మాంచెస్టర్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా టాపార్డర్ పేక మేకడలా కుప్పకూలంతో ట్విటర్‌లో జోకులు పేలుతున్నాయి. కామెంట్లు, ఫొటోలు, వీడియోలతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్ల ధాటికి కెప్టెన్ విరాట్ కోహ్లి(1), వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(1), కేఎల్ రాహుల్(1), దినేశ్ కార్తీక్(6) వెంట వెంటనే పెవిలియన్ దారిపట్టారు.
భారత్ టాపార్డర్ వైఫల్యంపై ట్విటర్‌లో పెద్ద ఎత్తున వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నంబర్‌వన్, నంబర్‌టూ ఆటగాలిద్దరూ కలిపి రెండే పరుగులు చేశారని కోహ్లి, రోహిత్ ఉద్దేశించి కామెంట్ చేశారు. ఈరోజు టీమిండియాను రక్షించేవాడు మహేంద్ర సింగ్ ధోని మాత్రమేనని మహి ఫ్యాన్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానుల ప్రస్తుత పరిస్థితి ఇలా ఉండదంటూ ఫన్నీ ఫొటోలు షేర్ చేసి కామెంట్లు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment