slip fielder
-
'అందరూ మీలా షార్ప్‌గా ఉండరు'.. ఆసీస్ మాజీ క్రికెటర్‌కు చురకలు
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఎంత మంచి ఫీల్డర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్‌ల్లో ఎన్నోసార్లు స్టన్నింగ్ క్యాచ్‌లతో మెరిశాడు. క్యాచ్‌లు పట్టడంలో కింగ్ అయిన కోహ్లి ఎప్పుడో ఒకసారి మాత్రమే మిస్ చేయడం చూస్తుంటాం. తాజాగా కోహ్లి నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో రెండు క్యాచ్‌లు నేలపాలు చేశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని స్మిత్ ఔట్‌సైడ్ ఎడ్జ్ దిశగా ఆడాడు. ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న కోహ్లి ఏమరపాటులో చూసుకోలేదు. అప్పటికే బంతి అతని చేతి నుంచి కాస్త దూరంగా వెళ్తుంది. అయితే బంతిని పట్టుకునే ప్రయత్నంలో కోహ్లి విఫలమయ్యాడు. దీంతో అక్షర్ పటేల్, రోహిత్ శర్మలు కోహ్లిని చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో స్మిత్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ తర్వాత మరో క్యాచ్‌ను కూడా ఇదే తరహాలో కోహ్లి జారవిడిచాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి క్యాచ్‌లు నేలపాలు చేయడంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా చురకలు అంటించాడు. తొలి టెస్టుకు కామెంటరీ నిర్వహిస్తున్న మార్క్ వా మాట్లాడుతూ.. ''మేటి ఫీల్డర్ అని పేరున్న కోహ్లి ఇలా రెండు క్యాచ్‌లు నేలపాలు చేయడం ఆశ్చర్యపరిచింది. కోహ్లి గేమ్‌లో ఉన్నప్పటికి బాడీ ప్రజెంట్.. మైండ్ ఆబ్సంట్ అన్న తరహాలో ఉన్నాడు. ప్రతీ బంతి తనవైపే వస్తుందా అన్నంతలా మైండ్ షార్ప్‌గా ఉండాలి. స్లిప్ ఫీల్డింగ్ అంటే ఏకాగ్రత చాలా అవసరం. ఒక క్షణం మిస్సయినా క్యాచ్‌లు పోతాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లిని తప్పుబడుతూ మార్క్ వా చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు గరమయ్యారు. ''అందరూ మీలా షార్ప్ ఫీల్డర్స్ ఉండరండి.. ఏదో ఒక సమయంలో పొరపాటు జరుగుతుంది''.. ''కోహ్లి గురించి మాకు తెలుసు.. ఏదో ఒక్కసారి పొరపాటు జరగడం సహజం'' అంటూ పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ మార్క్ వాకు మంచి ఫీల్డర్ అన్న ట్యాగ్‌లైన్ ఉంది. అతను స్లిప్‌లో ఉంటే బంతి అతన్ని దాటి వెళ్లడం చాలా కష్టం. 128 టెస్టుల్లో ఎక్కువశాతం స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన మార్క్‌వా ఓవరాల్‌గా 181 క్యాచ్‌లు తీసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న నాన్ వికెట్ కీపర్ జాబితాలో మార్క్ వాది ఐదో స్థానం. Currently: Virat Kohli is The Worst and The Most Overrated Fielder of Team India pic.twitter.com/5ZMfrk2hMv — Immy|| 🇮🇳 (@TotallyImro45) February 9, 2023 -
క్రికెట్లో అరుదైన ఘటన.. నోరెళ్లబెట్టడం ఖాయం!
క్రికెట్లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. మాములుగా స్లిప్‌లో ఇద్దరు లేదా ముగ్గురు.. మహా అయితే నలుగురు ఫీల్డర్లు ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మ్యాచ్‌లో మాత్రం తొమ్మిది మంది స్లిప్ ఫీల్డర్లు కనిపిస్తారు. మాములుగా క్రికెట్ మ్యాచ్‌లో ఒక జట్టులో ఉండేదే 11 మంది ఆటగాళ్లు. కీపర్, బౌలర్‌ను వదిలేస్తే మిగతా తొమ్మిది మంది స్లిప్‌లోనే ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే దీనికి సంబంధించిన ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ అరుదైన ఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో జరిగింది. రొమేనియా, నార్వే జట్ల మధ్య టి10 మ్యాచ్ జరిగింది.రొమేనియా ఇన్నింగ్స్ సమయంలో నార్వే స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను మోహరించింది. మరి ఇంత మంది ఫీల్డర్లను చూసి కన్ఫ్యూజ్ అయిన సదరు బ్యాటర్ పరుగులు సాధించాడా లేదా అనే అనుమానం వస్తుంది. కానీ ఆ బ్యాటర్ తెలివిగా వాళ్ల మధ్యలో నుంచి షాట్ ఆడి రెండు పరుగులు తీయడం విశేషం. మ్యాచ్ గెలుస్తామన్న ధీమా వచ్చిన తర్వాతే స్లిప్‌లో తొమ్మిది మంది ఫీల్డర్లను ఉంచినట్లు నార్వే కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. ''వార్నీ స్లిప్‌లోనే జట్టు మొత్తం కనిపిస్తుంది.. ఇదేం ఫీల్డింగ్'' అంటూ నోరెళ్లబెట్టారు. మ్యాచ్ విషయానికి వస్తే.. నార్వే జట్టు 43 పరుగులతో ఘన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్వే 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రొమేనియా నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) చదవండి: సూర్యకుమార్ ‘ప్రాక్టీస్’ -
ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. స్లిప్స్‌లో ఎనిమిది మంది ఫీల్డర్లు.. తొలి బంతికే!
Finlands Use of eight slips vs England XI: యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏ ఫార్మాట్లోనైనా బ్యాటర్లపై ఒత్తిడి పెంచేందుకు స్లిప్స్‌లో.. కెప్టెన్ ఫీల్డర్లను పెట్టడం సాధారణంగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో మూడు లేక నలుగురు ఫీల్డర్లను స్లిప్స్‌లో పెడతారు. అయితే, టీ10 మ్యాచ్ సందర్భంగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఎలెవన్ ఇన్నింగ్స్‌లో ఫిన్‌ల్యాండ్ బౌలర్ అమ్జద్ షేర్ వేసిన తొలి బంతికే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 8 మంది ఫీల్డర్లను కెప్టెన్ జోనాథన్ స్కామన్స్ స్లిప్స్‌లో పెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఎలెవన్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఫిన్‌ల్యాండ్ నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 100 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లండ్ ఎలెవన్ 14 పరుగుల తేడాతో ఫిన్‌ల్యాండ్‌పై విజయం సాధించింది. చదవండి: Poonam Raut: పూనమ్ క్రీడా స్ఫూర్తికి ఆసీస్ క్రికెటర్ ఫిదా.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’ Just one normal day of European Championship Cricket 🙏 Finland start the game against England with EIGHT in the slips, and a leg slip for good measure 😂#ECC21 pic.twitter.com/lnuTv2RwMt — Cricket on BT Sport (@btsportcricket) September 30, 2021 -
ఆ క్యాచ్ చూస్తే ఔరా అనాల్సిందే..
కేప్‌టౌన్: క్రికెట్లో స్లిప్ ఫీల్డింగ్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా క్యాచ్ చేజారడమే కాకుండా బంతి శరీరంపైకి దూసుకొచ్చి గాయాలబారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్థానంలో ఫీల్డింగ్ అంటే ఫీల్డర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. దక్షిణాప్రికా దేశవాళి క్రికెట్లో భాగంగా జరిగిన ఓ 50 ఓవర్ మ్యాచ్‌లో ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మార్టిన్ వాన్ జార్స్‌వెల్డ్ అనే ఆటగాడు చాలా అప్రమత్తంగా వ్యవహరించి, బ్యాట్స్‌మెన్ బంతిని ఆడే దిశను ముందుగానే పసిగట్టి, ఫస్ట్ స్లిప్ నుంచి లెగ్ సైడ్‌కు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. బ్యాట్స్‌మెన్ స్కూప్ షాట్‌కు ప్రయత్నిస్తున్నాడని పసిగట్టి, వికెట్‌కీపర్ వెనుక నుంచి అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్‌ను ఒడిసిపట్టుకొని ఫీల్డ్‌లో ఉన్నవారందరిని అవాక్కయ్యేలా చేశాడు. ఆ క్రికెటర్ చేసిన అద్భుత విన్యాసం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఫీల్డర్ చూపిన సమయస్పూర్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ క్యాచ్‌ను ఆల్‌టైమ్ గ్రేట్ స్లిప్ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ఫీట్‌ను సాధించిన జార్స్‌వెల్డ్ దక్షిణాఫ్రికా తరపున 9టెస్టులు, 11 వన్డేలు ఆడాడు. కాగా, దక్షిణాఫ్రికా జట్టు జాంటీ రోడ్స్ లాంటి అల్‌టైమ్ గ్రేట్ ఫీల్డర్లను అందించడమే కాకుండా, గ్యారీ కిర్‌స్టన్, గ్రేమ్ స్మిత్ లాంటి అద్భుతమైన స్లిప్ ఫీల్డర్లను కూడా అందించింది. This is one of the great all-time slips catches from South Africa's provincial 50-over competition! pic.twitter.com/5Gpfv9V9Jg — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) March 1, 2021 -
ఆ ఫేక్ షాట్‌తో బిత్తరపోయిన కీపర్, ఫీల్డర్
బ్యాట్స్‌మన్ ఏ షాట్ ఆడుతాడో.. కొంత ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టు కీపర్, ఫీల్డర్ తమ దిశను మార్చుకుంటున్నారు. బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి తమను దాటి తప్పించుకోకుండా ఈ జాగ్రత్త తీసుకుంటారు. కానీ ఓ అనూహ్య ఫేక్ షాట్‌తో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మిస్బావుల్ హక్ ఇంగ్లండ్ వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్‌ను బోల్తా కొట్టించాడు. 2015లో యూఏఈలో పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఓ టెస్టు మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మిస్బా అనూహ్యరీతిలో వికెట్ కీపర్‌ను, స్లిప్ ఫీల్డర్‌ను బురిడీ కొట్టించాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో బంతి గింగిరాలు తిరుగుతూ మిస్బాపైకి వచ్చింది. దీంతో స్వీప్ షాట్ కొట్టేందుకు సిద్ధమైనట్టు మిస్బా పోజు ఇచ్చాడు. బ్యాట్స్‌మన్ మూవ్‌మెంట్‌ను బట్టి అతను స్వీప్ షాట్ కొడతాడని భావించిన స్లిప్ ఫీల్డర్ జేమ్స్ అండర్సన్ లేగ్సైడ్కు మారాడు. కీపర్ జాస్ బట్లర్ కూడా ముందుజాగ్రత్తగా కొద్దిగా లెగ్‌సైడ్‌కు జరిగాడు. ఇంతలో మిస్బా బంతి గమనాన్ని పసిగట్టి.. మెరుపువేగంతో దానిని లేట్ కట్ చేశాడు. దాంతో స్లిప్‌లో క్యాచ్ అవ్వాల్సిన బంతి.. అక్కడ ఎవరూ లేకపోవడంతో బౌండరీ దిశగా దూసుకుపోయింది. బౌండరీ లైన్ వద్ద బంతిని ఫీల్డర్ ఆపాడు. లేకుంటే ఫోర్ అయ్యేదే. ఈ సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.