‘టాప్’క్లాస్ వేల్స్
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రష్యాపై గెలుపు
* గ్రూప్-బిలో అగ్రస్థానం
* ఇంగ్లండ్‌కు కూడా నాకౌట్ బెర్త్
టౌలస్: అడుగుపెట్టిన తొలిసారే అత్యుత్తమ ఆటతీరుతో అదరగొట్టిన వేల్స్ ఫుట్‌బాల్ జట్టు... యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో సంచలనం నమోదు చేసింది. ఇంగ్లండ్, రష్యాలాంటి ఫేవరెట్లను వెనక్కి నెట్టేస్తూ గ్రూప్-బిలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వేల్స్ 3-0తో రష్యాపై అద్భుత విజయాన్ని సాధించింది.
దీంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో మొత్తం ఆరు పాయింట్లు సంపాదించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. దాదాపు శతాబ్దంన్నర చరిత్ర గల వేల్స్ జట్టు... ఇప్పటి వరకు రెండు మేజర్ టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగింది. ఒకటి 1958 ఫిఫా వరల్డ్‌కప్ కాగా, రెండోది ప్రస్తుత యూరో టోర్నీ. రష్యాతో జరిగిన మ్యాచ్‌లో వేల్స్ తరఫున రామ్‌సే (11వ ని.), నీల్ టేలర్ (20వ ని.), బేల్ (67వ ని.) గోల్స్ చేశారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఒక్క విజయం కూడా నమోదు చేయని రష్యా (స్లోవేకియా చేతిలో 1-2తో ఓటమి, ఇంగ్లండ్‌పై 1-1తో డ్రా) ఒక పాయింట్‌తో నాలుగో స్థానానికి పరిమితమైంది.
ఇంగ్లండ్ ముందుకు...
టాప్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిరాశపర్చింది. స్లోవేకియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుంది. ఆరు మార్పులతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు మ్యాచ్ ఆసాంతం వ్యూహాత్మకంగా ఆడిన స్లోవేకియా ప్రత్యర్థి ఎదురుదాడులను సమర్థంగా నిలువరించింది. మరోవైపు మూడో స్థానంలో నిలిచిన స్లోవేకియా (4 పాయింట్లు) నాకౌట్ బెర్త్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన (మూడోస్థానంలో నిలిచిన) నాలుగు జట్లు ప్రిక్వార్టర్స్ చేరే అవకాశం ఉండటంతో ఇప్పుడు జడ్జీల నిర్ణయం కోసం వేచి చూస్తోంది. గోల్ కీపర్ మాటస్ కోజాకిక్ ఉత్తమ ప్రదర్శన తమకు నాకౌట్ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తోంది.