బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ (భారత బౌలింగ్) 8వ ఓవర్ మూడో బంతికి లిటన్ దాస్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్‌ను ఆపబోయి హార్దిక్ కుడి కాలిని గాయపరుచుకున్నాడు. బంతి బలంగా తాకడంతో హార్దిక్ తీవ్ర అసౌకర్యానికి లోనై ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మిగిలిన ఓవర్‌ను కోహ్లి పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా హార్ధిక్ బరిలోకి దిగలేదు. హార్ధిక్ నొప్పితో విలవిలలాడుతుండటంతో గాయం తీవ్రతను తెలుసుకునేందుకు డాక్టర్లు స్కానింగ్‌కు రెఫర్ చేశారు. రిపోర్ట్‌లపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
🚨 Update 🚨
— BCCI (@BCCI) October 19, 2023
Hardik Pandya's injury is being assessed at the moment and he is being taken for scans.
Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #TeamIndia | #INDvBAN | #MeninBlue pic.twitter.com/wuKl75S1Lu
అయితే, హార్ధిక్ గాయంపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ కీలక అప్‌డేట్ ఇచ్చి అభిమానులను ఊపిరిపీల్చుకునేలా చేశాడు. హార్ధిక్ గాయం తీవ్రతపై ఆందోళన చెందుతున్న అభిమానులకు రోహిత్ గుడ్‌న్యూస్ చెప్పాడు. హార్ధిక్ గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడు. బంతి బలంగా తాకడంతో నొప్పి అధికంగా ఉందని, త్వరలోనే అది సర్దుకుంటుందని తెలిపాడు. రోహిత్ ఇచ్చిన క్లూతో ఊపిరిపీల్చుకున్న హార్ధిక్ అభిమానులు.. తమ ఫేవరెట్ క్రికెటర్ టీమిండియా ఆడబోయే అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని నిర్ధారించుకున్నారు. ఏదిఏమైనప్పటికీ బీసీసీఐ నుంచి అప్‌డేట్ వస్తే తప్పించి, హార్ధిక్ విషయంలో ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment