European Championship
-
పొట్టి క్రికెట్లో సంచలనం.. 11 బంతుల్లో 66 రన్స్
యూరోపియన్ క్రికెట్ టీ10 టోర్నీలో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రొమినియాపై ఆస్ట్రియా అద్భుత విజయం సాధించింది. 168 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రియా కేవలం 3 వికెట్లు కోల్పోయి 9. 5 ఓవర్లలో చేధించింది.అయితే ఛేజింగ్‌లో ఆస్ట్రియా 8 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రియా విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 61 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఆస్ట్రియా ఓటమి లాంఛనమే అంతా భావించారు.కానీ సరిగ్గా ఇదే సమయంలో ఆస్ట్రియా బ్యాటర్లు ఇమ్రాన్ ఆసిఫ్, అకిబ్ ఇక్బాల్ అద్భుతం చేశారు. 11 బంతుల్లో ఏకంగా 66 పరుగులు చేసి ఆస్ట్రియాకు సంచలన విజయాన్ని అందించారు. ఆస్ట్రియా బ్యాటర్లు 9వ ఓవర్లో ఏకంగా 41 పరుగులు రాబట్టగా.. 10వ ఓవర్లో తొలి 5 బంతులలో 20 పరుగులు వచ్చాయి. దీంతో లక్ష్య చేధనలో ఆస్ట్రియా 9. 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆస్ట్రియా బ్యాటర్లలో ఇక్భాల్(19 బంతుల్లో 72, 2 ఫోర్లు,10 సిక్స్‌లు) టాప్ స్కోరర్ నిలవగా.. ఆసిఫ్ 12 బంతుల్లో 22 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఆస్ట్రియా బ్యాటర్ల విధ్వంసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
సరికొత్త ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 319 కిలో మీటర్లు
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఇటలీలోని వెరోనాలో మంగళవారం జరిగిన యురోపియన్ ఛాంపియన్‌షిప్‌లో లిథువేనియాకు చెందిన 41 ఏళ్ల అలెగ్జాండర్ సోరోకిన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. 24 గంటల్లో సోరోకిన్ 319.614 కిలోమీటర్ల దూరం పరిగెత్తి ప్రపంచ రికార్డు లిఖించాడు. కాగా అలెగ్జాండర్ సగటున ఒక కిలోమీటర్ దూరాన్ని 4.30 నిమిషాల్లో దాటేశాడు.ఇంతకముందు అతని పేరిటే ఉన్న రికార్డుపే సోరోకిన్ బద్దలు కొట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో 24 గంటల్లో అతను 303.506 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తాడు. తాజా రికార్డుపై 40 ఏళ్ల సోరోకిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. ''చాలా అలిసిపోయా.. కానీ రికార్డుతో డబుల్ ఆనందంతో ఉన్నా. విషయమేంటనేది అర్థమయిందిగా.. ప్రపంచ రికార్డు కొట్టడం ఒక ఎత్తయితే.. నా రికార్డును నేనే బద్దలు కొట్టడం మరింత సంతోషాన్నిచ్చింది.'' అంటూ తెలిపాడు. ఇక పొలాండ్‌కు చెందిన అథ్లెట్ పియోట్రోస్కీ 24 గంటల్లో 301.858 కిలోమీటర్ల దూరం పరిగెత్తి రెండో స్థానంలో నిలవగా.. ఇటలీకి చెందిన మార్కో విసినిటీ 288 కిలోమీటర్ల దూరం పరిగెత్తి మూడో స్థానంలో నిలిచాడు. Ultrarunning legend Aleksandr Sorokin has just smashed his own record (192.252 miles) of distance covered in 24 hours of running 🔥🇱🇹 The Lithuanian has just covered 318.8km / 198.1 miles (unofficial) – 7:15/mile and 4:30/km pace...over a day 🤯 pic.twitter.com/35pWdAE3Ug — AW (@AthleticsWeekly) September 18, 2022 View this post on Instagram A post shared by Aleksandr Sorokin (@ultrarunner_aleksandr_sorokin) చదవండి: Karman Kaur: భారత నంబర్‌వన్‌గా కర్మన్ కౌర్ ICC New Rules: అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా -
ఇంగ్లండ్ బ్యాటర్ ఊచకోత.. 31 బంతుల్లోనే శతకం
England Batsman Dan Lincoln Stormy Century Of 31 Balls: డ్రీమ్ ఎలెవెన్ యూరోపియన్ ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్ ఎలెవెన్, ఇటలీ జట్ల మధ్య జరిగిన టీ10 మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదైంది. ఇంగ్లీష్ ఆటగాడు డ్యాన్ లింకన్ 31 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో మెరుపు శతకం(105 నాటౌట్) సాధించాడు. 26 ఏళ్ల లింకన్ 338.70 స్ట్రయిక్ రేట్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అతని విధ్వంసం ధాటికి ప్రత్యర్ధి నిర్ధేశించిన 142 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. వివరాల్లోకి వెళితే.. యూరోపియన్ ఛాంపియన్షిప్ గ్రూప్ సి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఇటలీ కెప్టెన్ బల్జిత్ సింగ్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ డ్యాన్ లింకన్ ప్రత్యర్ధి బౌలర్లపై సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు కేవలం 9.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సూపర్ విక్టరీని నమోదు చేసింది. లింకన్ బుల్లెట్ ఇన్నింగ్స్‌లో 98 పరుగులు సిక్సర్లు, బౌండరీల రూపంలో రావడం విశేషం. చదవండి: వచ్చే ఏడాది ఆ కేకేఆర్ ఆటగాడు 12-14 కోట్ల ధర పలుకుతాడు..! -
ఇదేం ఫీల్డింగ్‌రా బాబు.. స్లిప్స్‌లో ఎనిమిది మంది ఫీల్డర్లు.. తొలి బంతికే!
Finlands Use of eight slips vs England XI: యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏ ఫార్మాట్లోనైనా బ్యాటర్లపై ఒత్తిడి పెంచేందుకు స్లిప్స్‌లో.. కెప్టెన్ ఫీల్డర్లను పెట్టడం సాధారణంగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో మూడు లేక నలుగురు ఫీల్డర్లను స్లిప్స్‌లో పెడతారు. అయితే, టీ10 మ్యాచ్ సందర్భంగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఎలెవన్ ఇన్నింగ్స్‌లో ఫిన్‌ల్యాండ్ బౌలర్ అమ్జద్ షేర్ వేసిన తొలి బంతికే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 8 మంది ఫీల్డర్లను కెప్టెన్ జోనాథన్ స్కామన్స్ స్లిప్స్‌లో పెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఎలెవన్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఫిన్‌ల్యాండ్ నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 100 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లండ్ ఎలెవన్ 14 పరుగుల తేడాతో ఫిన్‌ల్యాండ్‌పై విజయం సాధించింది. చదవండి: Poonam Raut: పూనమ్ క్రీడా స్ఫూర్తికి ఆసీస్ క్రికెటర్ ఫిదా.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’ Just one normal day of European Championship Cricket 🙏 Finland start the game against England with EIGHT in the slips, and a leg slip for good measure 😂#ECC21 pic.twitter.com/lnuTv2RwMt — Cricket on BT Sport (@btsportcricket) September 30, 2021 -
బుమ్రా.. యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో బౌలింగ్ చేస్తున్నాడేంటి!
Jasprit Bumrah’s bowling action in European Championship: ప్రపంచంలోనే అత్యత్తుమ ఫాస్ట్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. అయితే చాలా మంది బౌలర్లు బుమ్రా బౌలింగ్ స్టైల్‌ను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరగుతున్న యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో అచ్చెం బుమ్రా మాదిరిగానే ఒక ఆటగాడు బౌలింగ్ చేస్తున్నాడు. అతని రన్-అప్, బౌలింగ్ స్టైల్ అచ్చెం బుమ్రాలానే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలొ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అదింటి బూమ్రా దుబాయ్‌లో ఉన్నాడుగా, యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో బౌలింగ్ చేస్తున్నాడేంటి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ స్పీడ్‌స్టర్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్‌లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 16 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్ధానంలో ఉన్నాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలకమైన వికెట్లు పడగొట్టి ముంబై విజయంలో బుమ్రా ముఖ్యమైన పాత్ర పోషించాడు. చదవండి: MI VS PBKS: టీ20ల్లో రికార్డు సృష్టించిన పొలార్డ్... Bumrah lite pic.twitter.com/UAoRfGtoDq — Hardeep Rawat (@Hardeep19Rawat) September 29, 2021 -
పడి లేచే కడలి తరంగం
‘కెరటం నాకు ఆదర్శం... ఎందుకంటే, పడిన ప్రతిసారీ అది మళ్ళీ పైకి లేస్తుంది గనక!’ ఆటకైనా, జీవితానికైనా వర్తించే ఈ స్ఫూర్తి వాక్యాన్ని ఇటలీ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఇప్పుడు నరనరాల్లో జీర్ణించుకుంది. ఆ జట్టు అదే పని చేసింది. మూడేళ్ళ క్రితం 2018 ప్రపంచ కప్‌లో ఆడేందుకు కనీసం అర్హత కూడా సాధించని ఓ ఫుట్‌బాల్ జట్టు నేలకు కొట్టిన బంతిలా పైకి లేచి, ఇప్పుడు ‘మినీ సాకర్ ప్రపంచ కప్’గా భావించే ప్రతిష్ఠాత్మక ‘యూరో కప్’ను సాధించడం చూస్తే ఆ స్ఫూర్తి వాక్యమే గుర్తుకొస్తుంది. మూడేళ్ళ క్రితం ఛీ కొట్టి, ఛీత్కరించిన సొంత ప్రజలు, ప్రేక్షకుల నుంచే ఇటలీ జట్టు జేజేలందుకోవడం చిరస్మరణీయ స్ఫూర్తి చరిత్ర. అదీ అప్రతిహతంగా 34 అంతర్జాతీయ మ్యాచ్‌లలో గెలవడం, ఓటమి ఎరుగని ధీరులుగా నిలవడం ఆ జట్టు సమష్టిగా సృష్టించిన మరో చరిత్ర. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్‌లో సభ్యులైన పురుషుల జాతీయ జట్ల మధ్య జరిగే ఈ పోటీకి పెద్ద కథే ఉంది. జనబాహుళ్యంలో ‘యూరో కప్’గా ప్రసిద్ధమైన ఈ టోర్నీకి ఎంతో క్రేజ్, ఇమేజ్. నాలుగేళ్ళకొకసారి జరిగే ఈ టోర్నీ గత ఏడాదే జరగాల్సింది. కరోనాతో ఈ ఏడాదికి వాయిదా పడింది. తొమ్మిదేళ్ళ క్రితం 2012లో జరిగిన యూరో కప్ ఫైనల్‌ను ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది వీక్షించారంటే, ఈ పోటీకి ఉన్న విశ్వవ్యాప్త ఆదరణ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్‌లో ఆ దేశపు జట్టే ఫైనల్‌కి రావడంతో లండన్ వింబ్లే మైదానంలో హంగామా అంతా ఇంతా కాదు. మన హీరోలు రణబీర్ కపూర్ నుంచి రానా దాకా ఎంతోమంది ఆసక్తి చూపించారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో రోమాంచకంగా సాగిన పెనాల్టీ షూటౌట్లో ఇటలీ జట్టు 3–2 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇటలీ జట్టు ‘యూరో కప్’ను గెలవడం చరిత్రలో ఇది రెండోసారి. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన తొలి యూరోపియన్ దేశాల్లో ఒకటైన ఇటలీకీ, ఆ దేశప్రజానీకానికీ ఒక రకంగా ఇది కేవలం ఓ ఆటలో విజయమే కాదు. ఏణ్ణర్ధంగా భయపెడుతున్న వ్యాధి భయం నుంచి బయటకొచ్చి, మానవ విజయాన్ని స్వేచ్ఛగా, భావోద్వేగభరితంగా వ్యక్తం చేసే ఒక సువర్ణావకాశం. అందుకే, గెలుచుకున్న కప్పు, దాదాపు రూ. 88 కోట్ల నగదుతో స్వదేశానికి తిరిగొచ్చిన ఇటలీ జట్టును ఆ దేశ రాజధాని రోమ్ నగర వీధుల్లో వేలాది జనం ఊరేగిస్తూ, స్వాగతించారు. కరోనా భయాన్ని పక్కనపెట్టి మరీ 1968 తరువాత 53 ఏళ్ళకు మళ్ళీ దక్కిన విజయాన్ని సామూహిక ఉత్సవంగా ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈసారి కొన్ని అపశ్రుతులూ దొర్లాయి. నిర్ణీత సమయంలో గెలుపోటములు తేలనివేళ పెనాల్టీ షూటౌట్ల ద్వారా విజేతను నిర్ణయించే విధానం ఫుట్‌బాల్‌లో తప్పనిసరి, తప్పించుకోలేని నియమం. ఇప్పటికి అయిదుసార్లు వివిధ టోర్నీల ఫైనల్స్‌లో ఇంగ్లండ్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే, నాలుగుసార్లు చతికిలపడి, ఆయా కప్పులు చేజార్చుకుంది. 1966 ప్రపంచ కప్ విజయం తరువాత మరో భారీ విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న ఇంగ్లండ్‌కు ఈసారీ అదే జరిగింది. కానీ, ఓటమి ఎంత జీర్ణించుకోలేనిదైనా, ఎంత హుందాగా స్వీకరిస్తామన్నదే క్రీడాస్ఫూర్తికీ, వ్యక్తిత్వానికీ గీటురాయి. సంగ్రామ స్థాయిలో సాగిన తాజా యూరో కప్ ఫైనల్లో తమ సొంత జట్టు ఓటమిని భరించలేని ఇంగ్లండ్ అభిమానులు కొందరు మైదానంలోనూ, బయటా ప్రవర్తించిన తీరు అభ్యంతరకరం, ఆటకే అవమానకరం. పెనాల్టీ షూటౌట్లలో విఫలమై, ఓటమికి బాటవేశారంటూ ఇంగ్లండ్ జట్టులోని ముగ్గురు నల్ల జాతి ఆటగాళ్ళపై వెల్లువెత్తిన జాత్యహంకార వ్యాఖ్యలు సభ్యసమాజంలో గర్హనీయం. దురభిమానం పెచ్చరిల్లి విధ్వంసానికి దిగడం, ఇటలీ అభిమానుల్ని అమానుషంగా కొట్టిన దృశ్యాలు, వ్యాఖ్యలను సోషల్ మీడియాలో చూసి, ప్రపంచం విస్తుపోయింది. ఇలా ఆసక్తికరమైన ఆటకు కూడా జాతి వివక్షతో రంగులు పూయడం, ఆటగాళ్ళ చిత్రాలను ధ్వంసం చేయడం క్రీడాలోకంలో చర్చ రేపింది. ప్రతిభాపాటవాలతో అత్యున్నత స్థాయికి చేరుకున్నవారిని నల్లవాళ్ళా, తెల్లవాళ్ళా అనే రంగుల తేడాను బట్టి, బేరీజు వేయడం ఆటలోనే కాదు... ఎక్కడైనా విషాదమే. పైపెచ్చు, కాలం మారినప్పటికీ మారని వికృత స్వభావాలకూ, ఇప్పటికీ ఇంగ్లీషు సమాజంలో పాతుకుపోయిన జాత్యంహంకారానికీ ఇది ఓ తాజా ప్రతీక. పోటీలకు మచ్చ తెచ్చిన ఈ సంఘటనల్ని ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ మొదలు బ్రిటన్ ప్రధాని దాకా అందరూ ఖండించారు. అంతటితో సరిపోదు. జాత్యహంకారానికి తావు లేని ఈ ఆధునిక సమాజంలో నిందితుల్ని గుర్తించి, వాళ్ళను కఠినంగా శిక్షించాలి. పరాజయాన్ని మించి ఇప్పుడు ప్రపంచంలో వచ్చి పడ్డ అగౌరవాన్ని పోగొట్టుకోవాల్సిన బాధ్యత ఇంగ్లీషు సమాజానిదే. ఈ చేదు ఘటనల్ని అటుంచితే, కరోనా వేళ మానసికంగా కుంగిపోయిన క్షణాల్లో మొన్నటి వింబుల్డన్, నిన్నటి యూరోకప్ ఎంతోమందికి ఉత్తేజాన్నిచ్చే ఉత్ప్రేరకాలయ్యాయి. ఈ క్రీడా సీజన్లో ఇక్కడ నుంచి వరుస కట్టనున్న ఒలింపిక్స్ సహా అనేక ఆటల పోటీలు కూడా కాసింత ఊరటనూ, కొత్త ఉత్సాహాన్నీ అందించవచ్చు. ఆటలోనైనా, జీవితంలోనైనా పోరాట స్ఫూర్తిని నింపే అలాంటివే ఇప్పుడు కావాల్సినవి. సమష్టిగా శ్రమిస్తే, ఏ పోరులోనైనా విజయం వరిస్తుందన్న స్ఫూర్తినీ, స్ఫురణనూ మరోసారి కలిగించినందుకు ఇటలీ జట్టుకు అభినందనలు. -
మ్యాచ్ మధ్యలో కుప్పకూలిన ఫుట్‌బాల్ ప్లేయర్
రోమ్: యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. కొపెన్‌హగన్ వేదికగా డెన్మార్క్, ఫిన్లాండ్ జట్ల మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో అంతరాయం ఏర్పడింది. 42వ నిమిషంలో ఒక్కసారిగా డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియాన్ ఎరిక్సన్ మైదానంలో కుప్పకూలిపోయాడు. అతన్ని వైద్య సబ్బంది ఆస్పత్రికి తీసుకువెళ్లారు. క్రిస్టియన్ కుప్పకూలడంతో మ్యాచ్‌ను రిఫరీలు రద్దుచేశారు. ఇక క్రిస్టియన్ ఎరిక్సన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అతను స్పృహలోకి వచ్చాడని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిస్టియన్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు, క్రీడా ప్రముఖలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. చదవండి: ఇటలీ శుభారంభం -
ఇటలీకి ఐర్లాండ్ షాక్
► ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం ► ఇటలీ, బెల్జియం కూడా ముందుకు యూరో కప్ లిల్లీ (ఫ్రాన్స్): వరుస విజయాలతో ఊపుమీదున్న ఇటలీ జట్టుకు.. యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్ షాకిచ్చింది. మ్యాచ్ ఆసాంతం ఇటలీ దాడులను అడ్డుకోవడమే కాకుండా ఆఖరి నిమిషాల్లో సంచలన గోల్‌తో ప్రత్యర్థిని కంగుతినిపించింది. ఫలితంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-ఇ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్ 1-0తో ఇటలీపై గెలిచి ప్రిక్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ గ్రూప్‌లో చెరో ఆరు పాయింట్లతో ఇటలీ, బెల్జియం కూడా నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఐర్లాండ్ తరఫున రాబీ బ్రాడీ (85వ ని.) ఏకైక గోల్ సాధించాడు. బెల్జియం గెలుపు: మరో మ్యాచ్‌లో బెల్జియం 1-0తో స్వీడన్‌పై గెలిచింది. నైనంగోలన్ (84వ ని.) బెల్జియం తరఫున ఏకైక గోల్ చేశాడు. స్వీడన్ స్టార్ స్ట్రయికర్ ఇబ్రమోవిచ్ కెరీర్లో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. యూరో తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు మంగళవారమే ప్రకటించిన అతను ఈసారి గోల్ చేయలేకపోయాడు. -
‘టాప్’క్లాస్ వేల్స్
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రష్యాపై గెలుపు * గ్రూప్-బిలో అగ్రస్థానం * ఇంగ్లండ్‌కు కూడా నాకౌట్ బెర్త్ టౌలస్: అడుగుపెట్టిన తొలిసారే అత్యుత్తమ ఆటతీరుతో అదరగొట్టిన వేల్స్ ఫుట్‌బాల్ జట్టు... యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో సంచలనం నమోదు చేసింది. ఇంగ్లండ్, రష్యాలాంటి ఫేవరెట్లను వెనక్కి నెట్టేస్తూ గ్రూప్-బిలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వేల్స్ 3-0తో రష్యాపై అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో మొత్తం ఆరు పాయింట్లు సంపాదించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. దాదాపు శతాబ్దంన్నర చరిత్ర గల వేల్స్ జట్టు... ఇప్పటి వరకు రెండు మేజర్ టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగింది. ఒకటి 1958 ఫిఫా వరల్డ్‌కప్ కాగా, రెండోది ప్రస్తుత యూరో టోర్నీ. రష్యాతో జరిగిన మ్యాచ్‌లో వేల్స్ తరఫున రామ్సే (11వ ని.), నీల్ టేలర్ (20వ ని.), బేల్ (67వ ని.) గోల్స్ చేశారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఒక్క విజయం కూడా నమోదు చేయని రష్యా (స్లోవేకియా చేతిలో 1-2తో ఓటమి, ఇంగ్లండ్‌పై 1-1తో డ్రా) ఒక పాయింట్‌తో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇంగ్లండ్ ముందుకు... టాప్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిరాశపర్చింది. స్లోవేకియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుంది. ఆరు మార్పులతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు మ్యాచ్ ఆసాంతం వ్యూహాత్మకంగా ఆడిన స్లోవేకియా ప్రత్యర్థి ఎదురుదాడులను సమర్థంగా నిలువరించింది. మరోవైపు మూడో స్థానంలో నిలిచిన స్లోవేకియా (4 పాయింట్లు) నాకౌట్ బెర్త్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన (మూడోస్థానంలో నిలిచిన) నాలుగు జట్లు ప్రిక్వార్టర్స్ చేరే అవకాశం ఉండటంతో ఇప్పుడు జడ్జీల నిర్ణయం కోసం వేచి చూస్తోంది. గోల్ కీపర్ మాటస్ కోజాకిక్ ఉత్తమ ప్రదర్శన తమకు నాకౌట్ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తోంది.