చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌.. సచిన్‌ ప్రపంచ రికార్డు బద్దలు | PAK Vs AFG ODI 2023: Rahmanullah Gurbaz Surpasses Sachin Tendulkar In ODIs - Sakshi
Sakshi News home page

PAK vs AFG: చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్‌ ఓపెనర్‌.. సచిన్‌ ప్రపంచ రికార్డు బద్దలు

Published Fri, Aug 25 2023 1:25 PM | Last Updated on Fri, Aug 25 2023 2:28 PM

Rahmanullah Gurbaz surpasses Sachin Tendulkar in ODIs - Sakshi

ఆఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ అరుదైన ఘనత సాధించాడు. 21 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్బాజ్‌ రికార్డులకెక్కాడు. హంబన్‌టోటా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన గుర్బాజ్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో గుర్బాజ్‌ 5 సెంచరీలు సాధించాడు.

ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ రికార్డును గుర్బాజ్ బ్రేక్‌ చేశాడు. సచిన్‌ తన 21 ఏళ్ల వయస్సులో 4 వన్డే సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ను ఈ ఆఫ్గాన్‌ ఓపెనర్‌ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్‌ ఓపెపర్‌ ‍క్వింటన్‌ డికాక్‌, శ్రీలంక మాజీ ఓపెనర్‌ ఉపుల్‌ తరంగా చెరో 6 సెంచరీలతో అగ్రస్ధానంలో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.

అదే విధంగా మరో అరుదైన ఘనతను కూడా గుర్భాజ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 5 సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా గుర్భాజ్‌ రికార్డులకెక్కాడు. గుర్బాజ్‌ కేవలం 23 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

ఈ క్రమంలో బాబర్‌ ఆజం రికార్డును గుర్బాజ్‌ బ్రే​క్‌ చేశాడు. బాబర్‌ 25 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేసిన లిస్ట్‌లో క్వింటన్‌ డికాక్‌(13 ఇన్నింగ్స్‌లు), పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(13 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నారు.
చదవండి: Asia Cup 2023: విరాట్‌ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్‌.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement