క్రికెట్‌లో కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అవి నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని సార్లు చిరాకు కలిగిస్తాయి. తాజాగా అలాంటి ఘటనే యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. కీపర్ బంతిని సక్రమంగా అందుకున్న తర్వాత కూడా ప్రత్యర్థి బ్యాటర్లు మూడు పరుగులు రాబట్టడం ఆసక్తి రేకెత్తింది. విషయంలోకి వెళితే..టి10 లీగ్‌లో భాగంగా ప్రేగ్ బార్బేరియన్, వినోహ్రడీ మధ్య మ్యాచ్ జరిగింది.
వర్షం అంతరాయం కలిగించడంతో 10 ఓవర్ల మ్యాచ్ కాస్త ఐదు ఓవర్లకు కుదించారు. తొలుత ప్రేగ్ బార్బేరియన్స్ బ్యాటింగ్ చేసింది. ఆఖరి ఓవర్ మాత్రమే మిగిలి ఉండడంతో హిట్టింగ్ చేయాలని జట్టు భావించింది. అయితే బౌలర్ వేసిన బంతిని ప్రేగ్ బ్యాటర్ మిస్ చేశాడు. దీంతో బంతి వెళ్లి కీపర్ చేతిలో పడింది. అయితే రన్‌కు పరిగెత్తడంతో కీపర్ త్రో విసిరాడు. బంతి స్టంప్స్‌ను తాకడం మిస్ అయింది.. ఒక పరుగు వచ్చింది. ఒక రన్ కదా అని సరిపెట్టుకున్నాం. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కీపర్ వేసిన బంతిని అవతలి ఎండ్‌లో ఉన్న బౌలర్ అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ప్రత్యర్థి బ్యాటర్లు చకచకా మరో పరుగును పూర్తి చేశారు.
దీంతో బౌలర్ మరోసారి బంతిని త్రో విసిరాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మూడో పరుగును కూడా పూర్తి చేశారు. అలా తమ కన్ఫూజన్‌తో ప్రత్యర్థి జట్టుకు అనవసరంగా మూడు పరుగులు సమర్పించుకున్నామా అని చూడడం తప్ప ఏం చేయలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేశారు. ''హతవిధి.. మిమ్మల్ని చూసి నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాని స్థితిలో ఉన్నాం'' అంటూ తెలిపారు.
చదవండి: ఫాస్ట్ బౌలర్లతో వచ్చిన సమస్య ఇదే.. రక్తం చిందించిన వేళ
SL vs AUS: దురదృష్టమంటే మెండిస్‌దే.. బంతిని కొట్టబోయి పొరపాటున..!
Comments
Please login to add a commentAdd a comment