జింఖానా, న్యూస్‌లైన్: డానీ డెరిక్ ప్రిన్స్ (260 బంతుల్లో 133, 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కడంతో ఎంపీ కోల్ట్స్ కోలుకుంది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో భాగంగా హైదరాబాద్ బాట్లింగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బుధవారం తొలిరోజు మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎంపీ కోల్ట్స్ ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమవడంతో కోల్డ్స్ జట్టు తడబడింది. ఈ దశలో ప్రిన్స్ చక్కని పోరాటపటిమ కనబరిచాడు.
ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ మ్యాచ్‌లో న్యూ బ్లూస్ జట్టును గెలాక్సీ జట్టు బౌలర్ సంజయ్ (7/46) బెంబేలెత్తించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూ బ్లూస్ 96 పరుగులకే కుప్పకూలింది. జట్టులో వల్లభ్ (34 పరుగులు) మినహా ఎవరు రాణించలేకపోయారు. 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గెలాక్సీ జట్టు రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రిత్విక్ రెడ్డి 31, రాజేంద్ర 39 (నాటౌట్) పరుగులు చేశారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఎమ్‌సీసీ: 233 (అనురాగ్ 56, రేయాన్ కౌండిన్య 32, శ్రీకర్ 35 నాటౌట్; సాయి 4 /50, ప్రసన్న 3/30); అవర్స్: 141 (జైన్ ఖాద్రీ 71)
మెగాసిటీ: 215 (శ్రీకర్ 43, అభిజిత్ 32, శుభమ్ 38; రాకేష్ 4/95); క్రౌన్: 216/9 (సాజిద్ 58, జగదీష్ 54, సమీ 35 నాటౌట్; అక్షయ్ 4/52).
డెరిక్‌ప్రిన్స్ సెంచరీ
Published Thu, Aug 15 2013 12:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement