గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.తదియ ప.11.54 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: పుష్యమి రా.3.26 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ఉ.11.11 నుండి 12.46 వరకు, దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.17 వరకు, అమృతఘడియలు: రా.8.55 నుండి 10.33 వరకు, సంకటహర చతుర్థి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.28, సూర్యాస్తమయం: 5.25.
మేషం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. బంధువులు, మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
వృషభం: కొత్త పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.
మిథునం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అదనపు ఖర్చులు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని ఇబ్బందులు. శ్రమాధిక్యం.
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలలో పురోగతి.. పనులు చకచకా పూర్తి చేస్తారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం: కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఖర్చులు అధికం. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం.
కన్య: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో మరింత సఖ్యత. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి.
తుల: పనుల్లో విజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకుల. వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పకపోవచ్చు.
మకరం: పరిచయాలు పెరుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి..
మీనం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం.
–––––––––––––––––––––
Comments
Please login to add a commentAdd a comment