టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఎంత మంచి ఫీల్డర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్‌ల్లో ఎన్నోసార్లు స్టన్నింగ్ క్యాచ్‌లతో మెరిశాడు. క్యాచ్‌లు పట్టడంలో కింగ్ అయిన కోహ్లి ఎప్పుడో ఒకసారి మాత్రమే మిస్ చేయడం చూస్తుంటాం. తాజాగా కోహ్లి నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో రెండు క్యాచ్‌లు నేలపాలు చేశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది.
అక్షర్ పటేల్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని స్మిత్ ఔట్‌సైడ్ ఎడ్జ్ దిశగా ఆడాడు. ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న కోహ్లి ఏమరపాటులో చూసుకోలేదు. అప్పటికే బంతి అతని చేతి నుంచి కాస్త దూరంగా వెళ్తుంది. అయితే బంతిని పట్టుకునే ప్రయత్నంలో కోహ్లి విఫలమయ్యాడు. దీంతో అక్షర్ పటేల్, రోహిత్ శర్మలు కోహ్లిని చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో స్మిత్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ తర్వాత మరో క్యాచ్‌ను కూడా ఇదే తరహాలో కోహ్లి జారవిడిచాడు.
ఇదిలా ఉంటే.. కోహ్లి క్యాచ్‌లు నేలపాలు చేయడంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా చురకలు అంటించాడు. తొలి టెస్టుకు కామెంటరీ నిర్వహిస్తున్న మార్క్ వా మాట్లాడుతూ.. ''మేటి ఫీల్డర్ అని పేరున్న కోహ్లి ఇలా రెండు క్యాచ్‌లు నేలపాలు చేయడం ఆశ్చర్యపరిచింది. కోహ్లి గేమ్‌లో ఉన్నప్పటికి బాడీ ప్రజెంట్.. మైండ్ ఆబ్సంట్ అన్న తరహాలో ఉన్నాడు. ప్రతీ బంతి తనవైపే వస్తుందా అన్నంతలా మైండ్ షార్ప్‌గా ఉండాలి. స్లిప్ ఫీల్డింగ్ అంటే ఏకాగ్రత చాలా అవసరం. ఒక క్షణం మిస్సయినా క్యాచ్‌లు పోతాయి అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే కోహ్లిని తప్పుబడుతూ మార్క్ వా చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు గరమయ్యారు. ''అందరూ మీలా షార్ప్ ఫీల్డర్స్ ఉండరండి.. ఏదో ఒక సమయంలో పొరపాటు జరుగుతుంది''.. ''కోహ్లి గురించి మాకు తెలుసు.. ఏదో ఒక్కసారి పొరపాటు జరగడం సహజం'' అంటూ పేర్కొన్నారు.
ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ మార్క్ వాకు మంచి ఫీల్డర్ అన్న ట్యాగ్‌లైన్ ఉంది. అతను స్లిప్‌లో ఉంటే బంతి అతన్ని దాటి వెళ్లడం చాలా కష్టం. 128 టెస్టుల్లో ఎక్కువశాతం స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన మార్క్‌వా ఓవరాల్‌గా 181 క్యాచ్‌లు తీసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న నాన్ వికెట్ కీపర్ జాబితాలో మార్క్ వాది ఐదో స్థానం.
Currently:
— Immy|| 🇮🇳 (@TotallyImro45) February 9, 2023
Virat Kohli is The Worst and The Most Overrated Fielder of Team India pic.twitter.com/5ZMfrk2hMv
Comments
Please login to add a commentAdd a comment