టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయయ్యాడు. ఆసియాకప్-2023తో అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన అయ్యర్.. దాదాపు 8 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.
ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌తో పాటు కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా దూరమయ్యాడు. ఇక సుదీర్ఘకాలం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న అయ్యర్‌పై ఆఫ్గానిస్తాన్ స్టార్ బ్యాటర్, కేకేఆర్ సహచరుడు రహ్మానుల్లా గుర్బాజ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో అయ్యర్ భారత కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్బాజ్ జోస్యం చెప్పాడు.
"అయ్యర్ భవిష్యత్తులో మంచి కెప్టెన్ అవుతాడని నేను భావిస్తున్నాను. అతడు ఐపీఎల్‌లో కేకేఆర్‌కు సారథ్యం వహిస్తున్నాడు. అంతకుముందు ఢిల్లీ ఫ్రాంచైజీకి కూడా కెప్టెన్‌గా పనిచేశాడు. అతడికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్. ఐపీఎల్‌లో జట్టుకు నాయకత్వం వహించగలిగితే.. ప్రపంచంలోని ఏ జట్టునైనా ముందుకు నడిపించగలడు.
అది టీమిండియా అయినా కావచ్చు. అయ్యర్ భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడని" టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్భాజ్ పేర్కొన్నాడు. కాగా గుర్బాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ జరగుతున్న వన్డే సిరీస్‌లో ఆఫ్గాన్ జట్టులో భాగంగా ఉన్నాడు.
చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌లో భారత్‌దే పై చేయి.. ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడని దాయాదులు!
Comments
Please login to add a commentAdd a comment