వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్‌పై ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 15న ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఆఫ్గాన్ చిత్తు చేసింది. కాగా ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బిగ్ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి(Code Of Conduct) లెవెల్-1 నిబంధన ఉల్లఘించినందుకు రహ్మానుల్లా గుర్బాజ్‌ను ఐసీసీ మందలించింది.
గుర్భాజ్ ఏం చేశాడంటే?
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గుర్భాజ్(57 బంతుల్లో 80) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మంచి ఊపు మీద ఉన్న గుర్భాజ్ దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. దీంతో అసహనానికి లోనైన గుర్భాజ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ తన బ్యాట్‌తో బౌండరీ రోప్‌ను, కూర్చీని బలంగా కొట్టాడు.
అయితే ఆర్టికల్ 2.5 ప్రకారం అజ్మతుల్లా ఐసీసీ నియమావళి నిబంధనల ప్రకారం ఆటగాడు మ్యాచ్ సమయంలో గ్రౌండ్‌కు సంబంధించిన పరికరాలను ద్వంసం చేయడం, హెల్మెట్‌ను నెలకేసి కొట్టడం వంటివి చేయకూడదు. ఈ నేపథ్యంలోనే గుర్భాజ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది.
ఇదే తొలి తప్పుగా భావించిన ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. 24 నెలల్లో మరోసారి ఇదే తప్పు చేస్తే మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్ విధించే అవకాశం ఉంటుంది. కాగా గుర్భాజ్ కూడా తన నేరాన్ని అంగీకరించాడు.
చదవండి: WC 2023: ఆస్ట్రేలియాతో మ్యాచ్.. పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్!
Comments
Please login to add a commentAdd a comment