర్ స్తానిక్ జాయ్ 1 ఔటవ్వగా, గుల్బదిన్ నయబ్ డకౌటయ్యాడు. దీంతో 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి.. 45 పరుగులు చేసింది.

పసికూన ఆఫ్గన్ జట్టును ఇంగ్లండ్ బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. డీజే విల్లీ మూడు ఓవర్లలో 17 పరుగులకు రెండు వికెట్లు తీయగా, సీజే జోర్డన్, ఎంఎం అలీ, ఏయూ రషీద్ తలో వికెట్ తీశారు. టీ20 వరల్డ్ కప్ సూపర్ టెన్ లో భాగంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అలీ దూకుడుగా ఆడి 41 పరుగులు చేయగా, జేమ్స్ విన్సె 22, డేవిడ్ విల్లె 20 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ ఆఫ్గన్ బౌలర్ల ధాటికి అలవోకగా వికెట్లు సమర్పించుకున్నారు. అఫ్ఘాన్ బౌలర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు.. ఆమిర్ హంజా, షెన్వారి తలా వికెట్ తీశారు.

ఇంగ్లండ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అఫ్ఘాన్ బౌలర్ ఆమిర్ హంజా.. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (5)ను బౌల్డ్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నబీ.. వరుస బంతుల్లో జేమ్స్ విన్సె, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్లో జో రూట్ (12) రనౌటయ్యాడు. స్టోక్స్ (7), బట్లర్ (6) కూడా ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాత జోర్డాన్ 15 పరుగులు చేశాడు. చివర్లో అలీ, విల్లె బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ సముచిత స్కోరు చేయగలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement