Krunal Pandya: టీమిండియా ఆల్‌రౌండర్, హార్ధిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు. కృనాల్ భార్య పంఖురి శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ ఇవాళ (జులై 24) మధ్యాహ్నం ట్విటర్ వేదికగా రివీల్ చేశాడు. భార్య పంఖురి చేతిలో ఒదిగిన బిడ్డను ముద్దాడుతూ దిగిన ఫోటోను కృనాల్ ట్విటర్‌లో షేర్ చేశాడు. కవిర్ కృనాల్ పాండ్యా అంటూ ఫోటోకు క్యాప్షన్‌ను జోడించాడు.
Kavir Krunal Pandya 🌎💙👶🏻 pic.twitter.com/uitt6bw1Uo
— Krunal Pandya (@krunalpandya24) July 24, 2022
విషయం తెలుసుకున్న సన్నిహితులు, సహచరులు కృనాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పోస్ట్ షేర్ చేసిన కొద్ది నిమిషాలకే వైరలైంది. దీంతో అభిమానులు కూడా కృనాల్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. కృనాల్ 2017లో ప్రముఖ మోడల్ పంఖురి శర్మను పెళ్లాడాడు.
ఇదిలా ఉంటే, టీమిండియా తరఫున 19 టీ20లు, 5 వన్డేలు ఆడిన కృనాల్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌కు వలస వెళ్లాడు. అతను ఇటీవలే ఇంగ్లీష్ కౌంటీ జట్టైన వార్విక్‌షైర్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బ్యాటర్ అయిన కృనాల్.. వన్డే అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (26 బంతుల్లో) బాదడంతో ఇటీవల వార్తల్లో నిలిచాడు.
చదవండి: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..?
Comments
Please login to add a commentAdd a comment