క్రికెట్‌లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. మాములుగా స్లిప్‌లో ఇద్దరు లేదా ముగ్గురు.. మహా అయితే నలుగురు ఫీల్డర్లు ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మ్యాచ్‌లో మాత్రం తొమ్మిది మంది స్లిప్ ఫీల్డర్లు కనిపిస్తారు. మాములుగా క్రికెట్ మ్యాచ్‌లో ఒక జట్టులో ఉండేదే 11 మంది ఆటగాళ్లు. కీపర్, బౌలర్‌ను వదిలేస్తే మిగతా తొమ్మిది మంది స్లిప్‌లోనే ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే దీనికి సంబంధించిన ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఈ అరుదైన ఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో జరిగింది. రొమేనియా, నార్వే జట్ల మధ్య టి10 మ్యాచ్ జరిగింది.రొమేనియా ఇన్నింగ్స్ సమయంలో నార్వే స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను మోహరించింది. మరి ఇంత మంది ఫీల్డర్లను చూసి కన్ఫ్యూజ్ అయిన సదరు బ్యాటర్ పరుగులు సాధించాడా లేదా అనే అనుమానం వస్తుంది. కానీ ఆ బ్యాటర్ తెలివిగా వాళ్ల మధ్యలో నుంచి షాట్ ఆడి రెండు పరుగులు తీయడం విశేషం.
మ్యాచ్ గెలుస్తామన్న ధీమా వచ్చిన తర్వాతే స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను ఉంచినట్లు నార్వే కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. ''వార్నీ స్లిప్‌లోనే జట్టు మొత్తం కనిపిస్తుంది.. ఇదేం ఫీల్డింగ్'' అంటూ నోరెళ్లబెట్టారు. మ్యాచ్ విషయానికి వస్తే.. నార్వే జట్టు 43 పరుగులతో ఘన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్వే 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రొమేనియా నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చదవండి: సూర్యకుమార్ ‘ప్రాక్టీస్’
Comments
Please login to add a commentAdd a comment