last league match
-
జింబాబ్వేతో టీమిండియా ‘ఢీ’.. గెలిస్తే గ్రూప్ టాపర్‌గా రోహిత్ సేన
సరిగ్గా రెండు వారాల క్రితం మెల్బోర్న్ మైదానంలో భారత క్రికెట్ జట్టు ఒక అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్‌పై సాధించిన ఈ గెలుపు అభిమానులందరికీ చిరస్మరణీయ జ్ఞాపకాన్ని అందించింది. ఇప్పుడు అదే వేదికపై లీగ్ దశను ముగించేందుకు టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతోంది. బలహీన ప్రత్యర్థిని ఓడించి గ్రూప్–1లో మొదటి స్థానంలో నిలవాలని రోహిత్ బృందం పట్టుదలతో ఉంది. అయితే స్టార్లు లేకపోయినా జింబాబ్వేను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదమే! అలసత్వంతో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న పాకిస్తాన్ ఇప్పటికీ టోర్నీలో సెమీస్ స్థానం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో మరో ఆదివారం మధ్యాహ్నం అభిమానులకు వినోదం ఖాయం. మెల్బోర్న్: పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై విజయాలు, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టు టి20 వరల్డ్‌కప్ లీగ్ దశలో తమ చివరి పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే పోరులో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. అధికారికంగా భారత్‌కు ఇంకా సెమీస్ స్థానం ఖరారు కాలేదు కానీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే గ్రూప్ టాపర్‌గా భారత్ సెమీస్ చేరుతుంది. అదే జరిగితే ఈ నెల 10న అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో రెండో సెమీఫైనల్లో టీమిండియా తలపడుతుంది. టోర్నీ ఆసాంతం స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన జింబాబ్వే మరో సంచలనాన్ని ఆశిస్తోంది. పాక్‌తో మ్యాచ్ తరహాలోనే 90 వేలకు పైగా సామర్థ్యం ఉన్న ఎంసీజీలో ఈ పోరు కు కూడా అన్ని టికెట్లూ అమ్ముడవడం విశేషం. చహల్‌కు అవకాశం దక్కేనా... గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై చివర్లో గట్టెక్కినా... తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. టాపార్డర్ బ్యాటర్ల నుంచి బౌలర్ల వరకు అందరూ సమష్టిగా రాణిస్తున్నారు. ఒక్క వికెట్ కీపర్ విషయంలోనే కాస్త సందేహాలు అనిపించాయి. బంగ్లాతో పోరులోనే కార్తీక్ బదులుగా పంత్ ఆడతాడని అనిపించినా, చివరకు అది జరగలేదు. అంటే ఫినిషర్‌గా కార్తీక్‌పైనే జట్టు మేనేజ్మెంట్ ఎక్కువగా నమ్మకముంచుతోంది. పేసర్లు షమీ, భువనేశ్వర్, అర్‡్షదీప్ ప్రతీ మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించారు. జింబాబ్వేపై కూడా ఈ ముగ్గురు ప్రభావం చూపగలరు. సమష్టిగా రాణిస్తే... పాకిస్తాన్‌పై విజయంతో ఒకదశలో జింబాబ్వే జట్టులో కూడా సెమీస్ ఆశలు రేగాయి. అయితే బంగ్లా, నెదర్లాండ్స్ చేతుల్లో పరాజయాలు ఆ జట్టును దెబ్బకొట్టాయి. ఈ రెండుసార్లు బ్యాటింగ్ వైఫల్యంతోనే జింబాబ్వే ఓడింది. సికందర్ రజా, విలియమ్స్‌పైనే జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. మరోవైపు జింబాబ్వే బౌలింగ్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. పేసర్లు చటారా, ఎన్‌గరవ, ముజరబానిలను జట్టు నమ్ముకుంటోంది. ఈ ముగ్గురూ టోర్నీలో వేర్వేరు దశల్లో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. పట్టుదలగా బౌలింగ్ చేస్తే వీరు భారత బ్యాటింగ్‌ను కొంత వరకు ఇబ్బంది పెట్టగలరేమో చూడాలి. పిచ్, వాతావరణం ఎంసీజీలో ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు షెడ్యూల్ కాగా, మూడు రద్దయ్యాయి. ఒక మ్యాచ్‌ను కుదించగా, భారత్–పాక్ మ్యాచ్ మాత్రమే పూర్తిగా సాగింది. ఆదివారం వర్ష సూచన లేకపోవడం సానుకూలాంశం. కొత్త పిచ్‌పై పేసర్లు కొంత ప్రభావం చూపగలరు కానీ ఓవరాల్‌గా బ్యాటింగ్‌కే అనుకూలం. 1: టి20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, జింబాబ్వే మధ్య ఇదే తొలి మ్యాచ్. -
విజయంతో ముగింపు
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు ఊరట విజయం లభించింది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయిన ఈ స్టార్ షట్లర్... శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 21–18, 21–15తో ప్రపంచ 13వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. శుక్రవారంతో లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. గ్రూప్ ‘బి’లో రెండేసి విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచిన పోర్న్‌పవీ, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్), సింధు ఒక్కో విజయం సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించారు. ఓవరాల్‌గా పాయింట్ల ఆధారంగా గ్రూప్ ‘బి’లో రచనోక్ మూడో స్థానంలో, సింధు చివరిదైన నాలుగో స్థానంలో నిలిచారు. గ్రూప్ ‘ఎ’ నుంచి యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా), కరోలినా మారిన్ (స్పెయిన్) సెమీఫైనల్ చేరుకున్నారు. పోర్న్‌పవీతో గతంలో నాలుగుసార్లు ఆడి మూడుసార్లు నెగ్గిన సింధుకు ఈసారీ అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గిన సింధు రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ‘ఈ టోర్నీలో నాకు మంచి ముగింపు లభించింది. తై జు యింగ్ చేతిలో ఓడిపోవడంతో నా సెమీఫైనల్ అవకాశాలు దెబ్బతిన్నాయి. గత మ్యాచ్‌ల ఫలితాలతో గుణపాఠాలు నేర్చుకొని ప్రతి రోజును కొత్తగా మొదలుపెట్టాలి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. మళ్లీ తాజాగా కోర్టులో అడుగుపెడతా’ అని సింధు వ్యాఖ్యానించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–12, 18–21, 19–21తో పోరాడి ఓడిపోయాడు. గ్రూప్ ‘బి’ నుంచి జు వె వాంగ్ (చైనీస్ తైపీ), ఆంటోన్సెన్ (డెన్మార్క్) సెమీఫైనల్ చేరుకోగా... అంగుస్ మూడో స్థానంలో, శ్రీకాంత్ నాలుగో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి అక్సెల్సన్ (డెన్మార్క్), తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
చివరి మ్యాచ్‌లోనూ భారత్ పరాజయం
జొహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా): బ్రిక్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత అండర్–17 మహిళల ఫుట్‌బాల్ జట్టు పరాజయం పాలైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్... ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో 1–2తో చైనా చేతిలో ఓటమి పాలైంది. మన జట్టు తరఫున నమోదైన ఏకైక గోల్ మనీషా (25వ ని.లో) చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి సాధికారికంగా ఆడిన భారత జట్టు తొలి అర్ధభాగాన్ని 1–0 ఆధిక్యంతో ముగించినా... రెండో సగంలో రెండు గోల్స్ సమర్పించుకొని ఓటమి పాలైంది. -
బై...బై...ముంబై
ముందుకెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. ఢిల్లీ బౌలర్లు సమష్టిగా ముంబైను ముంచారు. ఈ సీజన్లో అందరికంటే ముందే ప్లే ఆఫ్ నుంచి ఔటైన డేర్‌డెవిల్స్ జట్టు వెళ్తూ వెళ్తూ తమ వెంట రోహిత్ సేననీ తీసుకెళ్లింది. న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆల్‌రౌండ్ షోతో ముంబై ఇండియన్స్‌ను ప్లే ఆఫ్ పట్టాల నుంచి తప్పించింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డేర్‌డెవిల్స్ 11 పరుగుల తేడాతో రోహిత్ సేనపై గెలిచింది. బ్యాటింగ్‌లో రిషభ్ పంత్ ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తే... బౌలింగ్‌లో స్పిన్నర్లు సందీప్ లమిచానే (3/36), అమిత్ మిశ్రా (3/19), పేసర్ హర్షల్ పటేల్ (3/28) సమష్టిగా దెబ్బ తీశారు. మొదట డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (44 బంతుల్లో 64; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), విజయ్ శంకర్ (30 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తర్వాత ముంబై 19.3 ఓవర్లలో 163 పరుగుల వద్ద ఆలౌటైంది. లూయిస్ (31 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. మిశ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రిషభ్ పంతే పెద్దదిక్కయ్యాడు... టాస్ నెగ్గిన ఢిల్లీ మొదట బ్యాటింగ్‌కే మొగ్గుచూపిం ది. ఓపెనింగ్ వైఫల్యంతో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా (12) రనౌట్‌కాగా, మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 22; 4 ఫోర్లు)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్‌తో కలిసి రిషభ్ పంత్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ జోడీ కూడా విఫలమైంది. కెప్టెన్ అయ్యర్ (6) మార్కండే బౌలింగ్‌లో నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన విజయ్ శంకర్‌తో పంత్ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 13వ ఓవర్లో జట్టు 100 పరుగులు దాటింది. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ 34 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. పదో ఓవర్ తర్వాత బుమ్రా, కటింగ్, హార్దిక్ పాండ్యాలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం మందగించింది. ముస్తఫిజుర్ వేసిన 15వ ఓవర్లో పంత్ సిక్సర్, శంకర్ ఫోర్ కొట్టి టచ్‌లోకి వచ్చారు. హార్దిక్ తర్వాతి ఓవర్లో పంత్ మరో రెండు సిక్సర్లు బాదేశాడు. జోరు పెరిగిన దశలో రిషభ్ ఇన్నింగ్స్‌కు కృనాల్ పాండ్యా తెరదించాడు. దీంతో 64 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అభిషేక్ జతగా విజయ్ శంకర్ పోరాడే లక్ష్యాన్ని ముంబై ముందుంచగలిగాడు. స్పిన్ ఉచ్చులో బ్యాట్లెత్తారు... ముంబై చావోరేవో తేల్చుకునే లక్ష్యం 175. సులువైంది కాకపోయినా... అసాధ్యమైంది మాత్రం కాదు. కానీ ముంబై బ్యాట్స్‌మెన్ స్పిన్ ఉచ్చులో చిక్కి ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆరంభంలో ఓపెనర్ లూయిస్ ఎదురుదాడికి దిగినట్టు... చివర్లో కటింగ్ (20 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించినట్లు మరొక్కరు నిలబడితే గెలిచేది. కానీ ఆ ఒక్కడి పాత్రలో ఏ బ్యాట్స్‌మెన్ నిలబడనీయకుండా లమిచానే, మిశ్రా మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించారు. టాప్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆట కట్టించారు. ఈ సీజన్లో నిలకడ కనబరిచిన సూర్యకుమార్ (12), విధ్వంసకర బ్యాట్స్‌మన్ పొలార్డ్ (7)లను లమిచానే ఔట్ చేస్తే... మధ్యలో ఇషాన్ కిషన్ (5), లూయిస్‌లను మిశ్రా పెవిలియన్ చేర్చాడు. కృనాల్ (4), రోహిత్ (13) పలాయనం చిత్తగించడంతో ముంబై కథ ముగిసింది. హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు బ్యాట్‌ను ఊపేసినా మిశ్రా మాయలో పడేందుకు ఎంతో సేపు పట్టలేదు. 15వ ఓవర్లో అతని నిష్క్రమణతో ఆశలు ఆవిరికాగా... కటింగ్ మెరుపులతో ఏమూలనో మిణుకుమిణుకుమన్న ఆశల్ని చివరి ఓవర్లో హర్షల్ పటేల్ తుడిచేశాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా రనౌట్ 12; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 22; శ్రేయస్ అయ్యర్ (సి) కృనాల్ (బి) మార్కండే 6; రిషభ్ పంత్ (సి) పొలార్డ్ (బి) కృనాల్ 64; విజయ్ శంకర్ నాటౌట్ 43; అభిషేక్ శర్మ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–30, 2–38, 3–75, 4–139. బౌలింగ్: కృనాల్ 2–0–11–1, బుమ్రా 4–0– 29–1, హార్దిక్ 4–0–36–0, ముస్తఫిజుర్ 4–0–34–0, మార్కండే 2–0–21–1, కటింగ్ 4–0–36–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సూర్యకుమార్ (సి) శంకర్ (బి) లమిచానే 12; లూయిస్ (స్టంప్డ్) పంత్ (బి) మిశ్రా 48; ఇషాన్ కిషన్ (సి) శంకర్ (బి) మిశ్రా 5; పొలార్డ్ (సి) బౌల్ట్ (బి) లమిచానే 7; రోహిత్ (సి) బౌల్ట్ (బి) హర్షల్ 13; కృనాల్ (సి) సబ్–తేవటియా (బి) లమిచానే 4; హార్దిక్ (సి) సబ్–తేవటియా (బి) మిశ్రా 27; కటింగ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హర్షల్ 37; మార్కండే (బి) బౌల్ట్ 3; బుమ్రా (సి) బౌల్ట్ (బి) హర్షల్ 0; ముస్తఫిజుర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 163. వికెట్ల పతనం: 1–12, 2–57, 3–74, 4–74, 5–78, 6–121, 7–122, 8–157, 9–163, 10–163. బౌలింగ్: లమిచానే 4–0–36–3, బౌల్ట్ 4–0–33–1, మ్యాక్స్‌వెల్ 2–0–19–0, హర్షల్ 2.3–0–28–3, ప్లంకెట్ 3–0–27–0, మిశ్రా 4–0–19–3. రిషభ్ పంత్ లమిచానే, మిశ్రా ప్రీతికెంత సంబరమో! కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ముంబై ఓడిందని తెలియగానే తెగ సంబరపడిపోయింది. పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ’ అని చెప్పింది. ఈ వీడియో క్లిప్ ట్విటర్లో వైరల్ అయింది. అదేం ఆనందమో గానీ... అప్పటికింకా ఆమె జట్టు (పంజాబ్) చెన్నైపై గెలవనేలేదు. ప్లే–ఆఫ్ చేరనేలేదు... ఇంకా చెప్పాలంటే మ్యాచ్ అప్పుడే మొదలైంది. ముంబై ఓటమితో పంజాబ్ ప్లే–ఆఫ్ చేరితే సంబరపడిందంటే అర్థముంది కానీ... తమకు ఏమీ కాని ఫలితంతో ముందుకు ముందే ఈ సంతోషమేంటని నెటిజన్లు కామెంట్లు చేశారు. -
‘టాప్’క్లాస్ వేల్స్
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రష్యాపై గెలుపు * గ్రూప్-బిలో అగ్రస్థానం * ఇంగ్లండ్‌కు కూడా నాకౌట్ బెర్త్ టౌలస్: అడుగుపెట్టిన తొలిసారే అత్యుత్తమ ఆటతీరుతో అదరగొట్టిన వేల్స్ ఫుట్‌బాల్ జట్టు... యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో సంచలనం నమోదు చేసింది. ఇంగ్లండ్, రష్యాలాంటి ఫేవరెట్లను వెనక్కి నెట్టేస్తూ గ్రూప్-బిలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వేల్స్ 3-0తో రష్యాపై అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో మొత్తం ఆరు పాయింట్లు సంపాదించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. దాదాపు శతాబ్దంన్నర చరిత్ర గల వేల్స్ జట్టు... ఇప్పటి వరకు రెండు మేజర్ టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగింది. ఒకటి 1958 ఫిఫా వరల్డ్‌కప్ కాగా, రెండోది ప్రస్తుత యూరో టోర్నీ. రష్యాతో జరిగిన మ్యాచ్‌లో వేల్స్ తరఫున రామ్సే (11వ ని.), నీల్ టేలర్ (20వ ని.), బేల్ (67వ ని.) గోల్స్ చేశారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఒక్క విజయం కూడా నమోదు చేయని రష్యా (స్లోవేకియా చేతిలో 1-2తో ఓటమి, ఇంగ్లండ్‌పై 1-1తో డ్రా) ఒక పాయింట్‌తో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇంగ్లండ్ ముందుకు... టాప్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిరాశపర్చింది. స్లోవేకియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుంది. ఆరు మార్పులతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు మ్యాచ్ ఆసాంతం వ్యూహాత్మకంగా ఆడిన స్లోవేకియా ప్రత్యర్థి ఎదురుదాడులను సమర్థంగా నిలువరించింది. మరోవైపు మూడో స్థానంలో నిలిచిన స్లోవేకియా (4 పాయింట్లు) నాకౌట్ బెర్త్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన (మూడోస్థానంలో నిలిచిన) నాలుగు జట్లు ప్రిక్వార్టర్స్ చేరే అవకాశం ఉండటంతో ఇప్పుడు జడ్జీల నిర్ణయం కోసం వేచి చూస్తోంది. గోల్ కీపర్ మాటస్ కోజాకిక్ ఉత్తమ ప్రదర్శన తమకు నాకౌట్ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తోంది. -
ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బోపన్న జోడి ఓటమి
లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జి (రొమేనియా) జోడి ఓటమిపాలైంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ బోపన్న-మెర్జి 4-6, 6-1, 5-10తో ఐదోసీడ్ ఇటాలియన్ ద్వయం ఫోగ్నిని-సైమన్ బోల్లెలి చేతిలో ఓడారు. దీంతో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న బోపన్న ద్వయం... యాష్ / స్మిత్ గ్రూప్‌లో రెండో స్థానానికి పరిమితంకాగా, ఫోగ్నిని- బోల్లెలి జంట అగ్రస్థానంలో నిలిచింది.