Mark Waugh
-
'అందరూ మీలా షార్ప్‌గా ఉండరు'.. ఆసీస్ మాజీ క్రికెటర్‌కు చురకలు
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఎంత మంచి ఫీల్డర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్‌ల్లో ఎన్నోసార్లు స్టన్నింగ్ క్యాచ్‌లతో మెరిశాడు. క్యాచ్‌లు పట్టడంలో కింగ్ అయిన కోహ్లి ఎప్పుడో ఒకసారి మాత్రమే మిస్ చేయడం చూస్తుంటాం. తాజాగా కోహ్లి నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో రెండు క్యాచ్‌లు నేలపాలు చేశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 16వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని స్మిత్ ఔట్‌సైడ్ ఎడ్జ్ దిశగా ఆడాడు. ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న కోహ్లి ఏమరపాటులో చూసుకోలేదు. అప్పటికే బంతి అతని చేతి నుంచి కాస్త దూరంగా వెళ్తుంది. అయితే బంతిని పట్టుకునే ప్రయత్నంలో కోహ్లి విఫలమయ్యాడు. దీంతో అక్షర్ పటేల్, రోహిత్ శర్మలు కోహ్లిని చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో స్మిత్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆ తర్వాత మరో క్యాచ్‌ను కూడా ఇదే తరహాలో కోహ్లి జారవిడిచాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి క్యాచ్‌లు నేలపాలు చేయడంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా చురకలు అంటించాడు. తొలి టెస్టుకు కామెంటరీ నిర్వహిస్తున్న మార్క్ వా మాట్లాడుతూ.. ''మేటి ఫీల్డర్ అని పేరున్న కోహ్లి ఇలా రెండు క్యాచ్‌లు నేలపాలు చేయడం ఆశ్చర్యపరిచింది. కోహ్లి గేమ్‌లో ఉన్నప్పటికి బాడీ ప్రజెంట్.. మైండ్ ఆబ్సంట్ అన్న తరహాలో ఉన్నాడు. ప్రతీ బంతి తనవైపే వస్తుందా అన్నంతలా మైండ్ షార్ప్‌గా ఉండాలి. స్లిప్ ఫీల్డింగ్ అంటే ఏకాగ్రత చాలా అవసరం. ఒక క్షణం మిస్సయినా క్యాచ్‌లు పోతాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లిని తప్పుబడుతూ మార్క్ వా చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు గరమయ్యారు. ''అందరూ మీలా షార్ప్ ఫీల్డర్స్ ఉండరండి.. ఏదో ఒక సమయంలో పొరపాటు జరుగుతుంది''.. ''కోహ్లి గురించి మాకు తెలుసు.. ఏదో ఒక్కసారి పొరపాటు జరగడం సహజం'' అంటూ పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ మార్క్ వాకు మంచి ఫీల్డర్ అన్న ట్యాగ్‌లైన్ ఉంది. అతను స్లిప్‌లో ఉంటే బంతి అతన్ని దాటి వెళ్లడం చాలా కష్టం. 128 టెస్టుల్లో ఎక్కువశాతం స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన మార్క్‌వా ఓవరాల్‌గా 181 క్యాచ్‌లు తీసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న నాన్ వికెట్ కీపర్ జాబితాలో మార్క్ వాది ఐదో స్థానం. Currently: Virat Kohli is The Worst and The Most Overrated Fielder of Team India pic.twitter.com/5ZMfrk2hMv — Immy|| 🇮🇳 (@TotallyImro45) February 9, 2023 -
దిగ్గజాలు ఇప్పుడేం సమాధానం ఇస్తారు!
బ్రిస్బేన్: ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై అత్యంత చెత్త రికార్డును మూట గట్టుకున్న భారత జట్టుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.అందునా తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి తిరిగి రావడంతో ఇవి మరీ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రికీ పాంటింగ్, మైకెల్ వాన్, మార్క్ వా, మైకెల్ క్లార్క్, బ్రాడ్ హడిన్ లాంటి మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా టీమిండియాపై వెటకారంతో మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ' కోహ్లి లేని టీమిండియాను చూడలేమని ఒకరంటే.. తొలి టెస్టులోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా పని అయిపోయిందని.. ఈసారి వైట్‌వాష్ తప్పదని.. టీమిండియాకు ఇది ఒక చీకటి సిరీస్' అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది కానీ నెలరోజులు తిరగకముందే టీమిండియా 2-1 తేడాతో ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే వరుసగా రెండో సారి టెస్టు సిరీస్‌ను దక్కించుకొని ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వినూత్న రీతిలో స్పందించాడు. టీమిండియాను ఎత్తిపొడుస్తూ మాట్లాడిన మాజీ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని వారి ట్వీట్స్‌తో పాటు భారత జట్టు కప్ అందుకున్న ఫోటోను షేర్ చేస్తూ తనదైన శైలిలో చురకలంటించాడు. ‘గుడ్ ఈవ్నింగ్ గబ్బా!! ఈ మైదానంలో నేను ఆడలేకపోయాను క్షమించండి. కఠినమైన సమయంలో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, గట్టి పోటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సిరీస్‌ను ఎప్పటికీ మరిచిపోలేం. ఇక కొందరు దిగ్గజాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నా.. కోహ్లి లేకుండా మేం సిరీస్‌ను గెలవలేమన్నారు. ప్రధాన ఆటగాళ్లంతా గాయపడినా కుర్రాళ్లతో కలిసి బ్రిస్బేన్ టెస్టులో మరుపురాని విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టూ ఆర్ఎల్ఎస్.. ఈక్వేషన్‌ను సరిచేశాం. దిగ్గజాలు ఇప్పుడే సమాధానం ఇస్తారో చెప్పండి' అంటూ ట్రోల్ చేశాడు.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్: భారత జట్టు ఇదే! కాగా మూడో టెస్టులో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్, అశ్విన్‌ల మధ్య జరిగిన సంభాషణ గురించి అందరికి తెలిసిందే. గాయంతో నాలుగో టెస్టుకు దూరమైన అశ్విన్ మూడో టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న భారత్‌ను హనుమ విహారితో కలిసి ఆసీస్ భీకరమైన బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచాడు. ఒకవైపు ఆసీస్ పేసర్ల విసురుతున్న బౌన్సర్ల దాటికి నెత్తురోడుతున్న ఏ మాత్రం ఆలక్ష్యం వహించకుండా ఓపికతో ఆడిన అశ్విన్.. టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ క్రమంలోనే టిమ్ పైన్ అశ్విన్‌పై స్లెడ్జింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. 'నిన్ను గబ్బాలో ఎదుర్కొవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా.. అశ్విన్'అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.వీటికి అశ్విన్ కూడా తనదైన శైలిలో ‘మేము కూడా మిమ్మల్ని భారత్‌లో కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. బహుశా నీకు అదే చివరి సిరీస్ కావొచ్చు.'అని ధీటుగా బదులిచ్చాడు. అయితే పైన్ తాను చేసిన పనికి సిగ్గుపడుతూ అశ్విన్‌కు క్షమాపణ కోరడంతో వివాదం సద్దుమణిగింది.చదవండి: ఆసీస్‌తో సిరీస్ : అసలైన హీరో అతనే కాగా నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 7 వికట్లు కోల్పోయి ఛేదించింది. రిషభ్ పంత్(89 నాటౌట్), శుభ్‌మన్ గిల్(91) దూకుడు కనబర్చగా.. పుజారా(56) తనదైన డిఫెన్స్‌తో మెరిసాడు. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది. LHS ( not = ) RHS ! Yours happily India tour of OZ 2020/21 Humbled by all the love and support we have received over the last 4 weeks!🙏 pic.twitter.com/nmjC3znglx — Ashwin 🇮🇳 (@ashwinravi99) January 19, 2021 -
'తొందరపడ్డావు.. కొంచెం ఆగుంటే బాగుండేది'
సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 3వ ఓవర్లోనే ఔట్అయిన సంగతి తెలిసిందే. 5 పరుగులు చేసిన వార్నర్ సిరాజ్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వార్నర్ అవుట్ కావడంపై ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్‌వా అసంతృప్తి వ్యక్తం చేశాడు.వార్నర్ ఔట్ అయిన విధానం నాకు నచ్చలేదు. ఒక లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. మ్యాచ్ ఆరంభమైన 20 నిమిషాలకే ఆ షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. టెస్టు మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడు అవసరం లేదనే విషయం వార్నర్‌కు తెలుసు... అయినా తొందరపడ్డాడు. కాస్త ఓపికగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వదిలేయకుండా ఒక లూజ్ షాట్ ఆడి వికెట్ సమర్పించుకోవడం కరెక్ట్ కాదు అంటూ మార్క్‌వా చెప్పుకొచ్చాడు. (చదవండి: రిషభ్ పంత్‌పై ట్రోలింగ్.. సైనీ తొలి వికెట్!) మరో మాజీ ఆటగాడు మైకెల్ హస్సీ కూడా వార్నర్ షాట్‌పై పెదవి విరిచాడు. వార్నర్ బాడీ లాంగ్వేజ్‌లో చాలా తేడా కనిపించింది. అతను వంద శాతం ఫిట్‌గా లేకున్నా మ్యాచ్‌లోకి బరిలోకి దిగాడనిపిస్తుంది. షాట్ ఎంపికలో వార్నర్ పొరపాటు స్పష్టంగా తెలుస్తుందంటూ తెలిపాడు. కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డే అనంతరం గాయపడిన వార్నర్ చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. మొదట టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావించినా గాయం తీవ్రత తగ్గకపోవడంతో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు.(చదవండి: మహ్మద్ సిరాజ్ కంటతడి) అయితే మూడో టెస్టుకు ఎంపిక చేసే సమయానికి వార్నర్ 100శాతం ఫిట్‌గా లేకున్నా క్రికెట్ ఆస్రేలియా అతన్ని తుది జట్టులోకి తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా వార్నర్ మూడో టెస్టులో త్వరగా ఔట్ కావడంతో మరోసారి అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
ఐసీసీపై మార్క్ వా ఫైర్
సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే ప్రతీ మెగా ఈవెంట్ షెడ్యూల్‌ను ఎంతో జాగ్రత్తగా ఖరారు చేస్తారు. కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ మాత్రం అందుకు భిన్నంగా కనబడుతోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకుండా షెడ్యూల్ చేయడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. గ్రూప్ స్టేజ్‌లో రెండు మ్యాచ్‌లు వర్షార్పణం కాగా, నాకౌట్ స్టేజ్‌లో ఒక మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దయ్యింది. ఈరోజు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దాంతో గ్రూప్ స్టేజ్‌లో అసలు ఓటమి అనేది లేకుండా మెరుగైన రన్‌రేట్ కల్గి ఉన్న భారత్ ఫైనల్‌కు చేరింది. ఇక్కడ రిజర్వ్ డే లేకపోవడంతో ఇంగ్లండ్ భారంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. (వరల్డ్ టీ20: ఫైనల్‌కు టీమిండియా తొలిసారి) గత వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్.. ఈసారి సెమీస్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ జరిగి ఓడిపోతే పెద్దగా బాధించకపోవచ్చు కానీ, అసలు గేమ్ జరగకుండా ఇలా టోర్నీని ముగించడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఆసీస్ మాజీ కెప్టెన్ మార్క్ వా.. ఐసీసీ తీరుపై ఫైర్ అయ్యాడు. అసలు రిజర్వ్ డే లేకుండా నాకౌట్ మ్యాచ్‌లు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అందులోనూ అతి పెద్ద టోర్నీల్లో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారని నిలదీశాడు. చాలా మందికి వరల్డ్కప్లాంటి మెగా టోర్నీలు ఆడటం వారి జీవితాశయంగా ఉంటుంది. అటు వంటప్పుడు నాకౌట్ వంటి పెద్ద మ్యాచ్‌లు ఆడాల్సి రావడాన్ని కూడా గొప్పగా ఆస్వాదిస్తారు. నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకపోవడం అర్థరహితం. ఇది దారుణంగా అనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ కూడా రిజర్వ్ డే లేకపోవడం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తోంది’ అని మార్క్ వా ధ్వజమెత్తాడు. -
క్రికెట్లో అదొక వేస్ట్ రూల్.. దాన్ని తీసేయండి!
సిడ్నీ: గడిచిన కొన్నేళ్లలో ప్రపంచ క్రికెట్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త ఫార్మాట్లను పరిచయం చేయడం దగ్గర్నుంచీ కాంకషన్ సబ్‌స్టిట్యూట్ వరకూ పలు మార్పులు చేసింది ఐసీసీ. అయితే క్రికెట్లో లెగ్ బైస్ నిబంధనను తొలగించాలని అంటున్నాడు ఆసీస్ దిగ్గజ ఆటగాడు మార్క్ వా. క్రికెట్లో అదొక వేస్ట్ రూల్ అని పేర్కొన్న వా.. దాన్ని మార్చాలంటూ ఐసీసీకి విన్నవించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా గురువారం మెల్బోర్న్ స్టార్స్ -సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన మార్క్ వా బ్యాట్స్‌మెన్ తీసే లెగ్ బైస్‌పై విమర్శలు చేశాడు. ప్రధానంగా సిడ్నీ థండర్స్ బ్యాట్స్‌మన్ అలెక్స్ రాస్ పదే పదే లెగ్ బై రూపంలో పరుగులు సాధించడంతో వా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే సమయంలో అదొక అనవసరపు రూల్ అంటూ పేర్కొన్నాడు. ‘ మనకు తెలుసు.. క్రికెట్లో లెగ్ బైస్ రూల్ ఎప్పుడ్నుంచో అమలవుతుంది. ఇది అవసరమా. ఈ రూల్ మొత్తం క్రికెట్లో లేకుండా మార్చేయండి. నువ్వు బంతిని టచ్ చేయలేనప్పుడు పరుగులు ఎందుకు ఇవ్వాలి. శరీరానికి కానీ, ప్యాడ్లకు కానీ బంతి తగిలితే లెగ్ బైస్‌గా పరుగులు తీస్తున్నారు. దీనివల్ల క్రికెట్లో పారదర్శకత లోపించినట్లే కనబడుతోంది’ అని వా తెలిపాడు. అయితే ఆ కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాత్రం వాతో విభేదించాడు. ఇది గేమ్‌లో ఒక భాగమని పేర్కొన్నాడు. కాకపోతే దీనిపై మొండిగా ఉన్నావంటూ మార్క్ వాను చమత్కరించాడు. దీనికి వా సమాధానమిస్తూ.. ఈ పద్ధతిని తాను మారుస్తానంటూ చెప్పుకొచ్చాడు. దానికి మైకేల్ వాన్ మరోసారి స్పందిస్తూ..‘ నువ్వు క్రికెట్ లా మేకర్ ఎంసీసీలో సభ్యుడిగా ఉండాలి. నువ్వు అందులో ఉంటే కొత్త విధానాలను తీసుకొస్తావు. అదే సమయంలో లండన్ కూడా తరచు రావొచ్చు. లార్డ్స్‌లో ఉన్న ఎంసీసీలోని ఒక చక్కటి రూమ్‌లో కూర్చొని మార్పులు చేయొచ్చు’ అని వాన్ పేర్కొనగా, దానికి సమాధానంగా వా మాట్లాడుతూ..‘ ఈ రూల్‌ను మార్చాలనే ఆలోచన మా సోదరుడు స్టీవ్ వాది కూడా. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలి. కనీసం వన్డే క్రికెట్లోనైనా తొలగించాలి’ అని తెలిపాడు. -
ఆ బౌలర్ వేస్ట్.. ఇక టెస్టు ఎలా గెలుస్తారు?
మెల్బోర్న్: తమ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఓడిపోవడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ వా జోస్యం చెప్పాడు. అందుకు కారణాలను కూడా మార్క్ వా వెల్లడించాడు. ప్రధానంగా న్యూజిలాండ్ జట్టు ఒక అనవసరమైన బౌలర్‌ను తుది జట్టులో ఆడిస్తుందని విమర్శించాడు. ఆ బౌలర్ కారణంగా న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌ను చేజార్చుకోవడం ఖాయమన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరంటే.. స్పిన్నర్ మిచెల్ సాంత్నార్. అసలు మిచెల్ సాంత్నార్తో కివీస్‌కు ఒరిగేదేమీ లేదంటూ ఎద్దేవా చేశాడు. ‘ మిచెల్ సాంత్నార్ టెస్టు బౌలర్ కాదు. అతను కేవలం వన్డేలకు మాత్రమే సెట్ అవుతాడు. టెస్టు మ్యాచ్‌లకు సరిపోయే బౌలింగ్ సామర్థ్యం అతనిలో లేదు. నిజంగా సాంత్నార్ మంచి స్నిన్నర్ అయితే కచ్చితత్వం ఉండాలి. మరి అతనిలో అది లేదు. సాంత్నార్ ఎక్కువగా బంతిని స్పిన్ చేయలేడు. (ఇక్కడ చదవండి: దిమ్మ తిరిగే బంతి.. అదిరేటి క్యాచ్!) టెస్టుల్లో బంతి ఎక్కువగా స్పిన్ చేస్తేనే కెట్లు లభిస్తాయి. సాంత్నార్ ఎక్కువగా షార్డ్ బంతుల్ని సంధిస్తున్నాడు. అది పరుగులు చేయడానికి ఈజీ అవుతుంది. స్పిన్‌లో వైవిధ్యమైన బంతులు వేయలేనప్పుడు ఏ బౌలర్ అయినా టెస్టుల్లో అనవసరం. మాతో జరుగుతున్న మ్యాచ్‌లో సాంత్నార్ అవసరం లేదు. ఈ కారణంతోనే న్యూజిలాండ్ మ్యాచ్‌ను కోల్పోవడం ఖాయం. ఆస్ట్రేలియాకు వచ్చే ఏ పర్యాటక జట్టుకైనా వికెట్లు సాధించే స్పిన్నర్లు కావాలి. సిడ్నీలో జరగబోయే తదుపరి టెస్టులో సాంత్నార్‌ను కివీస్ జట్టులో చూడాలనుకోవడం లేదు. ఒక లెగ్ స్పిన్నర్‌ను వేసుకోవడం మంచిది’ అని వా పేర్కొన్నాడు. ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 467 పరుగులకు ఆలౌటైంది. నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లు సాధించగా, టిమ్ సౌథీ మూడు వికెట్లు తీశాడు. గ్రాండ్ హోమ్‌కు రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ వికెట్ తీశాడు. సాంత్నార్ 20 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చాడు. -
బీసీసీఐ ఓ సెల్ఫీష్ : ఆసీస్ మాజీ క్రికెటర్
సిడ్నీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) డే/నైట్ టెస్టు ప్రతిపాదనను తిరస్కరించాడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మార్క్ వా తప్పుబట్టాడు. టెస్ట్ క్రికెట్‌కు పునర్జీవం పోయాలని తాము భావిస్తే బీసీసీఐ స్వార్థపూరితంగా వ్యవహరించందన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్‌లో టెస్టు క్రికెట్‌కు ఆదరణ లభిస్తోందని, ఈ దేశాలతో టెస్ట్ క్రికెట్‌కు పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్నామని వా ఓ రేడియో చానెల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భారత జట్టులో సమర్థవంతమైన బ్యాట్స్‌మెన్, స్పిన్నర్లు, పేసర్లతో పటిష్టంగా ఉండగా అసలు బీసీసీఐ డే/నైట్ టెస్టుకు ఎందుకు విముఖత వ్యక్తం చేసిందో అర్థం కావడలేదన్నాడు. టీమిండియాకు డే/నైట్ టెస్టులు సరిగా సరిపోతాయన్నాడు. డే/నైట్ టెస్టులు చూడటం తాను ఇష్టపడతానని తెలిపాడు. కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ సైతం ఇదే విధంగా బీసీసీఐని తప్పుబట్టాడు. మరోవైపు మార్క్ వా వ్యాఖ్యాతగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్క్ పదవీ కాలం వచ్చే ఆగస్టు 31తో ముగియనుంది. ఇక భారత్ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల కోసం నవంబర్ 21 నుంచి జనవరి 18 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. డే/నైట్ టెస్టు ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం 18 నెలల సాధన అవసరమని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించడంతో బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియా డే/నైట్ ప్రతిపాదనను తిరస్కరించిన విషయం తెలిసిందే. -
ఫెదరర్‌కు ఆ క్రికెటర్‌తో పోలికా?
సాక్షి, స్పోర్ట్స్ : టెన్నిస్ రారాజు రోజర్ ఫెదరర్‌కు ఓ క్రికెటర్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయంట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు ఆస్ట్రేలియా టీం కెప్టెన్ స్టీవెన్ స్మిత్. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మార్క్ వా-రోజర్ ఫెదరర్... ఇద్దరూ తనకు ఆదర్శమని స్మిత్ తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్మిత్... ‘‘ వారిద్దరి కెరీర్లో చాలా పోలికలను నేను గమనించాను. క్లిష్టమైన లక్ష్యాలను సులువుగా మార్చుకోవటంలో వారికి ఎవరూ సాటి రారు. తద్వారా వాళ్ల వాళ్ల కెరీర్లో విజయవంతమై ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు‘‘ అని స్మిత్ తెలిపాడు. టెన్నిస్ అంటే తనకు చాలా ఇష్టమన్న స్మిత్ ఫెదరర్‌కు తాను వీరాభిమానని చెప్పాడు. ఒకరకంగా తాను క్రికెట్లో రాటుదేలటానికి కూడా టెన్నిస్ సహకరించిందన్నాడు స్మిత్. ఇక స్టీవాను తన గురువుగా భావిస్తానని స్మిత్ పేర్కొన్నాడు. ఇక ఈ మధ్య సెలక్షన్ కమిటీలో స్మిత్ జోక్యం ఎక్కువైపోయిందని.. జాతీయ జట్టులో తనకి సన్నిహితంగా ఉన్న వారినే తీసుకోవాలంటూ స్మిత్, బోర్డుపై ఒత్తిడి తెస్తున్నాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మీడియా సమావేశంలోనే స్మిత్ వాటిని చెత్త ఆరోపణలుగా ఖండించాడు. -
ఆసీస్ పర్యటనపై మార్క్ వా విచారం!
హైదరాబాద్:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు దాదాపు నెల రోజుల పాటు భారత్ లో పర్యటించడంపై ఆ దేశ సెలక్టర్, మాజీ కెప్టెన్ మార్క్ వా విచారం వ్యక్తం చేశాడు. ఇంత సుదీర్ఘమైన సమయం ఆసీస్ జట్టు భారత్ లో పర్యటించడం సరైనది కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు ముందుగా ఖరారు చేసిన ఆసీస్-భారత్ ల షెడ్యూల్ కూడా ఎంతమాత్రం శ్రేష్టం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్వదేశంలో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ను దృష్టిలో పెట్టుకుని ఆసీస్ క్రికెటర్లు ఇన్ని రోజుల పాటు వేరే చోట క్రికెట్ ఆడటం వారికి తగినంత బ్రేక్ దొరకదన్నాడు. 'ఇదొక సుదీర్ఘమైన సిరీస్. వారం ముందుగా కానీ, రెండు వారాల ముందు కానీ ఈ షెడ్యూల్ ముగిసి పోతే బాగుండేది. భారత్ లో పరిమిత ఓవర్ల సిరీస్ లో ఎనిమిది మ్యాచ్ లకు గాను ఎనిమిది వేర్వేరు ప్లేస్ ల్లో ఆటగాళ్లు పర్యటించడం జరిగింది. ఇప్పుడు క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిన తరువాత వారికి సరైన విశ్రాంతి లభించదు. కొద్దిపాటి బ్రేక్ తోనే రెడ్ బాల్ క్రికెట్ కు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అది కూడా యాషెస్ లాంటి ఓ ప్రతిష్టాత్మక సిరీస్ కు సిద్దం కావాలి. మా క్రికెటర్లు సాధ్యమైనంత తొందరగా యాషెస్ ను అందిపుచ్చుంటారని అనుకుంటున్నా' అని ప్రస్తుతం తమ జట్టుతో పాటు భారత్ లో ఉన్న మార్క్ వా పేర్కొన్నాడు. సెప్టెంబర్ 17వ తేదీన తొలి వన్డేతో ఆరంభమైన సిరీస్ అక్టోబర్ 13న హైదరాబాద్ లో జరిగే టీ 20తో ముగియనుంది. -
భారత్ జోరుకు బ్రేకులు: ఆసీస్ దిగ్గజం
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన తనను ఆకట్టుకుందని ఆసీస్ జాతీయ సెలెక్టర్ మార్క్ వా అన్నాడు. భారత్ ఆతిథ్యం ఇచ్చిన చివరి 13 టెస్టుల్లో 10 టెస్టులు వారే నెగ్గారన్న విషయాన్ని గుర్తుచేశాడు. అయితే తమ జట్టు తొలి టెస్టు పుణేలో ఏకంగా 333 పరుగుల భారీ ఆధిక్యంతో విజయాన్ని సాధించి భారత్ జోరుకు బ్రేకులు వేసిందన్నాడు. కొందరు భారత వెటరన్ ఆటగాళ్లు, ప్రస్తుత క్రికెటర్లయితే ఏకంగా 4-0తో కోహ్లీసేన నెగ్గుతుందని అభిప్రాయపడ్డారు.. కానీ సిరీస్ 2-1తో సిరీస్‌ను ముగించిన ఆసీస్‌కు అభినందనలు తెలిపాడు. కొన్ని సందర్భాల్లో పట్టుకోల్పోవడంతో సిరీస్ చేజార్చుకున్నాం.. కానీ టీమిండియాతో సమానంగా క్రికెట్ ఆడామని 'సిరీస్‌ను కోల్పోయినా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన మెరుగైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడు సెంచరీలతో 499 పరుగులు చేవాడు. యువ సంచలనం మ్యాట్ రెన్షా సిరీస్ ఆరంభంలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మ్యాక్స్‌వెల్ సెంచరీతో రాణించాడు. అయితే డేవిడ్ వార్నర్ ఒక్కడే ఎక్కువగా నిరాశపరిచాడు. బౌలర్లు ఓకీఫ్, నాథన్ లయన్, హజెల్‌వుడ్, స్టార్క్ ఒక్కో సందర్భంలో స్థాయికి తగ్గట్లుగా వికెట్లు తీశారు' అని ఆసీస్ దిగ్గజం మార్క్ వా చెప్పుకొచ్చాడు. -
యూఎస్‌లో ఎన్నారై విద్యార్థికి జీవిత ఖైదు
వాషింగ్టన్: స్నేహితుడి హత్య కేసులో భారతీయ అమెరికన్ ఇంజినీరింగ్ విద్యార్థి రాహుల్ గుప్తాకి జీవిత ఖైదీ విధిస్తూ.. ఆమెరికన్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రాహుల్ గుప్తా జార్జియా వాషింగ్టన్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. జార్జీటౌన్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం చదువుతున్న మార్క్ వా (24) బాల్య స్నేహితులు. అయితే రాహుల్ గర్ల్ ఫ్రెండ్‌కు మార్క్... చాటింగ్ చేయడం తట్టుకోలే పోయాడు. మార్క్‌తోపాటు తన గర్ల ఫ్రెండ్ తనను మోసం చేశారని రాహుల్ భావించాడు. ఆ అక్కసుతో 2013, అక్టోబర్ 13న మార్క్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అతడిపై దాడి చేసి... 11 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించారు. ఈ కేసులో రాహుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించారు. ఈ కేసు విచారణ భాగంగా రాహుల్ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దాంతో ఈ హత్య కేసులో నిందితుడు రాహుల్ అని భావించిన కోర్టు జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు వెలువరించింది.