Ind vs NZ 2nd Odi: Hardik Pandya Registered Best Bowling Figures - Sakshi
Sakshi News home page

IND VS NZ 2nd ODI: తొలి వన్డేలో 7 ఓవర్లలో 70.. రెండో మ్యాచ్‌లో 6-3-16-2

Published Sat, Jan 21 2023 5:05 PM | Last Updated on Sat, Jan 21 2023 6:13 PM

IND VS NZ 2nd ODI: Hardik Pandya Registered Best Bowling Figures - Sakshi

Hardik Pandya: రాయ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా బంతితో విజృంభించాడు. 6 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు (కాన్వే, సాంట్నర్‌) పడగొట్టాడు. హార్ధిక్‌ తన స్పెల్‌లో ఏకంగా 3 మెయిడిన్‌ ఓవర్లు సంధించడం విశేషం.

హార్ధిక్‌తో పాటు షమీ (6-1-18-3), సిరాజ్‌ (6-1-10-1), శార్దూల్‌ (6-1-26-1), కుల్దీప్‌ (7.3-0-29-1), వాషింగ్టన్‌ సుందర్‌ (3-1-7-2) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో రెండో వన్డేలో భారత్‌.. న్యూజిలాండ్‌ను 108 పరుగులకే కుప్పకూల్చింది.  న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (36), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (22), మిచెల్‌ సాంట్నర్‌ (27) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 

కాగా, తొలి వన్డేలో 7 ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకుని చెత్తగా బౌలింగ్‌ చేసిన హార్ధిక్‌.. మరుసటి మ్యాచ్‌లోనే ఊహించని రీతిలో రికవర్‌ అయ్యి  బౌలింగ్‌ చేయడంతో భారత క్రికెట్‌ అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హార్ధిక్‌ ఓ ఫైటర్‌ అంటూ తెగ మోసేస్తున్నారు. 6 ఓవర్లలో ఏకంగా 3 మెయిడిన్లు వేయడం అద్భుతమని కొనియాడుతున్నారు.

నిజానికి హార్ధిక్‌ ఈ మ్యాచ్‌లో ఫ్రంట్‌ లైన్‌ పేసర్‌గా సత్తా చాటాడు. షమీ, సిరాజ్‌లతో పోటీ పడి మరీ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. రెండో వన్డేలో హార్ధిక్‌ ప్రదర్శన తర్వాత కొందరు భారత అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ మ్యాచ్‌లో విఫలమైతే దూషించడం, మరుసటి మ్యాచ్‌లో రాణిస్తే ఆకాశానికెత్తడం షరా మామూలుగా మారిందని కామెంట్లు పెడుతున్నారు.      


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement