ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో అతడి స్థానాన్ని భర్తీ చేసే సత్తా రవిచంద్రన్ అశ్విన్‌కు ఉందని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరి అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్‌కు జడేజా దూరం కావడంతో ఆనూహ్యంగా అశ్విన్‌కు చోటు దక్కింది.
కాగా వెటోరి ప్రస్తుతం భారత వేదికగా జరుగుతోన్న లెజెండ్స్‌లో లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో ది హిందూతో వెటోరి మాట్లాడుతూ.. "అశ్విన్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్. అతడు తన క్యారమ్ బల్స్‌తో బ్యాటర్లను మప్పుతిప్పలు పెట్టగలడు. అశ్విన్ ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా రాణించాడు.
కాబట్టి అతడికి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. అశ్విన్ టీ20 ప్రపంచకప్-2022లో భారత జట్టుకు కీలకం కానున్నాడు. అతడికి ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం చాలా ఉంది. ముఖ్యంగా జట్టులో రవీంద్ర జడేజా స్థానాన్ని అశ్విన్ భర్తీ చేయగలడు అని పేర్కొన్నాడు.
చదవండి: 'అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపికచేయాల్సింది.. బాబర్‌కు సపోర్ట్‌గా ఉండేవాడు'
Comments
Please login to add a commentAdd a comment