ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడని తెలుస్తుంది. ఈ నెల 22న భారత్.. ధర్మశాలలో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్‌కు హార్ధిక్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. హార్ధిక్‌ను హుటాహుటిన బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించినట్లు తెలుస్తుంది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా లిటన్ దాస్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్‌ను ఆపబోయి హార్దిక్ ఎడమ కాలిని గాయపరచుకున్నాడు. బంతిని ఆపే ప్రయత్నంలో హార్ధిక్ మడమ మడతపడటంతో నొప్పితో విలవిలలాడుతూ ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మిగిలిన ఓవర్‌ను కోహ్లి పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా హార్ధిక్ బరిలోకి దిగలేదు. హార్ధిక్ గాయం అంత తీవ్రమైంది కాదని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చెప్పినప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం హార్ధిక్ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతమైన శతకంతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment