భారత్ జోరుకు బ్రేకులు: ఆసీస్ దిగ్గజం | Australia players really doing well in series against India, says Mark Waugh | Sakshi
Sakshi News home page

భారత్ జోరుకు బ్రేకులు: ఆసీస్ దిగ్గజం

Published Wed, Mar 29 2017 6:03 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

భారత్ జోరుకు బ్రేకులు: ఆసీస్ దిగ్గజం

భారత్ జోరుకు బ్రేకులు: ఆసీస్ దిగ్గజం

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన తనను ఆకట్టుకుందని ఆసీస్ జాతీయ సెలెక్టర్ మార్క్ వా అన్నాడు. భారత్ ఆతిథ్యం ఇచ్చిన చివరి 13 టెస్టుల్లో 10 టెస్టులు వారే నెగ్గారన్న విషయాన్ని గుర్తుచేశాడు. అయితే తమ జట్టు తొలి టెస్టు పుణేలో ఏకంగా 333 పరుగుల భారీ ఆధిక్యంతో విజయాన్ని సాధించి భారత్ జోరుకు బ్రేకులు వేసిందన్నాడు. కొందరు భారత వెటరన్ ఆటగాళ్లు, ప్రస్తుత క్రికెటర్లయితే ఏకంగా 4-0తో కోహ్లీసేన నెగ్గుతుందని అభిప్రాయపడ్డారు.. కానీ సిరీస్‌ 2-1తో సిరీస్‌ను ముగించిన ఆసీస్‌కు అభినందనలు తెలిపాడు. కొన్ని సందర్భాల్లో పట్టుకోల్పోవడంతో సిరీస్ చేజార్చుకున్నాం.. కానీ టీమిండియాతో సమానంగా క్రికెట్ ఆడామని

'సిరీస్‌ను కోల్పోయినా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన మెరుగైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడు సెంచరీలతో 499 పరుగులు చేవాడు. యువ సంచలనం మ్యాట్ రెన్‌షా సిరీస్‌ ఆరంభంలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మ్యాక్స్‌వెల్ సెంచరీతో రాణించాడు. అయితే డేవిడ్ వార్నర్ ఒక్కడే ఎక్కువగా నిరాశపరిచాడు. బౌలర్లు ఓకీఫ్, నాథన్ లయన్, హజెల్‌వుడ్, స్టార్క్ ఒక్కో సందర్భంలో స్థాయికి తగ్గట్లుగా వికెట్లు తీశారు' అని ఆసీస్ దిగ్గజం మార్క్ వా చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement