మార్టిన్ గప్టిల్
మాంచెస్టర్ : డైరెక్ట్ హిట్‌తో భారత ఆశలను సమాధి చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఆ రనౌట్‌పై స్పందించాడు. టీమిండియా ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని రనౌట్ కావడం తన అదృష్టమని పేర్కొన్నాడు. భారత్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో గప్టిల్ తన అద్భుత ఫీల్డింగ్‌తో ధోనిని పెవిలియన్‌ను చేర్చిన విషయం తెలిసిందే. భారత విజయానికి 12 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని ఓ భారీ సిక్స్ కొట్టి గెలుపు ఆశలను రేకిత్తించాడు. ఆ మరుసటి బంతిని వదిలేసిన మూడో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో గప్టిల్ డైరెక్ట్ త్రోకు ఔటయ్యాడు. ఈ ఔట్‌తో ప్రపంచకప్‌లో భారత్ పోరాటం ముగిసింది. అయితే బ్యాటింగ్‌తో ఆకట్టుకోని గప్టిల్ ఈ ఒక్క రనౌట్‌తో హీరో అయ్యాడు. ఈ రనౌట్‌పై ఐసీసీ ట్వీట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘ఎంత అదృష్టం ఉంటే ధోనిని కీలక సమయంలో డైరెక్ట్ హిట్‌తో ఔట్ చేస్తాను’ అని సంబరపడిపోయాడు.
"Lucky enough to get a direct hit from out there" – New Zealand's @Martyguptill on his ⚡ ️throw to dismiss MS Dhoni in the #CWC19 semi-final against India. #BackTheBlackCaps pic.twitter.com/GnerDahQgQ
— ICC (@ICC) July 11, 2019
Comments
Please login to add a commentAdd a comment