T10 League: Rahmanullah Gurbaz Hitting Delhi Bulls Finish Match In 20 Min - Sakshi
Sakshi News home page

T10 League: బ్యాట్స్‌మన్‌ వీరబాదుడు.. 20 నిమిషాల్లోనే మ్యాచ్‌ ఖేల్‌ఖతం

Published Fri, Dec 3 2021 1:58 PM | Last Updated on Fri, Dec 3 2021 4:10 PM

T10 League: Rahmanullah Gurbaz Hitting Delhi Bulls Finish Match 20 Min - Sakshi

Delhi Bulls Finished Match In 20 Minutes Vs Chennai Braves In T10 League..  అబుదాబి టి10 లీగ్‌లో సంచలన ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి.  చెన్నై బ్రేవ్స్‌, ఢిల్లీ బుల్స్‌ మధ్య మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌ 20 నిమిషాల్లోనే ముగిసింది. ఢిల్లీ బుల్స్‌ బ్యాట్స్‌మన్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ వీరబాదుడుతో 81 పరుగుల లక్ష్యాన్ని 4.1 ఓవర్లలో చేధించిన ఢిల్లీ బుల్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. కేవలం 14 బంతుల్లోనే అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్న ఓపెనర్‌ గుర్బాజ్‌ టి10 లీగ్‌ చరిత్రలోనే వేగవంతమైన అర్థశతకం సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇక ఓవరాల్‌గా 16 బంతుల్లో 57 పరుగులు చేసిన గుర్బాజ్‌ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్‌ చంద్రపాల్‌ హేమరాజ్‌ 9 బంతుల్లో 24 పరుగులతో సహకరించాడు.

చదవండి: Abu Dhabi T10 League: సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే

కాగా ఈ సీజన్‌లో గుర్బాజ్‌కు ఇది వరుసగా ఐదో అర్థసెంచరీ కావడం విశేషం. టి10 లీగ్‌ వరుసగా ఐదు అర్థసెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా గుర్బాజ్‌ చరిత్ర సృష్టించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై బ్రేవ్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెప్టెన్‌ పెరీరా 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

చదవండి: Navdeep Saini: కసితో వేశాడు.. స్టంప్‌ ఎగిరి గాల్లో పల్టీలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement