File Photo
యూరోపియన్ క్రికెట్ టీ10 టోర్నీలో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రొమినియాపై ఆస్ట్రియా అద్భుత విజయం సాధించింది. 168 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రియా కేవలం 3 వికెట్లు కోల్పోయి 9. 5 ఓవర్లలో చేధించింది.
అయితే ఛేజింగ్‌లో ఆస్ట్రియా 8 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రియా విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 61 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఆస్ట్రియా ఓటమి లాంఛనమే అంతా భావించారు.
కానీ సరిగ్గా ఇదే సమయంలో ఆస్ట్రియా బ్యాటర్లు ఇమ్రాన్ ఆసిఫ్, అకిబ్ ఇక్బాల్ అద్భుతం చేశారు. 11 బంతుల్లో ఏకంగా 66 పరుగులు చేసి ఆస్ట్రియాకు సంచలన విజయాన్ని అందించారు. ఆస్ట్రియా బ్యాటర్లు 9వ ఓవర్‌లో ఏకంగా 41 పరుగులు రాబట్టగా.. 10వ ఓవర్‌లో తొలి 5 బంతులలో 20 పరుగులు వచ్చాయి.
దీంతో లక్ష్య చేధనలో ఆస్ట్రియా 9. 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆస్ట్రియా బ్యాటర్లలో ఇక్భాల్(19 బంతుల్లో 72, 2 ఫోర్లు,10 సిక్స్‌లు) టాప్ స్కోరర్ నిలవగా.. ఆసిఫ్ 12 బంతుల్లో 22 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఆస్ట్రియా బ్యాటర్ల విధ్వంసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment