రైలు పట్టాలపై సిమెంట్‌ బ్రిక్స్‌   | Cement bricks on railway track | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై సిమెంట్‌ బ్రిక్స్‌  

Published Thu, May 17 2018 2:17 PM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM

Cement bricks on railway track - Sakshi

సంఘటన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న రైల్వే ఎస్పీ

రైల్వేగేట్‌ : రైలు పట్టాల మధ్య సిమెంట్‌ బ్రిక్స్‌ పెట్టిన సంఘటనపై బుధవారం రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్‌ పరిశీలించారు. వరంగల్‌ జీఆర్‌పీ సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల15న ఉదయం 11.25 గంటల సమయంలో చింతలపల్లి, వరంగల్‌ రైల్వే స్టేషన్‌ల మధ్య 386/25–23 అప్‌లైన్‌  మైలు రాయివద్ద ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు 10 నుంచి 15 కిలోల బరువున్న సిమెంట్‌ బ్రిక్స్‌ పెట్టారు.

అదే సమయంలో గుంటూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (17201) వస్తుంది. ఈ క్రమంలో రైలును కాసేపు నిలిపారు. అనంతరం బ్రిక్స్‌ తొలగించాక రైలు కదిలింది. ఈ సంఘటనపై బుధవారం రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్రాక్‌ల మధ్య సిమెంట్‌ బ్రిక్స్‌పెట్టిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ జీఆర్‌పీ సీఐ జూపల్లి వెంకటరత్నం, సిబ్బంది ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement