Top order
-
టాపార్డరే కీలకం: మిథాలీ
న్యూఢిల్లీ: ఈనెల 10 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే సీనియర్ మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత అవకాశాలు టాపార్డర్ రాణించడంపైనే ఆధారపడి ఉంటాయని దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ తెలిపింది. ‘భారత టాపార్డరే కీలకం. ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్‌లో ఉంది. ఆమె మ్యాచ్ విన్నర్. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా బాగా ఆడుతోంది. ఇటీవలే సఫారీలో అండర్–19 మెగా ఈవెంట్ గెలుచుకొచ్చిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌ల అనుభవం కూడా భారత సీనియర్ జట్టుకు ఉపకరిస్తుంది. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి మేటి జట్లను ఓడిస్తే మిగతా జట్లపై విజయం సులువవుతుంది. బౌలింగ్‌లో సవాళ్లు ఎదురవుతాయి. ఈ కఠిన పరీక్షను ఎదుర్కోవాలంటే బౌలర్లు తమ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాల్సిందే’ అని మిథాలీ విశ్లేషించింది. -
IND Vs PAK: దారుణంగా విఫలమైన టీమిండియా టాపార్డర్
-
భారీ టార్గెట్‌ను చూసి టాపార్డర్ జడుసుకుంది.. అందుకే అలా
ముంబై: చెన్నై, కేకేఆర్ జట్ల మధ్య బుధవారం జరిగిన ఆసక్తికర పోరులో చెన్నై నిర్ధేశించిన భారీ టార్గెట్‌ను(221 పరుగులు) చూసి కేకేఆర్ టాపార్డర్ జడుసుకుందని, ఆ టెన్షన్లో అనవసరపు షాట్లకు ప్రయత్నించి పేక మేడలా కుప్పకూలిందని కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆరోపించాడు. వాంఖడే లాంటి బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీ పిచ్‌లపై ఎంత భారీ టార్గెట్ నిర్ధేశించినా ఛేజింగ్ చేసే జట్టు జంక కూడదని, కేకేఆర్ టాపార్డర్ ఆటగాళ్లు కాస్త బాధ్యతగా ఆడివుంటే ఫలితం మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ విషయమై టాపార్డర్ బ్యాట్స్మెన్లు నిందార్హులేనని, వారి బాధ్యతారాహిత్యమే కేకేఆర్ కొంప ముంచిందని మండిపడ్డాడు. టాపార్డర్ ప్లేయర్స్ కాస్త నిలదొక్కుకున్న తరువాత భారీ షాట్లకు ప్రయత్నించాల్సిందని, కానీ వారు అనవసరపు షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారని నిందించారు. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు రసెల్ కూడా అనవసరపు షాట్ ఆడి వుంటే కేకేఆర్ స్కోర్ 40/6గా ఉండేదని, కానీ రసెల్ అలా చేయకపోవడం వల్ల మ్యాచ్‌పై చివరిదాకా ఆశలు సజీవంగా ఉన్నాయని పేర్కొన్నాడు. దీపక్ చాహర్ ధాటికి కేకేఆర్ 5.2 ఓవర్లలోనే 5 టాపార్డర్ వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయినప్పటికీ, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు రసెల్(22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), దినేశ్ కార్తిక్(24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కమిన్స్(34 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు)లు అద్వితీయమైన పోరాటం చేసి చెన్నై శిబిరంలో దడ పుట్టించిన వైనాన్ని కేకేఆర్ అభిమానులు చిరకాలం గుర్తుపెట్టుకుంటారని అన్నాడు. 6,7,8 స్థానాల్లో రసెల్, డీకే, కమిన్స్ లాంటి ఆటగాళ్లుండటం కేకేఆర్ అదృష్టమని ఆయన పేర్కొన్నాడు. కొండంత లక్ష్యం ముందున్నా లోయరార్డర్ ఆటగాళ్లు, ముఖ్యంగా కమిన్స్ చేసిన అరివీర భయంకరమైన పోరాటాన్ని ఆయన ఆకాశానికెత్తాడు. భారీ లక్ష్యాన్ని చూసి వాళ్లు కూడా చేతులెత్తేసి ఉంటే 70 లేదా 80 పరుగలకే కేకేఆర్ ఆలౌటయ్యేదన్నాడు. చివరిదాకా కమిన్స్ పోరాటం చేయడం, అతనికి టెయిలెండర్ల నుంచి సహకారం లభించకపోవడంతో కేకేఆర్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: 'ఈ పిచ్‌పై మాకు మొదటి మ్యాచ్.. అందుకే' -
‘ధోని మాత్రమే రక్షించగలడు’
మాంచెస్టర్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా టాపార్డర్ పేక మేకడలా కుప్పకూలంతో ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. కామెంట్లు, ఫొటోలు, వీడియోలతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్ల ధాటికి కెప్టెన్ విరాట్ కోహ్లి(1), వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(1), కేఎల్ రాహుల్(1), దినేశ్ కార్తీక్(6) వెంట వెంటనే పెవిలియన్ దారిపట్టారు. భారత్ టాపార్డర్ వైఫల్యంపై ట్విటర్లో పెద్ద ఎత్తున వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నంబర్‌వన్, నంబర్‌టూ ఆటగాలిద్దరూ కలిపి రెండే పరుగులు చేశారని కోహ్లి, రోహిత్ ఉద్దేశించి కామెంట్ చేశారు. ఈరోజు టీమిండియాను రక్షించేవాడు మహేంద్ర సింగ్ ధోని మాత్రమేనని మహి ఫ్యాన్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానుల ప్రస్తుత పరిస్థితి ఇలా ఉండదంటూ ఫన్నీ ఫొటోలు షేర్ చేసి కామెంట్లు పెట్టారు. -
పసికూనే అయినా వణికించింది!
న్యూఢిల్లీ: అండర్ డాగ్ గా టీ20 వరల్డ్ కప్ లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆఫ్గనిస్థాన్ జట్టు తన పవర్ చాటింది. పసికూనే అయినప్పటికీ బలమైన ఇంగ్లండ్ జట్టుపై పోరాటపటిమ చూపింది. మొదట బౌలింగ్ చేసి ఇంగ్లండ్ ను 142 పరుగులకు కట్టడి చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత లక్ష్యఛేదనలోనూ పర్వాలేదనిపించింది. ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఆఫ్గన్ టాప్ ఆర్డర్ విఫలమైనా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన షఫిఖుల్లా దడదడలాడించాడు. 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అతను 35 పరుగులు చేయడంతో ఆఫ్గన్ జట్టు దాదాపు లక్ష్యఛేధనకు చేరువగా వచ్చింది. మొదట బ్యాటింగ్ లో విఫలమై.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ అంతంతమాత్రం రాణించిన ఇంగ్లండ్ జట్టు చావుతప్పి కన్ను లొట్టపోయిన రీతిలో కేవలం 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 142 పరుగులు చేయగా.. ఆ తర్వాత లక్ష ఛేదనకు దిగిన ఆఫ్గన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఆఫ్గన్ జట్టులో లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన షఫిఖుల్లా 35, సమివుల్లా షెన్వారీ 22, నజీబుల్లా జార్డన్ 14 పరుగులతో రాణించారు. అంతకుముందు ఆఫ్గన్ టాప్ ఆర్డర్ ఇంగ్లండ్ బౌలింగ్ ముందు బెంబేలెత్తిపోయింది. ఇంగ్లిష్ బౌలర్లు వేసే పదునైన బంతులు ఎదుర్కొలేక చతికిలపడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో ఇద్దరు మాత్రం రెండంకెల స్కోరు చేశారు. నూర్ అలీ జార్డన్ 17, రషీద్ ఖాన్ 15 పరుగులతో కాస్తాకూస్తో క్రీజ్ లో నిలబడటానికి ప్రయత్నించారు. మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో మహమ్మద్ షాజాద్ 4, కెప్టెన్ అస్ఘర్ స్తానిక్ జాయ్ ఒక పరుగుకు ఔటవ్వగా, గుల్బదిన్ నయబ్ డకౌటయ్యాడు. దీంతో 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి.. 45 పరుగులు చేసింది. పసికూన ఆఫ్గన్ జట్టును ఇంగ్లండ్ బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. డీజే విల్లీ మూడు ఓవర్లలో 17 పరుగులకు రెండు వికెట్లు తీయగా, సీజే జోర్డన్, ఎంఎం అలీ, ఏయూ రషీద్ తలో వికెట్ తీశారు. టీ20 వరల్డ్ కప్ సూపర్ టెన్ లో భాగంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అలీ దూకుడుగా ఆడి 41 పరుగులు చేయగా, జేమ్స్ విన్సె 22, డేవిడ్ విల్లె 20 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ ఆఫ్గన్ బౌలర్ల ధాటికి అలవోకగా వికెట్లు సమర్పించుకున్నారు. అఫ్ఘాన్ బౌలర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు.. ఆమిర్ హంజా, షెన్వారి తలా వికెట్ తీశారు. -
టాప్ ఆర్డర్ టపటపా రాలిపోయింది
న్యూఢిల్లీ: పసికూన ఆఫ్గనిస్థాన్ బౌలర్లు రాణించి దూకుడు మీదున్న ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేసినప్పటికీ, ఆ జట్టు బ్యాట్స్ మెన్ మాత్రం చేతులెత్తేశారు. