
జొహన్నెస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా): బ్రిక్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత అండర్–17 మహిళల ఫుట్‌బాల్ జట్టు పరాజయం పాలైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్... ఆదివారం ఇక్కడ జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో 1–2తో చైనా చేతిలో ఓటమి పాలైంది. మన జట్టు తరఫున నమోదైన ఏకైక గోల్ మనీషా (25వ ని.లో) చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి సాధికారికంగా ఆడిన భారత జట్టు తొలి అర్ధభాగాన్ని 1–0 ఆధిక్యంతో ముగించినా... రెండో సగంలో రెండు గోల్స్ సమర్పించుకొని ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment