ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. స్లిప్స్‌లో ఎనిమిది మంది ఫీల్డర్లు.. తొలి బంతికే! | Finlands Bizarre Use of eight slips vs England XI | Sakshi
Sakshi News home page

Viral Video: ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. స్లిప్స్‌లో ఎనిమిది మంది ఫీల్డర్లు.. తొలి బంతికే!

Published Sat, Oct 2 2021 12:58 PM | Last Updated on Sat, Oct 2 2021 1:21 PM

Finlands Bizarre Use of eight slips vs England XI - Sakshi

Finlands  Use of eight slips vs England XI: యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తి‍కర సన్నివేశం చోటుచేసుకుంది.  ఏ ఫార్మాట్‌లోనైనా బ్యాటర్లపై ఒత్తిడి పెంచేందుకు స్లిప్స్‌లో.. కెప్టెన్‌ ఫీల్డర్‌లను పెట్టడం సాధారణంగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా టెస్ట్‌ క్రికెట్‌లో మూడు లేక నలుగురు ఫీల్డర్‌లను స్లిప్స్‌లో పెడతారు. అయితే, టీ10 మ్యాచ్‌ సందర్భంగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

ఇంగ్లండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఎలెవన్ ఇన్నింగ్స్‌లో ఫిన్‌ల్యాండ్ బౌలర్ అమ్జద్ షేర్ వేసిన తొలి బంతికే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 8 మంది ఫీల్డర్‌లను కెప్టెన్ జోనాథన్ స్కామన్స్  స్లిప్స్‌లో  పెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఎలెవన్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఫిన్‌ల్యాండ్‌ నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 100 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లండ్ ఎలెవన్ 14 పరుగుల తేడాతో ఫిన్‌ల్యాండ్‌పై విజయం సాధించింది.

చదవండి: Poonam Raut: పూనమ్‌ క్రీడా స్ఫూర్తికి ఆసీస్‌ క్రికెటర్‌ ఫిదా.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement