టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన (చీలమండ గాయం) స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వరల్డ్‌కప్ అనంతరం భారత్ ఆడబోయే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లకు దూరం కానున్నాడు.
హార్థిక్ గాయానికి శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తుంది. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చని సమాచారం. ఈ మధ్యలోనే భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాను వారి గడ్డపై ఢీకొట్టాల్సి ఉంది.
కాగా, వరల్డ్‌కప్ అనంతరం నవంబర్ 23 నుంచి భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం డిసెంబర్ 10 నుంచి 2024 జనవరి 7 వరకు సౌతాఫ్రికాతో 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ బెర్త్‌లు ఖరారైన విషయం తెలిసిందే. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు భారత్.. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment