టీమిండియా కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ త్వరలో ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ (చేతికి గాయం) సుందర్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లంకాషైర్ అతనితో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్న సుందర్.. త్వరలో ప్రారంభంకానున్న కౌంటీ సీజన్‌లో సత్తా చాటి టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాగా, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటడం ద్వారా సుందర్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడిన మరో ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ ఇంకా కోలుకోలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సుందర్‌తో పాటు ఎన్‌సీఏ రిహాబిలిటేషన్‌లో ఉన్న చాహర్.. పూర్తిగా కోలుకోవడానికి మరో ఐదు వారాల సమయం పడుతుందని మీడియాలో కధనాలు వినిపిస్తున్నాయి. దీంతో అతన్ని ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు పరిగణలోకి తీసుకోవడంలేదని ప్రచారం జరుగుతుంది. కాగా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్‌లను గతేడాది ఐపీఎల్ మెగా వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: రోహిత్, కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్..!
Comments
Please login to add a commentAdd a comment