'సెల్ ఫోన్ లైట్లతో పంట నష్టం అంచనా వేయడం దారుణం'
ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 33 మంది ఎంపీలు లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో వారు కీలక పాత్ర పోషించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంపై చిన్న చూపు చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ను బీజేపీ నేతలు కలిశారు.
అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. పై-లిన్ తుపాన్ బాధితులను ఆదుకోవడానికి రూ.46 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, అయితే కేంద్రం మాత్రం రూ. 2 వేల కోట్లు ఇచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లైట్లతో పంట నష్ట్రాన్ని అంచనా వేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. పంట పోయిందని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.