
సాక్షి, స్పోర్ట్స్ : టెన్నిస్ రారాజు రోజర్ ఫెదరర్‌కు ఓ క్రికెటర్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయంట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు ఆస్ట్రేలియా టీం కెప్టెన్ స్టీవెన్ స్మిత్.
ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మార్క్ వా-రోజర్ ఫెదరర్... ఇద్దరూ తనకు ఆదర్శమని స్మిత్ తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్మిత్... ‘‘ వారిద్దరి కెరీర్‌లో చాలా పోలికలను నేను గమనించాను. క్లిష్టమైన లక్ష్యాలను సులువుగా మార్చుకోవటంలో వారికి ఎవరూ సాటి రారు. తద్వారా వాళ్ల వాళ్ల కెరీర్‌లో విజయవంతమై ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు‘‘ అని స్మిత్ తెలిపాడు. టెన్నిస్ అంటే తనకు చాలా ఇష్టమన్న స్మిత్ ఫెదరర్‌కు తాను వీరాభిమానని చెప్పాడు. ఒకరకంగా తాను క్రికెట్‌లో రాటుదేలటానికి కూడా టెన్నిస్ సహకరించిందన్నాడు స్మిత్. ఇక స్టీవాను తన గురువుగా భావిస్తానని స్మిత్ పేర్కొన్నాడు.
ఇక ఈ మధ్య సెలక్షన్ కమిటీలో స్మిత్ జోక్యం ఎక్కువైపోయిందని.. జాతీయ జట్టులో తనకి సన్నిహితంగా ఉన్న వారినే తీసుకోవాలంటూ స్మిత్, బోర్డుపై ఒత్తిడి తెస్తున్నాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మీడియా సమావేశంలోనే స్మిత్ వాటిని చెత్త ఆరోపణలుగా ఖండించాడు.
Comments
Please login to add a commentAdd a comment