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు ఇంగ్లండ్ బౌలింగ్ ముందు బెంబేలెత్తిపోయింది. ఇంగ్లిష్ బౌలర్లు వేసే పదునైన బంతులు ఎదుర్కొలేక చతికిలపడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో ఇద్దరు మాత్రం రెండంకెల స్కోరు చేశారు. నూర్ అలీ జార్డన్ 17, రషీద్ ఖాన్ 15 పరుగులతో కాస్తాకూస్తో క్రీజ్ లో నిలబడటానికి ప్రయత్నించారు. మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లో మహమ్మద్ షాజాద్ 4, కెప్టెన్ అస్ఘర్ స్తానిక్ జాయ్ 1 ఔటవ్వగా, గుల్బదిన్ నయబ్ డకౌటయ్యాడు. దీంతో 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి.. 45 పరుగులు చేసింది. పసికూన ఆఫ్గన్ జట్టును ఇంగ్లండ్ బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. డీజే విల్లీ మూడు ఓవర్లలో 17 పరుగులకు రెండు వికెట్లు తీయగా, సీజే జోర్డన్, ఎంఎం అలీ, ఏయూ రషీద్ తలో వికెట్ తీశారు. టీ20 వరల్డ్ కప్ సూపర్ టెన్ లో భాగంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అలీ దూకుడుగా ఆడి 41 పరుగులు చేయగా, జేమ్స్ విన్సె 22, డేవిడ్ విల్లె 20 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ ఆఫ్గన్ బౌలర్ల ధాటికి అలవోకగా వికెట్లు సమర్పించుకున్నారు. అఫ్ఘాన్ బౌలర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు.. ఆమిర్ హంజా, షెన్వారి తలా వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అఫ్ఘాన్ బౌలర్ ఆమిర్ హంజా.. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (5)ను బౌల్డ్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నబీ.. వరుస బంతుల్లో జేమ్స్ విన్సె, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్లో జో రూట్ (12) రనౌటయ్యాడు. స్టోక్స్ (7), బట్లర్ (6) కూడా ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాత జోర్డాన్ 15 పరుగులు చేశాడు. చివర్లో అలీ, విల్లె బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ సముచిత స్కోరు చేయగలిగింది. -
డెరిక్ప్రిన్స్ సెంచరీ
జింఖానా, న్యూస్‌లైన్: డానీ డెరిక్ ప్రిన్స్ (260 బంతుల్లో 133, 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కడంతో ఎంపీ కోల్ట్స్ కోలుకుంది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా హైదరాబాద్ బాట్లింగ్తో జరుగుతున్న మ్యాచ్‌లో బుధవారం తొలిరోజు మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎంపీ కోల్ట్స్ ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమవడంతో కోల్డ్స్ జట్టు తడబడింది. ఈ దశలో ప్రిన్స్ చక్కని పోరాటపటిమ కనబరిచాడు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ మ్యాచ్‌లో న్యూ బ్లూస్ జట్టును గెలాక్సీ జట్టు బౌలర్ సంజయ్ (7/46) బెంబేలెత్తించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూ బ్లూస్ 96 పరుగులకే కుప్పకూలింది. జట్టులో వల్లభ్ (34 పరుగులు) మినహా ఎవరు రాణించలేకపోయారు. 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గెలాక్సీ జట్టు రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రిత్విక్ రెడ్డి 31, రాజేంద్ర 39 (నాటౌట్) పరుగులు చేశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎమ్‌సీసీ: 233 (అనురాగ్ 56, రేయాన్ కౌండిన్య 32, శ్రీకర్ 35 నాటౌట్; సాయి 4 /50, ప్రసన్న 3/30); అవర్స్: 141 (జైన్ ఖాద్రీ 71) మెగాసిటీ: 215 (శ్రీకర్ 43, అభిజిత్ 32, శుభమ్ 38; రాకేష్ 4/95); క్రౌన్: 216/9 (సాజిద్ 58, జగదీష్ 54, సమీ 35 నాటౌట్; అక్షయ్ 4/52).