
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో గిల్ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడటంం అనుమానంగా మారింది. గిల్ త్వరగా కోలుకుని ఆసీస్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాలని యావత్ భారత దేశం కోరుకుంటుంది. గిల్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ కూడా కోరుకుంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. అయితే సారా చేసిన ఈ ట్వీట్ ఫేక్ అని కూడా ప్రచారం జరుగుతుంది. సారాకు అసలు ట్విటర్ అకౌంటే లేదని గతంలో సచిన్ చెప్పాడు. దీంతో సారా ఈ ట్వీట్ చేసిందా లేదా వేరెవరైనా ఫేక్ ట్వీట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.
Get well soon #ShubmanGill 💙🇮🇳 pic.twitter.com/sF1Nlr9Qbj
— Sara Tendulkar (@imsaratendulkar) October 6, 2023
కాగా, శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని గత కొంతకాలంగా సోషల్‌మీడియా కోడైకూస్తున్న విషయం తెలిసిందే. సారా తాజా ట్వీట్ నేపథ్యంలో ఈ వార్తలు నిజమేనని నెటిజన్లు అనుకుంటున్నారు. మొత్తానికి గిల్ కోసం సారా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, ఇటీవల శుభ్‌మన్ బర్త్ డే సందర్భంగా సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ కూడా వైరలైన విషయం తెలిసిందే. సచిన్ గిల్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే, భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను రేపు (అక్టోబర్ 8) ఆడనుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియంలో టీమిండియా ఆసీస్‌ను ఢీకొంటుంది. డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్న గిల్ ఈ మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది. మరోవైపు టీమిండియా హార్దిక్ పాండ్యా సేవలను కూడా కోల్పోనున్నట్లు తెలుస్తుంది. చెన్నైలో ప్రాక్టీస్ చేస్తుండగా హార్దిక్ గాయపడ్డాడని సమాచారం. ఒకవేళ రేపటి మ్యాచ్‌లో గిల్, హార్దిక్‌లు ఆడకపోతే అది టీమిండియాపై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment